News


షార్ట్‌టర్మ్‌ కోసం ఐదు ఐడియాలు!

Monday 23rd December 2019
Markets_main1577075562.png-30377

స్వల్పకాలానికి మంచి రాబడినిచ్చే ఐదు రికమండేషన్లను యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అందిస్తోంది.
1. కెనెరాబ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 242. స్టాప్‌లాస్‌ రూ. 220. డైలీ చార్టుల్లో హయ్యర్‌హై, హయ్యర్‌ లో ఏర్పాటు చేస్తూ వస్తోంది. వీక్లీ చార్టుల్లో ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం షేరు ధర కీలక 20, 50, 100 డీఎంఏ స్థాయిలకు పైన కదలాడుతూ బలంగా ఉంది. 
2. ఐసీఐసీఐ లొంబార్డ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1500. స్టాప్‌లాస్‌ రూ. 1363. డైలీ చార్టుల్లో కీలక నిరోధం రూ. 1400 నుంచి బ్రేకవుట్‌ సాధించినట్లు కనిపిస్తోంది. ఈ బ్రేకవుట్‌ అనంతరం ధర సదరు నిరోధానికి పైనే కదలాడడం పాజిటివ్‌ పరిణామం. ఇండికేటర్లన్నీ అప్‌మూవ్‌కు అనుకూలంగా ఉన్నాయి. 
3. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1240. స్టాప్‌లాస్‌ రూ. 1120. వీక్లీ చార్టుల్లో ఏడాది కాలంగా అడ్డుకుంటున్న అధోముఖ వాలు రేఖ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. ఇది షార్ట్‌టర్మ్‌ ట్రెండ్‌ రివర్సల్‌కు సంకేతం. ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్‌ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. 
4. అరబిందో ఫార్మా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 485. స్టాప్‌లాస్‌ రూ. 445. నెల రోజుల నుంచి అడ్డుపడుతున్న రూ. 455 నిరోధాన్ని ఎట్టకేలకు విజయవంతంగా ఛేదించింది. షేరు ధర ముఖ్యమైన డీఎంఏలకు పైన కదలాడడం పాజిటివ్‌ సెంటిమెంట్‌కు సంకేతం.
5. బ్రిటానియా ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3300. స్టాప్‌లాస్‌ రూ. 3020. వీక్లీ చార్టుల్లో బహుళ నిరోధ జోన్‌ రూ.3000 స్థాయిలనుంచి బయటపడి ఆపైన స్థిరపడింది. మూడు నాలుగు వారాలుగా ఇక్కడ కన్సాలిడేషన్‌ జరుపుతోంది. తాజాగా స్వల్పకాలిక ఇండికేటర్లన్నీ బుల్లిష్‌ మూవ్‌కు అనుగుణంగా మారాయి. 



You may be interested

బడా ఇన్వెస్టర్లు మక్కువ చూపుతున్న టాప్‌ 20 షేర్లివే!

Monday 23rd December 2019

పోర్టుఫోలియో మేనేజర్లు, అల్ట్రారిచ్‌ ఇన్వెస్టర్లు కొన్ని ఎంపిక చేసిన స్టాకులపైనే మక్కువ చూపుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో చాలా షేర్లు ఇప్పటికే మంచి ర్యాలీ జరిపినా, ఇంకా వీటిపైనే బడా ఇన్వెస్టర్లు ఆధారపడుతున్నట్లు పైసాబజార్‌ గణాంకాలు చూపుతున్నాయి. ఇలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల నమ్మకం చూరగొన్న స్టాకుల్లో హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌బ్యాంక్‌, కోటక్‌మహీంద్రాబ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ తదితర దిగ్గజాలున్నాయి. పెద్ద ఇన్వెస్టర్లు మక్కువ చూపుతున్న టాప్‌ 20 స్టాక్స్‌... మార్కెట్లో స్మార్ట్‌మనీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్యాప్‌డౌన్‌

Monday 23rd December 2019

ప్రభుత్వంతో వివాద వార్తల నేపథ్యంలో ఇంధన రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) కౌంటర్‌ బలహీనంగా ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల సమయానికి బీఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 2 శాతం క్షీణించి రూ. 1570 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1555 వరకూ నీరసించింది. కారణమేమిటంటే... పన్నా ముక్తా తపతి చమురు గ్యాస్‌ క్షేత్రాల నుంచి ఆర్జించిన లాభాలలో 350 కోట్ల డాలర్ల(రూ. 24500 కోట్లు)ను మధ్యవర్తిత్వ బకాయిలను చెల్లించవలసి ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్న

Most from this category