STOCKS

News


42 కౌంటర్లలో ఎంఏసీడీ బై సిగ్నల్‌!

Tuesday 26th November 2019
Markets_main1574759826.png-29871

సోమవారం ముగింపు ప్రకారం 42 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోంది. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో జిందాల్‌ స్టీల్‌, టాటాస్టీల్‌, టాటాస్టీల్‌ బీఎస్‌ఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, డీసీబీ బ్యాంక్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఆదిత్యబిర్లా మనీ, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, దివిస్‌ ల్యాబ్‌, ఎరిక్‌ లైఫ్‌సైన్సెస్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 33 షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. ఆర్‌ఈసీ, ఐబీ రియల్‌, రైట్స్‌, ఎంఎస్‌టీసీ, మాక్స్‌ ఇండియా, ఎస్‌ఆర్‌ఎఫ్‌, అఫెల్‌ ఇండియా, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌, పాలక్యాబ్‌ ఇండియా తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
ఎంఏసీడీ అంటే..
మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  You may be interested

సూచీలు పరుగులు తీసినా...అధికశాతం షేర్లు నష్టాల్లోనే!

Tuesday 26th November 2019

బెంచ్‌మార్క్‌ సూచీలు కొత్త రికార్డులను అందుకున్నప్పుడు విస్తృతంగా స్టాకులు పెరగాలి. కానీ ఇండియా ఈక్విటీ మార్కెట్లలో చాలా వరకు షేర్లు పడిపోగా, భారీగా పెరిగిన స్టాకులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ​కేవలం కొంత మంది ఇన్వెస్టర్లు మాత్రమే గత కొన్ని నెలలలో టాప్‌ 15-20 స్టాకులలో పెట్టుబడులు పెట్టారు. కాగా దీర్ఘకాలంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడంతో విస్తృత మార్కెట్‌లో అమ్మకాలు జరిగాయి. ఫలితంగా సూచీలు మంచి ప్రదర్శన చేసినప్పటికి,

మార్కెట్‌ కొత్త హై....టాప్‌ కంపెనీలు ఇవే!

Tuesday 26th November 2019

అంతర్జాతీ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో సూచీలు మంగళవారం సరికొత్త  జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెనెక్స్‌ 41,120 వద్ద, నిఫ్టీ 12,132.45 తమ జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. వీటితో పాటు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సైతం 31,813.70 వద్ద నూతన ఆల్‌టైంకి చేరుకుంది. ఈ ఏడాదిలో నిఫ్టీ ఇండెక్స్‌ ఏకంగా 7సార్లు కొత్త రికార్డు హైలను

Most from this category