News


ఈ స్టాకుల్లో ఎంఏసీడీ పాజిటివ్‌ సంకేతాలు!

Tuesday 5th November 2019
Markets_main1572936113.png-29363

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 42 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఇన్ఫోసిస్‌, టాటాపవర్‌, మాక్స్‌ ఫైనాన్షియల్స్‌, కరూర్‌ వైశ్యాబ్యాంక్‌, టొరెంట్‌ పవర్‌, వరుణ్‌ బెవరేజెస్‌, షాలిమార్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రాలీస్‌ ఇండియా, చోళమండలం, సెంచరీ ప్లైబోర్డ్స్‌, మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 


ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 33 షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. ఎంఅండ్‌ఎం, హిందుస్థాన్‌ జింక్‌, బెర్గర్‌ పెయింట్‌, అశోకా బుల్డ్‌కాన్‌, అమర్‌రాజా, దివిస్‌ల్యాబ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, కన్సాయ్‌ నెరోలాక్‌పెయింట్స్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


ఎంఏసీడీ అంటే..
మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  



You may be interested

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ షేరుకు ఫలితాల షాక్‌

Tuesday 5th November 2019

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ షేరు మంగళవారం ట్రేడింగ్‌ సెషన్‌లో 6శాతం నష్టపోయింది. కంపెనీ ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటం షేరు నష్టానికి కారణమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.115.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ ప్రకటించిన ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒక దశలో 6శాతం నష్టపోయి

వాణిజ్య ఒప్పందం కోసం జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ఆహ్వానం

Tuesday 5th November 2019

మొదటి దశ వాణిజ్య చర్చల్లో భాగంగా ఇరుదేశాలు కుదుర్చుకున్న ఒప్పందంపై సంతకం చేసేందుకు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌... చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆహ్వానం పలికినట్లు వైట్‌ హౌస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్‌ ఏషియన్‌ నేషన్స్‌(ఆసియాన్) సమావేశంలో అమెరికా వాణిజ్య చర్చల బృందంలో సీనియర్‌ సభ్యుడైన బర్ట్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ ‘‘ చైనాతో అమెరికా గొప్ప వాణిజ్య సంబంధాలను కోరుకుంటుంది. మొదటి దశ వాణిజ్య

Most from this category