News


టాప్‌ బ్రోకరేజ్‌ల నుంచి ఐదు సిఫార్సులు

Tuesday 17th December 2019
Markets_main1576565627.png-30271

లాంగ్‌టర్మ్‌కు దాదాపు 31 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. 
1. వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌: షేర్‌ఖాన్‌ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 285. బహుళముఖ వ్యూహంతో అనుకున్న రెవెన్యూ గ్రోత్‌ గైడెన్స్‌ను సాధించగలదు. ప్రస్తుతం సరసమైన పీఈ వద్ద ట్రేడవుతోంది. రాబోయే సంవత్సరాల్లో 20 శాతం నికర ఎర్నింగ్స్‌లో చక్రీయ వార్షిక వృద్ది ఉంటుందని అంచనా. టైర్‌2, 3 నగరాల్లోకి వేగంగా విస్తరించడం, లోమార్జిన్‌ ఉత్పత్తులను ప్రీమియం ఉత్పత్తులతో భర్తీ చేయడం, కిచెన్‌, వాటర్‌ ప్యూరిఫైర్‌ విభాగాల్లో నూతన ఉత్పత్తులు తీసుకురావడం... తదితరాలు స్థూల మార్జిన్లను పెంచుతాయి. 
2. హెచ్‌యూఎల్‌: మోతీలాల్‌ ఓస్వాల్‌ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2378. కొత్తగా ప్రచార వ్యయాలు పెంచకపోయినా మార్కెట్లో దూసుకుపోతోంది. చానెల్‌ లిక్విడిటీలో క్రమానుగత మెరుగుదల చూపుతోంది. మార్కెట్‌లో ముఖ్యంగా ప్రీమియం విభాగంలో వాటా పెంచుకోవడంపై ఎక్కువ ఫోకస్‌ చేస్తోంది.
3. వోల్టాస్‌: మోతీలాల్‌ ఓస్వాల్‌ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 785. యూఎస్‌, చైనా ట్రేడ్‌వార్‌తో బాగా లబ్ది పొందుతోంది. చైనాలో నెలకొన్న భారీ ఇన్వెంటరీలను భారీ డిస్కౌంట్‌పై సొంతం చేసుకుంటోంది. ధరలు పెంచకపోయినా 11 శాతం ఎబిటా మార్జిన్‌ సాధించగలదు. వచ్చే వేసవిలో ఏసీ వ్యాపారం మరింత జోరందుకుంటుందని అంచనా.
4. సెక్యూరిటీ అండ్‌ ఇంటిలిజెన్స్‌ సర్వీసెస్‌ ఇండియా: ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1049. వివిధ మార్గాల్లో(ఆర్గానిక్‌- సొంత విస్తరణ, అనార్గానిక్‌- వేరే కంపెనీలను కొని విస్తరించడం) అనేక మార్కెట్లలో, పలు విభాగాల్లో విస్తరిస్తోంది. దీంతో భారత్‌, ఆస్ట్రేలియాల్లో టాప్‌ సెక్యూరిటీ సర్వీసులు అందించే సంస్థగా నిలిచింది. క్యు2లో ప్రాఫిట్‌ మార్జిన్లు బాగా పెరిగాయి. తాజాగా సింగపూర్‌, న్యూజిలాండ్‌లో అడుగుపెట్టింది. 
5. రిలాక్సో ఫుట్‌వేర్‌: ఆనంద్‌రాఠీ సిఫార్సు. టార్గెట్‌ రూ. 744. గ్రామీణ భారతంలో బాగా విస్తరిస్తోంది. హోమ్‌వేర్‌, లీజర్‌ ఫుట్‌వేర్‌ విభాగంలో మంచి పురోగతి సాధిస్తోంది. భివాడీ ప్లాంట్‌ సామర్ధ్యాన్ని వచ్చే మూడేళ్లలో రూ. 90 కోట్లు వెచ్చించి రోజుకు లక్ష జతలకు పెంచాలని ప్రణాళిక సిద్ధం చేసింది. You may be interested

ఆల్‌టైం హైకి బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 17th December 2019

మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్లతో మంగళవారం ట్రేడింగ్‌లో బ్యాంక్‌ నిప్టీ ఇండెక్స్‌ కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఇండెక్స్‌ 32వేల స్థాయి పైన 32,082.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌ ప్రక్రియ సోమవారం పూర్తయ్యిందని ఆర్సెలర్‌ మిట్టల్‌ ప్రకటించింది. దివాలా చట్టం కింద పరిష్కారమైన అతిపెద్ద రికవరీ ఇదే కావడంతో పలు బ్యాంకింగ్‌

స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 17th December 2019

గత వారం ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన వాణిజ్య ఒప్పందంపై నిరాశావాదం నెలకొనడంతో ఆసియాలో మంగళవారం పసిడికి డిమాండ్‌ పెరిగింది. నేటి ఉదయం ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు లాభపడి 1,482 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వైట్‌హౌస్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ లారీ కుడ్లీ చైనాతో వాణిజ్య ఒప్పందం ఖచ్చితంగా కుదిరిందని వివరణ ఇచ్చినప్పటికీ కొందరు ట్రేడర్లు బీజింగ్‌తో ఒప్పందం ఖరారుపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరుదేశాల మధ్య

Most from this category