News


ఈ స్టాక్స్‌పై అంతర్జాతీయ బ్రోకరేజీలు సానుకూలం

Sunday 8th December 2019
Markets_main1575829090.png-30112

ఇండెక్స్‌లో ప్రధాన స్టాక్స్‌ విలువలు అధిక స్థాయికి చేరిపోవడం, దేశ జీడీపీ వృద్ధి కనిష్ట స్థాయికి చేరడం, అమెరికా-చైనా ట్రేడ్‌ డీల్‌ ఆలస్యమవ్వచ్చన్న అంశాలు... మన మార్కెట్లకు గరిష్ట స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడికి కారణమవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 12 శాతం పెరగ్గా, మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 4 శాతం, 9 శాతం చొప్పున నష్టపోయాయి. విలువల పరంగా చూస్తే సెన్సెక్స్‌ 28.7పీఈ వద్ద ట్రేడవుతోంది. కానీ ఐదేళ్ల సగటు పీఈ 22.6తో పోలిస్తే అధిక వ్యాల్యూషన్‌లో ఉంది. ఈ సమయంలో ఎంపిక చేసిన బ్లూచిప్‌ స్టాక్స్‌ పట్ల అంతర్జాతీయ బ్రోకరేజీలు సానుకూలంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు వీటిపై దృష్టి సారించొచ్చు.

 

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌
జేపీ మోర్గాన్‌ జీ ఎంటర్‌టైమన్‌మెంట్‌ పట్ల బుల్లిష్‌గా ఉంది. న్యూట్రల్‌ రేటింగ్‌ను కొనసాగించింది. కాకపోతే టార్గెట్‌ ధరను రూ.260 నుంచి రూ.320కు పెంచింది. జీ దేశీయ సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయ వృద్ధి ఆరోగ్యంగా ఉందని పేర్కొంది. బ్యాలన్స్‌ షీటు, క్యాష్‌ ఫ్లో మెరుగు పడడం, జీ5 సక్సెస్‌ కావడం రీ రేటింగ్‌కు కారణమని జేపీ మోర్గాన్‌ తన నోట్‌లో తెలిపింది.

 

భారతీ ఎయిర్‌టెల్‌
భారతీ ఎయిర్‌టెల్‌ స్టాక్‌కు బై రేటింగ్‌ను హెచ్‌ఎస్‌బీసీ ఇచ్చింది. టార్గెట్‌ ధరను మాత్రం గతంలో ఇచ్చిన రూ.520 నుంచి రూ.540కు పెంచింది. కంపెనీ నిధుల సమీకరణతో పెరిగే ఈక్విటీ స్వల్ప కాలంలో షేరుపై ఒత్తిడికి దారితీయవచ్చని పేర్కొంది. అయితే, నిధుల సమీకరణ మధ్య కాలానికి కంపెనీ బ్యాలన్స్‌ షీటుకు మంచి చేస్తుందని, రానున్న కొన్ని వారాల్లో ఎన్నో అంశాలపై నియంత్రణపరమైన స్పష్టత రానుందని అంంచనా వేసింది.

 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు అంతర్జాతీయ బ్రోకరేజీ దిగ్గజం నోమురా బై రేటింగ్‌ను కొనసాగించింది. టార్గెట్‌ ధరను రూ.1,785 నుంచి రూ.2,020కు పెంచింది. జియో టారిఫ్‌లను అధికంగా పెంచడం సానుకూలతకు కారణమని పేర్కొంది. టారిఫ్‌లను ఇంకా పెంచే అవకాశాలున్నాయని, పోటీ సంస్థలతో పోలిస్తే జియో టారిఫ్‌లు ఇప్పటికీ తక్కువే ఉన్నందున మార్కెట్‌ వాటా పెరిగే అవకాశం కూడా ఉందని అంచనా వేసింది.

 

టెక్‌ మహీంద్రా 
ఐటీ సంస్థ టెక్‌ మహీంద్రాకు గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ బై రేటింగ్‌ కొనసాగిస్తూ రూ.890 లక్ష్యిత ధరగా ఇచ్చింది. టెలికం విభాగంలో మంచి వృద్ధి రికవరీకి అవకాశం ఉందని పేర్కొంది.

 

ఐసీఐసీఐ బ్యాంకు
ఐసీఐసీఐ బ్యాంకుకు అవుట్‌పెర్‌ఫార్మ్‌ కాల్‌ను మాక్వేర్‌ కొనసాగించింది. రూ.615 టార్గెట్‌గా ఇచ్చింది. రిటైల్‌, కార్పొరేట్‌ ఆస్తుల నాణ్యత మంచిగా ఉందని, బ్యాంకింగ్‌ రంగంలో ఈ స్టాక్‌ టాప్‌ పిక్‌ అని ఈ సంస్థ పేర్కొంది.You may be interested

మీ రిస్క్‌ను అంచనా వేయడం ఎలా?

Sunday 8th December 2019

పెట్టుబడులను ఆరంభించే వారు ముందుగా వారి రిస్క్‌ సామర్థ్యంపై స్పష్టతకు రావడం అవసరం. తమ లక్ష్యాలు, వాటికున్న కాల వ్యవధి, ఆశించే రాబడులు ఇవన్నీ రిస్క్‌ సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. ఈ కింద ప్రశ్నల ద్వారా ఇన్వెస్టర్లు తమ రిస్క్‌ను అంచనా వేసుకోవచ్చని ఎడెల్‌వీజ్‌ పర్సనల్‌ వెల్త్‌ అడ్వైజరీ విభాగం హెడ్‌ రాహుల్‌జైన్‌ తెలియజేశారు.    ఇన్వెస్ట్‌ చేయతగిన మిగులు ఎంత? మీ ఇన్వెస్ట్‌మెంట్‌ మిగులు మీ రిస్క్‌ సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. మీ ఇన్వెస్ట్‌మెంట్‌ మిగులు

పన్ను రేట్ల తగ్గింపు...వృద్ధి పెంపుపై దృష్టి: ఆర్థిక మంత్రి సీతారామన్‌

Saturday 7th December 2019

కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రణాళికల్లో  భాగంగా ‘‘పన్ను రేట్ల తగ్గింపు’’ ప్రతిపాదన పై కూడా ఆలోచనలు చేస్తున్నటు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో శనివారం సీతారామన్ వివిధ ఆర్థిక సమస్యలపై స్పందించారు. పన్నుల వ్యవస్థను మరింత సులభం చేయడంతో పాటు ఎలాంటి వేధింపులు లేకుండా చేస్తామని తెలిపారు. మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే దిశగా ఉద్దీపన అంశాలపై ఆర్థికవేత్తల సలహాలను వింటున్నామన్నారు. జీఎస్‌టీపై ఆందోళన

Most from this category