News


ఈ స్టాకుల్లో పాజిటివ్‌ సిగ్నల్స్‌!

Tuesday 3rd December 2019
Markets_main1575364563.png-30028

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 45 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో 
కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ, హావెల్స్‌ ఇండియా, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌, శ్రేయ్‌ఇన్‌ఫ్రా, ఎల్‌టీ ఫుడ్స్‌, రాడికో ఖైతాన్‌, ట్రెంట్‌, ఏబీబీ ఇండియా, లవబుల్‌ లింగరీ, జేకే లక్ష్మీ సిమెంట్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 

ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌

మరోవైపు 53 షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలో డిష్‌టీవీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, సువెల్‌ లైఫ్‌సైన్సెస్‌, సెంట్రల్‌బ్యాంక్‌, స్పార్క్‌, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, ఐషర్‌ మోటర్స్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
ఎంఏసీడీ అంటే..

మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
 

ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  



You may be interested

రెండోరోజూ యస్‌ బ్యాంక్‌ పతనం

Tuesday 3rd December 2019

యస్‌బ్యాంక్‌ షేరు వరుసగా రెండోరోజూ నష్టాల బాట పట్టింది. నిన్నటి ట్రేడింగ్‌లో 6శాతం నష్టపోయిన ఈ షేరు మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో మరో 6శాతం నష్టపోయింది. అమెరికాకు చెందిన అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థల్లో ఒకటైన క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌ ఈ బ్యాంకులో 120 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందనే వార్తలు షేరుకు ర్యాలీకి తోడ్పానివ్వలేకపోయాయి. యస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న 8పెట్టుబడిదారులలో క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌ ఒకటి. అమెరికాలో నియంత్రణ

సెన్సెక్స్‌ 250 పాయింట్లు డౌన్‌

Tuesday 3rd December 2019

ఆర్‌బీఐ పాలసీ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత మరోసారి తెరపైకి అంతర్జాతీయ వాణిజ్య భయాలు మెటల్‌, బ్యాంక్‌, ఇన్ఫ్రా రంగ షేర్ల అమ్మకాల ఒత్తిడితో మంగళవారం మిడ్‌సెషన్‌ కల్లా భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ దాదాపు 250 పాయింట్లును కోల్పోగా, నిఫ్టీ 12వేల దిగువకు దిగివచ్చింది. నేటి ఉదయం దేశీయ స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. అయితే జాతీయ, అంతర్జాతీయ పరిణాలు సూచీలను నష్టాల్లోకి మళ్లించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తమ దేశంలో

Most from this category