News


ప్రమోటర్లు ‘చాన్స్‌’ తీసుకున్నారు...!

Tuesday 30th July 2019
Markets_main1564426323.png-27390

స్టాక్‌ మార్కెట్లో జూన్‌ త్రైమాసికం ఇన్వెస్టర్ల సంపదకు తూట్లు పొడించిందనే చెప్పుకోవాలి. కానీ, ఇదే కాలంలో బీఎస్‌ఈ500 కంపెనీల్లో (పీఎస్‌యూ బ్యాంకులు మినహా) 43 కంపెనీల ప్రమోటర్లు మాత్రం అవకాశం తీసుకుని, పడిపోయిన తమ కంపెనీల షేర్లలో వాటాలు కొనుగోలు చేసినట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. ప్రమోటర్లు వాటా పెంచుకోవడం అన్నది కొంత సౌకర్యవంతమైన విషయమేనని మార్కెట్‌ పరిశీలకులు భావిస్తుంటారు. అయితే, స్టాక్స్‌ కొనుగోలు విషయంలో దీన్ని కేవలం ఒక అంశంగానే చూడాల్సి ఉంటుంది. 

 

ప్రమోటర్ల వాటాలు పెరిగిన కంపెనీల్లో... ఈక్లర్క్స్‌ సర్వీసెస్‌, ఎస్కార్ట్స్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, వొడాఫోన్‌ ఐడియా, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, ఎరిస్‌ లైఫ్‌ సైన్సెస్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ (ఇవి 20-34 శాతం మధ్యలో జూన్‌ త్రైమాసికంలో పతనమయ్యాయి), బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, జెన్సార్ టెక్నాలజీస్‌, రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌, షాపర్స్‌ స్టాప్‌, ఎన్‌టీపీసీ, మేఘమణి ఆర్గానిక్స్‌, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, కెన్‌ఫిన్‌ హోమ్‌, నాట్కో ఫార్మా, ట్రిడెంట్‌, గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌, సైయంట్‌, ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌, థైరోకేర్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, నవ్‌భారత్‌ వెంచర్స్‌ ఉన్నాయి. ‘‘ప్రమోటర్లు, పెద్ద ఇనిస్టిట్యూషన్స్‌ వేటినైనా ఇన్వెస్టర్లు గుడ్డిగా ఇతరులను అనుసరించరాదు. సాధారణ రిటైల్‌ ఇన్వెస్టర్‌తో పోలిస్తే ప్రమోటర్ల ఉద్దేశ్యం వేరుగా ఉంటుంది. ప్రమోటర్లు వాటాలు పెంచుకోవడం ఒకరి పెట్టుబడి నిర్ణయానికి కేవలం ఒక ఉత్ప్రేరకంగానే పనిచేస్తుంది’’ అని మార్కెట్‌ అనలిస్ట్‌ అంబరీష్‌ బలిగ తెలిపారు. ప్రమోటర్ల వాటా చెప్పుకోతగ్గంత పెరిగిన వాటిల్లో ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, డీఎల్‌ఎఫ్‌, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ ఉన్నాయి. 

 

‘‘ఓ స్టాక్‌లో పెట్టుబడులకు కేవలం ప్రమోటర్లు వాటాలు కొనుగోలు చేశారన్న దానిపై ఆధారపడడం సరికాదు. ఇది ఇన్వెస్టర్లకు కొంత సౌకర్యంగా ఉంటుందన్నది నిజమే. అయితే దీనికి వ్యాల్యూషన్‌, ఆ వ్యాపారంపై ఉన్న రుణాలు, సంబంధిత యాజమాన్యం కాలపరీక్షలకు ఎదురొడ్డి నిలిచిందా అన్న అంశాలు కూడా తోడు కావాలి’’ అని ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ వ్యవస్థాపకుడు జి.చొక్కలింగం సూచించారు. ‘‘ఈ మార్కెట్లో ప్రమోటర్లతో పరుగులు తీయాలనుకుంటే... ప్రమోటర్లు కూడా ఎంతో స్మార్ట్‌ అని గుర్తుంచుకోవాలి. తమ ఆటలో భాగంగా వారు ఇన్వెస్టర్లను మరింత దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారా అని చూడాలి. ఈ తరహా మార్కెట్లో ఇన్వెస్టర్‌ తాను పెట్టుబడి పెట్టాలనుకుంటున్న కంపెనీ పాజిటివ్‌ క్యాష్‌ ఫ్లోను చూడడం అవసరం’’ అని అంబరీష్‌ బలిగ హెచ్చరించారు. 
 You may be interested

లాభాల ప్రారంభం

Tuesday 30th July 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బుధవారం పాలసీ నిర్ణయాన్ని వెల్లడించనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో మంగళవారం భారత్‌ స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 49 పాయింంట్ల లాభంతో 37,735 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,215 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ, ఐఓసీ, టాటా స్టీల్‌లు స్వల్పలాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

లిస్టెడ్‌ కంపెనీల్లో డీఐఐల వాటా 13.7 శాతం

Tuesday 30th July 2019

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు), మన దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (డీఐఐలు) మధ్య పెట్టుబడుల పరంగా అంతరం తగ్గిపోతోంది. ఎఫ్‌పీఐలు క్రమంగా అమ్మకాలు సాగిస్తుంటే, అదే సమయంలో డీఐఐలు కొనుగోళ్లు జరుపుతున్న విషయం తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల్లో డీఐఐల పెట్టుబడుల విలువ జూన్‌ 30 నాటికి రూ.20.42 లక్షల కోట్లకు చేరింది. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 0.89 శాతం అధికం. ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ జూన్‌ చివరికి రూ.29.36

Most from this category