News


ఈ 40 షేర్లకు బడ్జెట్‌ బూస్ట్‌!

Monday 3rd February 2020
Markets_main1580714397.png-31467

బడ్జెట్‌లో సానుకూల ప్రతిపాదనల ఎఫెక్ట్‌
జాబితాలో ఐటీ, ఫుట్‌వేర్‌ తదితర రంగాలు
ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్‌ రంగ షేర్లకూ లబ్డి

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పలువురు నిరాశపడినప్పటికీ.. కొన్ని రంగాలకు మేలు జరగనున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఆయా రంగాలలోని కంపెనీలకు లబ్ది చేకూరే వీలున్నట్లు విశ్లేషిస్తున్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనలతో ఏఏ రంగాలు, కంపెనీలపై సానుకూల ప్రభావం పడనుందన్న అంచనాల వివరాలు చూద్దాం..

ఎల్‌టీసీజీ ప్రస్తావనలేదు..
మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా బడ్జెట్‌ వెలువడలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దశాబ్దకాలపు కనిష్టానికి చేరిన జీడీపీ పురోగతికి అవసరమైన సహాయక ప్యాకేజీలను ప్రభుత్వం ప్రకటించలేదని తెలియజేశారు. ప్రధానంగా వినియోగ డిమాండ్‌ పెంచే చర్యలు కొరవడినట్లు అభిప్రాయపడ్డారు. ఇక మార్కెట్లకు జోష్‌నివ్వగల దీర్ఘకాల పెట్టుబడి లాభాలపై పన్ను(ఎల్‌టీసీజీ) అంశంలో సవరణల ప్రస్తావనేలేదని చెప్పారు. బడ్జెట్‌ ప్రతిపాదనలతో సంపన్నులపై పన్నుభారం పెరిగే అవకాశమున్నదని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

డీడీటీపై..
డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీడీటీ) ఎత్తివేయడంతో భారీ కంపెనీలు లాభపడనున్నట్లు షేర్‌ఖాన్‌ కేపిటల్‌ మార్కెట్‌, ఇన్వెస్ట్‌మెంట్స్‌ హెడ్‌ గౌరవ్‌ దువా చెప్పారు. అయితే డివిడెండ్లు అందుకునే ఇన్వెస్టర్లు పన్ను చెల్లించవలసి ఉంటుందని తెలియజేశారు. ప్రస్తుతం సర్‌చార్జీ, సెస్‌ కలిపి డీడీటీ రేటు 20.35 శాతంగా అమలవుతున్నట్లు తెలియజేశారు. ఇది పలువురు రిటైల్‌ ఇన్వెస్టర్ల పన్ను చెల్లింపులను పెంచనున్నట్లు తెలియజేశారు. ఈ అంశాన్ని మార్కెట్లు ప్రతికూలంగా తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా అనుబంధ సంస్థలు లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీల నుంచి అందుకునే డివిడెండ్ల అంశంలో హోల్డింగ్‌ కంపెనీలపైనా భారంపడనున్నట్లు వివరించారు.

ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఫుట్‌వేర్‌..
బడ్జెట్‌ తాజా ప్రతిపాదనల నేపథ్యంలో ప్రధానంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, ఫుట్‌వేర్‌, నేచురల్‌​గ్యాస్‌, వాటర్‌ పంప్స్‌, రవాణా సంబంధ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఐటీ, వ్యవసాయ సంబంధ రంగాలకు లబ్ది చేకూరనున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాభపడే వీలున్న విభిన్న రంగాలు, కంపెనీలను నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు ఇలా...

 

కస్టమ్స్‌ డ్యూటీ పెంపు
స్మాల్‌ అప్లయెన్సెస్‌, ఫుట్‌వేర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఫ్యాన్లు, తదితర వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీల పెంపు కారణంగా రిలాక్సో ఫుట్‌వేర్‌, బాటా ఇండియా, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, వర్ల్‌పూల్‌ ఇండియా, సింఫనీ లిమిటెడ్‌, బ్లూ స్టార్‌ లిమిటెడ్‌ లబ్ది పొందే వీలుంది.
హెల్త్‌కేర్‌ కేటాయింపులు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2021)గాను ‍ప్రభుత్వం బడ్జెట్‌లో ఆరోగ్య పరిరక్షణ(హెల్త్‌కేర్‌) రంగానికి రూ. 69,000 కోట్లను కేటాయించింది. దీనితో ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి రూ. 6,400 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా పీపీపీ పద్ధతిలో ఆసుపత్రుల నిర్మాణంకోసం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో అపోలో హాస్పిటల్స్‌, బయోకాన్‌, అజంతా ఫార్మా, డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్‌ లాభపడవచ్చు.
ఇన్‌ఫ్రాకు ప్రాధాన్యం
జాతీయ మౌలికసదుపాయాల పైప్‌లైన్‌లో భాగంగా రూ. 22,000 కోట్ల ఈక్విటీ సపోర్ట్‌ లభించనుంది. జాతీయ రహదారులకు 11 శాతం అధికంగా రూ. 91,823 కోట్లను కేటాయించారు. ఇదే విధంగా పీఎం గ్రామ్‌ సడక్‌ యోజన కోసం 39 శాతం అధికంగా రూ. 19,500 కోట్లు ప్రకటించారు. వీటిలో భాగంగా 9,000 కిలోమీటర్లలో ఆర్థిక నడవాలు, 2,000 కిలోమీటర్లమేర కోస్టల్‌, ల్యాండ్‌ పోర్టుల రహదారులు తదితరాలను అభివృద్ధి చేయనున్నారు. మరోవైపు చెన్నై, బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే త్వరలో ప్రారంభం‍ కానుంది. ఫలితంగా అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎల్‌అండ్‌టీకి అవకాశాలు పెరిగే అవకాశముంది. 
- గౌవర్‌ గార్గ్‌, రీసెర్చ్‌ హెడ్‌, కేపిటల్‌ వయా గ్లోబల్‌ రీసెర్చ్‌

 

మౌలిక రంగం
జాతీయ మౌలికసదుపాయాల పైప్‌లైన్‌లో భాగంగా రూ. 22,000 కోట్ల ఈక్విటీ సపోర్ట్‌తోపాటు.. సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌ చేసే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పెట్టుబడులపై పూర్తి(100 శాతం) పన్ను మినహాయింపు కారణంగా రత్నమణి మెటల్స్‌ అండ్‌ ట్యూబ్స్‌ లబ్ది పొందనుంది.
పీసీబీలపై సుంకాల పెంపు
దేశీయంగా ఎలక్ట్రానిక్‌ తయారీ రంగానికి దన్నునిచ్చేందుకు బడ్జెట్‌లో ప్రోత్సాహక పథకాలను ప్రకటించారు. మొబైల్‌ ఫోన్ల తయారీలో వినియోగించే ప్రెంటెడ్‌ సర్క్యూట్‌ బోర్డుల(పీసీబీలు)పై దిగుమతి సుంకాలను 10 శాతం పెంచారు. దీంతో డిక్సన్‌ టెక్నాలజీస్‌, యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీలకు మేలు చేకూరనుంది. 
స్మార్ట్‌ మీటర్లు
సంప్రదాయ విద్యుత్‌ వినియోగ మీటర్లస్థానే .. బడ్జెట్‌లో ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు. తద్వారా ఏబీబీ ఇండియా, సీమెన్స్‌ ఇండియాపై సానుకూల ప్రభావం పడనుంది.
గ్రామీణం, నీటిపారుదల
వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ. 2,83,000 కోట్లను కేటాయించారు. 2021లో రూ. 15 లక్షల కోట్ల అగ్రిక్రెడిట్‌ లక్ష్యాలను విధించారు. వర్షపాత వినియోగాన్ని పెంచేందుకు వీలుగా సమీకృత వ్యవసాయ విధానాలను విస్తరించనున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రొవిజన్లు చేపట్టారు. తద్వారా కావేరీ సీడ్స్‌, ఇన్‌సెక్టిసైడ్స్‌ ఇండియా, పీఐ ఇండస్ట్రీస్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌ లబ్ది పొందే వీలుంది.
డివిడెండ్ల బొనాంజా
వాటాదారులకు అత్యధిక డివిడెండ్లను పంచడంలో ఐటీ కంపెనీలదే అగ్రస్థానం. ప్రధానంగా దిగ్గజాలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా డివిడెండ్లు లేదా ఈక్విటీ బైబ్యాక్‌ ద్వారా వాటాదారులకు భారీగా లబ్ది చేకూర్చుతుంటాయి. డీడీటీ రద్దుకారణంగా మరింత డివిడెండ్‌కు వీలుంది. ఉదాహరణకు 2020లో టీసీఎస్‌ డీడీటీకింద రూ. 4200 కోట్లు చెల్లించింది. ఇకపై ఇది వాటాదారులకు బదిలీ అయ్యే అవకాశముంది. ఇది నగదు నిల్వలు పుష్కలంగా కలిగిన మధ్యస్థాయి కంపెనీలు పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, ఎంఫసిస్‌ తదితరాల డివిడెండ్‌ చెల్లింపులను పెంచవచ్చు. ఇదే విధంగా ఎఫ్‌ఎంసీజీ విభాగంలోని కాల్గేట్‌ పామోలివ్‌, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, జీఎస్‌కే కన్జూమర్‌, నెస్లే ఇండియా చెల్లింపులు సైతం పెరిగే వీలుంది.
మౌలికసదుపాయలు
రోడ్లు, రహదారులతోపాటు.. ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన, గ్రామ్‌ సడక్‌ యోజనల కేటాయింపులను బడ్జెట్‌లో పెంచారు. అందుబాటు ధరల్లో గృహ కల్పనకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఏడాదిపాటు పొడిగించారు. తద్వారా డెవలపర్స్‌కు ట్యాక్స్‌ హాలిడే, ఇళ్ల కొనుగోలుదారులకు రూ. 1.5 లక్షల పన్ను మినహాయింపు కొనసాగనుంది. దీంతో అల్ట్రాటెక్‌, రామ్‌కో సిమెంట్స్‌, జేకే లక్ష్మీ సిమెంట్‌ లబ్ది పొందవచ్చు.
డిజిటల్‌ ఇండియా
డిటిజల్‌ ఇండియా కోసం భారత్‌ నెట్‌ కార్యక్రమానికి రూ. 6,000 కోట్లు కేటాయింపు. తద్వారా ‍గ్రామాలలో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ పెంపు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రయివేట్‌ రంగం ద్వారా డేటా సెంటర్‌ పార్కుల ఏర్పాటుకు విధానాల ప్రకటన. దీంతో దేశ మారుమూల ప్రాంతాలలోనూ స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌ వినియోగం వృద్ధి చెందనుంది. ఆప్టికల్‌ ఫైబర్‌ ద్వారా లక్ష గ్రామ పంచాయతీలను అనుసంధానించనున్నారు. వెరసి కొత్తతరహా మీడియా కంపెనీలు ఆఫ్లే ఇండియా, ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా లాభపడనున్నాయి.
లాజిస్టిక్‌ పాలసీ
సింగిల్‌ విండో లాజిస్టిక్స్‌ మార్కెట్‌ ఏర్పాటు ప్రతిపాదనలు. జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రలపై త్వరలో విధివిధానాలు. రైల్వే రంగంలో రూ. 1.6 లక్షల పెట్టుబడి ప్రణాళికలు. 52 శాతం అధికంగా కొత్త లైన్ల ఏర్పాటు. ఫలితంగా టీసీఐ ఎక్స్‌ప్రెస్‌, మహీంద్రా లాజిస్టిక్స్‌, కంటెయిన్‌ కార్పొరేషన్‌, గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌లకు లబ్డి.
- బ్రో‍కింగ్‌ సంస్థ షేర్‌ఖాన్‌

 

మార్కెట్‌ నుంచి నిధులు
ప్రభుత్వ రంగ బ్యాంకులు కేపిటల్‌ మార్కెట్ల నుంచి నిధుల సమీకరణకు వీలుగా విధానాలు. బ్యాంకుల పటిష్టతను పరిశీలించేందుకు వ్యవస్థ ఏర్పాటు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌లకు మేలు చేకూరవచ్చు.
ఇంధన రంగం
వచ్చే ఏడాదికిగాను ఇంధన సబ్సిడీలకిచ్చే బడ్జెట్‌లో 6 శాతం వృద్ధి. ఎల్‌పీజీ, కిరోసిన్‌లపై సబ్సిడీ రూ. 23.4 బిలియన్లకు పెంపు. దీంతో ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాలపై సబ్సిడీ భారం పడే అవకాశంలేదని అంచనా. ఇది ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాకు సానుకూలం.
- బ్రోకింగ్‌ సంస్థ రిలయన్స్‌ సెక్యూరిటీస్‌You may be interested

లాభాల్లోంచి నష్టాల్లోకి ఐటీ షేర్లు..!

Monday 3rd February 2020

ఐటీ షేర్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో లాభాల్లో ట్రేడైనప్పటికీ.. మిడ్‌ సెషన్‌ కల్లా తిరిగి నష్టాల్లోకి మళ్లాయి. కేంద్ర బడ్జెట్‌ 2020లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) తొలగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి 34 పైసలు బలహీనతతో ప్రారంభం కావడంతో ఉదయం ట్రేడింగ్‌లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ దాదాపు ఒకశాతం వరకు పెరిగింది. అనంతరం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం,

నిఫ్టీ పొజిషన్‌ హెడ్జింగ్‌కు పుట్‌ బటర్‌ఫ్లై వ్యూహం!

Monday 3rd February 2020

ఫిబ్రవరి సీరిస్‌ను సూచీలు నెగిటివ్‌ అడుగులతో ఆరంభించాయి. నిఫ్టీ కీలకమైన 12000 పాయింట్లకు బాగా దిగువకు వచ్చింది. మరోవైపు బడ్జెట్‌ అనంతరం వీఐఎక్స్‌ ఒక్కమారుగా ఎగిసింది. ఈ నేపథ్యంలో నిఫ్టీలో ఉన్న పొజిషన్లు కాపాడుకునేందుకు మోడిపైడ్‌ పుట్‌ బటర్‌ఫ్లై వ్యూహం అవలంబించాలడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో సూచీలు ప్రస్తుతమున్న స్థానానికి దగ్గరగా  ఒక పుట్‌ను కొనడం, అంతకన్నా బాగా దిగువ పుట్స్‌ రెండిటిని విక్రయించడం చేస్తారు. అనంతరం అమ్మిన

Most from this category