News


ఈ షేర్లు.. ఏడారిలో మంచినీటి చెలమలు..?

Friday 20th September 2019
Markets_main1568919625.png-28439

ఈ ఏడాది ఇంత వరకు ఇన్వెస్టర్లకు స్టాక్‌ మార్కెట్లు నికరంగా లాభాలను ఇచ్చిందేమీ లేదు. చాలా స్టాక్స్‌ కొత్త కనిష్టాలకు చేరాయి. ఇంకా పడిపోతూనే ఉ‍న్నాయి. కానీ, ఇంత ప్రతికూల వాతావరణంలోనూ ఇటీవల ఐపీవోలు ముగించుకుని స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన కొన్ని మాత్రం లాభాల మెరుపులు మెరిపిస్తున్నాయి. 

 

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
ఈ షేరు ఈ నెల 12న రూ.2,697.50 ధర పలికింది. అదే రోజు నాటికి, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ జూన్‌ 4న నమోదైన 40,312 నుంచి 8 శాతం దిగువకు వచ్చి చేరింది. ఇష్యూ ధర(రూ.1,100)పై హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ నికరంగా 143 శాతం లాభాలను ఇప్పటి వరకు పంచింది. 2018 ఆగస్ట్‌లో ఈ కంపెనీ మార్కెట్లో లిస్ట్‌ అయింది. ‘‘బలమైన పేరెంట్‌ గ్రూపు. బలమైన ట్రాక్‌ రికార్డు ఈ షేరు ధరను పరిగెత్తిస్తోంది. గత నాలుగేళ్లుగా ఏటా 15-20 శాతం చొప్పున వృద్ధిన నమోదు చేస్తోంది. కేవలం మూడు నెలల్లోనే 60 శాతం పెరిగినందున షేరుకు ఇది సహేతకు ధర. ఈ స్థాయి నుంచి ఇప్పటికిప్పుడు పెద్దగా పెరగకపోవచ్చు’’ అని ఈల్డ్‌ మ్యాగ్జిమైజర్‌ వ్యవస్థాపకుడు యోగేష్‌ మెహతా అన్నారు. 

 

ఫైన్‌ ఆర్గానిక్స్‌
ఈ షేరు కూడా గతేడాది జూలైలో లిస్ట్‌ అయింది. ఇష్యూ ధర నుంచి చూస్తే ఇప్పటి వరకు 102 శాతం పెరిగింది. ఈ స్టాక్‌ ఈ నెల 17న రూ.1,580 వద్ద ట్రేడ్‌ అయింది. ఐపీవో ఇష్యూ ధర రూ.783. ఓలియో కెమికల్‌ ఆధారిత అడిటివ్స్‌ తయారీలో అతిపెద్ద కంపెనీ. అంతర్జాతీయంగానూ బలమైన కంపెనీగా కొనసాగుతోంది. ఆహారం, పాలీమర్‌, కాస్మెటిక్స్‌, పెయింట్స్‌, ఇంక్‌, కోటింగ్‌ల్లో ఈ కంపెనీ ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. ‘‘ఫైన్‌ ఆర్గానిక్స్‌ వ్యాపార మోడల్‌ను మేం ఇష్టపడతాం. ఈ కంపెనీ ఉత్పత్తులకు బలమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయి. అయితే, ప్రత్తుత అధిక వ్యాల్యూషన్ల కారణంగా ఇక్కడ నుంచి పరిమితంగా పెరిగేందుకే అవకాశాలు ఉన్నాయి’’ అని ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. 

 

ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌
2018 ఆగస్ట్‌ 8న ఈ కంపెనీ లిస్ట్‌ కాగా, ఇష్యూ ధర నుంచి ఇప్పటి వరకు 84 శాతం లాభాను పంచింది. ఐఎఫ్‌సీ నుంచి రూ.345 కోట్ల పెట్టుబడులు ఇటీవలే ఈ కంపెనీకి వచ్చాయి. ఐఎఫ్‌సీ అన్నది ప్రపంచబ్యాంకు మెంబర్‌. రిటైల్‌, అఫర్డబుల్‌ ఇళ్లకు రుణాలను ఈ కంపెనీ అందిస్తుంది. తక్కువ, మధ్యాదాయ వర్గాలను ఎక్కువగా లక్ష్యం చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

 

ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌
ఈ ఏడాది జూలై 9న లిస్ట్‌ అయింది. ఐపీవోలో ఒక్కో షేరును రూ.973కు ఆఫర్‌ చేసింది. 18న క్లోజింగ్‌ ధర రూ.1,627. అంతకుముందు గరిష్ట ధర రూ.1,782. ఈ స్టాక్‌కు ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ రూ.1,900 టార్గెట్‌ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో బిజినెస్‌ టు బిజినెస్‌ విభాగంలో ఇండియామార్ట్‌ అతిపెద్ద సంస్థగా ఉంది. ఈ సంస్థ ప్లాట్‌ఫామ్‌ కొనుగోలుదారులు, సరఫరాదారులను కలిపే వేదిక. జూన్‌ నాటికి 8.8 కోట్ల రిజిస్టర్డ్‌ కొనుగోలుదారులు 6.2 కోట్ల ఉత్పత్తులు, సేవల గురించి ఇండియామార్ట్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా తెలుసుకున్నారు.  You may be interested

ఎంఎస్‌ఎంఈలలకు కేంద్రం వరం!

Friday 20th September 2019

2020 మార్చి వరకు ఎన్‌పీఏలుగా ప్రకటించొద్దు ప్రభుత్వరంగ బ్యాంకులకు సూచనలు వచ్చే నెల దేశవ్యాప్తంగా రుణ మేళాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) సంబంధించి ఒత్తిడిలో ఉన్న ఏ ఒక్క రుణాన్ని నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా 2020 మార్చి వరకు ప్రకటించొద్దని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను కోరింది. వాటి రుణాల పునరుద్ధరణపై పనిచేయాలని సూచించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ఈ స్థాయిల్లోనే మార్కెట్లు బోటమ్‌ అవుట్‌: సభర్వాల్‌

Friday 20th September 2019

దేశంలో కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోతున్నప్పటికీ... వచ్చే ఏడాది అమ్మకాల్లో 30 శాతం వరకు వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆస్క్‌సందీప్‌సభర్వాల్‌ డాట్‌కామ్‌ వ్యవస్థాకపుడు సందీప్‌ సభర్వాల్‌. మార్కెట్లు ఈ స్థాయిలో బోటమ్‌ అవుట్‌ కావచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పలు అంశాలపై ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.    కార్ల అమ్మకాలు పడిపోవడానికి ఓలా, ఊబర్‌ కారణం కాదన్నారు సభర్వాల్‌. మార్కెట్లో నిధుల లభ్యత తగ్గిపోవడమే అమ్మకాలు 25

Most from this category