News


40,030 పాయింట్ల మద్దతు సెన్సెక్స్‌కు కీలకం

Monday 18th November 2019
Markets_main1574048263.png-29652

కొద్ది నెలలుగా అమెరికా మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్న యాపిల్, ఫేస్‌బుక్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్‌ వంటి షేర్ల సాయంతోనే ఆ దేశపు మార్కెట్లు సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. మరోవైపు ట్రేడ్‌ డీల్‌ పట్ల అనుమానాలు, వృద్ధి మందగించడం, స్వదేశీ కరెన్సీలు పతనంకావడం వంటి అంశాలతో భారత్‌తో సహా పలు వర్థమాన మార్కెట్లు, యూరప్‌ సూచీల అప్‌ట్రెండ్‌ గతవారం హఠాత్తుగా ఆగిపోయింది. మరో ఒకటి, రెండు వారాలు ర్యాలీ నిలిచిపోతే,,,ఈ సంవత్సరాంతంలో కరెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
నవంబర్‌ 15తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన శ్రేణిలో మద్దతు పొందిన  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40,027– 40,650 పాయింట్ల కనిష్ట–గరిష్ట పాయింట్ల మధ్య 1.5 శాతం శ్రేణిలో ఊగిసలాడి చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 33 పాయింట్ల నష్టంతో 40,357 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం గతవారపు శ్రేణిని ఎటువైపు ఛేదిస్తే ఆ దిశగా  సెన్సెక్స్‌ పయనించవచ్చు. 40,030 పాయింట్ల తక్షణ మద్దతును కోల్పోయి, ముగిస్తే సెన్సెక్స్‌ స్వల్పకాలిక కరెక్షన్‌కు లోనుకావొచ్చు. ఈ సందర్భంలో 39,800 పాయింట్ల వద్దకు, ఈ లోపున  39,500 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు. ఈ వారం సెన్సెక్స్‌ తొలి మద్దతును పరిరక్షించుకున్నా, గ్యాప్‌అప్‌తో మొదలైనా 40,650–40,750 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. అటుపైన  40,900 పాయింట్ల వరకూ పెరిగే ఛాన్స్‌ వుంటుంది.  కొద్దివారాల్లో 41,500 పాయింట్ల స్థాయిని కూడా అందుకునే ఛాన్స్‌ వుంటుంది. 

నిఫ్టీ తక్షణ మద్దతు 11,802
గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,810 పాయింట్ల సమీపంలో మద్దతును పొంది, శుక్రవారం 11,974 పాయింట్ల వరకూ పెరిగినప్పటికీ, లాభాల్ని నిలుపుకోలేకపోయింది.  చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 13 పాయింట్ల నష్టంతో 11,895 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీకి గతవారపు కనిష్టస్థాయి అయిన 11,802 పాయింట్ల మద్దతు కీలకం.  ఈ మద్దతును ముగింపులో కోల్పోతే 11,720 పాయింట్ల స్థాయికి, ఈ లోపున 11,650 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు.  ఈ వారం తొలి మద్దతు శ్రేణిని నిఫ్టీ పరిరక్షించుకున్నా, గ్యాప్‌అప్‌తో మొదలైనా 11,975 పాయింట్ల స్థాయిని మరోదఫా పరీక్షించవచ్చు. అటుపైన 12,020–12,035 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని ఛేదిస్తే నిఫ్టీ అల్‌టైమ్‌ గరిష్టం 12,103 పాయింట్ల స్థాయిని దాటే అవకాశాలుంటాయి. You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎంపిక ఇలా కాదు..!

Monday 18th November 2019

-డివిడెండ్‌ కంటే ఎస్‌డబ్ల్యూపీ మెరుగు -ఫండ్స్‌ ఆస్తుల సైజు కంటే రాబడులు ముఖ్యం -మంచి పనితీరు ఉంటే, వ్యయాలను పట్టించుకోనక్కర్లేదు -ఫండ్స్‌లో రాబడులకు ఎన్నో జాగ్రత్తలు అవసరం మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల వైపు నేడు ఎక్కువ మంది వేతన జీవులు మొగ్గు చూపుతున్నారు. దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి అనుకూలమనే అవగాహన పెరుగుతోంది. అధిక రాబడులకు ఈక్విటీలు మెరుగైన సాధనంగా ఉండడంతో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లోకి ప్రతీ నెలా సగటున రూ.8,000 కోట్లపైనే సిప్‌

అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్‌..!

Monday 18th November 2019

అమెరికా–చైనాల మధ్య పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం  గురువారం ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌ వెల్లడి- ఈవారంలో రేంజ్‌ బౌండ్‌కు చాన్స్‌: సామ్కో సెక్యూరిటీస్‌ ముంబై: కంపెనీల క్యూ2(జూలై–సెప్టెంబర్‌) ఫలితాల సీజన్‌ దాదాపుగా పూర్తైన నేపథ్యంలో అంతర్జాతీయ అంశాలే ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అమెరికా–చైనాల మధ్య పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని శ్వేతసౌధానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తాజాగా

Most from this category