News


47 స్టాకుల్లో ఎంఏసీడీ నెగిటివ్‌ సంకేతాలు

Tuesday 12th February 2019
Markets_main1549953616.png-24153

సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో నిఫ్టీ 10900 పాయింట్ల దిగువకు చేరింది. సోమవారం ముగింపు చార్టుల్లో 47 స్టాకుల్లో ఎంఏసీడీ ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు వెలువరిస్తోంది. ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఈ షేర్లు బేరిష్‌
సోమవారం ముగింపు ప్రకారం 47 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఏబీబీ ఇండియా, వరుణ్‌ బెవరేజెస్‌, ఆసహి ఇండియా, గ్లాస్‌, వెంకీస్‌ ఇండియా, డా.లాల్‌పాత్‌ ల్యాబ్స్‌, ఎస్‌పీఎంఎల్‌ ఇన్‌ఫ్రా, కేసీపీ, ఆర్‌పీఎల్‌ లైఫ్‌సైన్సెస్‌, మిండా ఇండస్ట్రీస్‌, ద్వారకేశ్‌ సుగర్స్‌, ధైరోకేర్‌, నవభారత్‌ వెంచర్స్‌, సిమ్‌కో, కేఈఐ ఇండస్ట్రీస్‌, రుచిరా పేపర్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 31 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలో వొడాఫోన్‌ ఇండియా, మైండ్‌ట్రీ, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌, గాబ్రియేల్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, కాప్లిన్‌ పాయింట్‌, శక్తి పంప్స్‌, ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి.  
మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  

 



You may be interested

కొన్ని ప్రధాన కంపెనీల క్యూ3 ఫలితాలు

Tuesday 12th February 2019

అమరరాజా లాభం రూ.129 కోట్లు డిసెంబరు త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో అమరరాజా నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.134 కోట్ల నుంచి రూ.129 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.1,570 కోట్ల నుంచి రూ.1,707 కోట్లకు ఎగసింది. ఏప్రిల్‌-డిసెంబరు పీరియడ్‌లో రూ.5,267 కోట్ల టర్నోవరుపై రూ.363 కోట్ల నికరలాభం ఆర్జించింది. హెచ్‌బీఎల్‌ పవర్‌ లాభం రూ.7.3 కోట్లు.. క్యూ3లో హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే

35వేల మందికి వీఆర్‌ఎస్‌

Tuesday 12th February 2019

ఎల్‌టీసీ తదితర ప్రయోజనాల నిలిపివేత వ్యయాలు తగ్గించుకునేందుకు బీఎస్‌ఎన్ఎల్ చర్యలు న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ పలు వ్యయ నియంత్రణ చర్యలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఎల్‌టీసీ తదితర ప్రయోజనాలను తాత్కాలికంగా నిలిపివేసింది. 35,000 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌) అమలు చేయాలని భావిస్తోంది. సంస్థ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ ఈ విషయాలు తెలియజేశారు. వ్యయ నియంత్రణ చర్యలతో

Most from this category