STOCKS

News


షేర్ల ఎంపికకు నాలుగు రంగాలు!

Friday 7th February 2020
Markets_main1581068760.png-31601

పంకజ్‌ టిబ్రేవాల్‌
షేర్లలో బాటమ్‌అప్‌ ఎంపిక అవకాశాలు వెతికి అందిపుచ్చుకోవాలని కోటక్‌ ఎంఎఫ్‌ ఈక్విటీ మేనేజర్‌ పంకజ్‌ టిబ్రేవాల్‌ సూచిస్తున్నారు. బాటమ్‌ అప్‌ షేర్లను నాలుగు రంగాల్లో గుర్తించవచ్చంటున్నారు. మూడునాలుగేళ్లుగా స్పెషాలిటీ కెమికల్స్‌ రంగం మంచి పాజిటివ్‌గా ఉందన్నారు. అదేవిధంగా సప్లైచైన్స్‌ భారత్‌దిశగా మరలుతున్నాయని, ఇలాంటి సప్లైచైన్స్‌తో సంబంధం ఉన్న కంపెనీలు రాబోయే కాలంలో దూసుకుపోతాయని చెప్పారు. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలని చెప్పారు. ఇక మూడో పాజిటివ్‌ రంగం క్యాపిటల్‌గూడ్స్‌ అని తెలిపారు. దేశీయ రికవరీతో ఈ రంగానికి చెందిన కంపెనీలు ప్రయోజనం పొందుతాయని తెలిపారు. అదేవిధంగా కన్సాలిడేషన్‌  చెందుతున్న రంగాలైన టెలికం, సిమెంట్‌, రియల్టీ, ఏవియేషన్‌, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాలకు చెందిన కంపెనీలు సమీప భవిష్యత్‌లో దూసుకుపోతాయన్నారు. ప్రస్తుత సైకిల్‌ను తట్టుకొని నిలిచే కంపెనీలు వచ్చే నాలుగైదేళ్లలో బడా కంపెనీలుగా మారతాయని అంచనా వేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాటమ్‌ అప్‌ స్టాక్‌ ఎంపిక బెటరని తెలిపారు. 
 రెండేళ్లుగా బడా స్టాకులతో పోలిస్తే చిన్న స్టాకుల వెనుకంజ మరికొంత కాలం కొనసాగుతుందన్నారు. జనవరిలోఇవి కొంతమేర రికవరీ చెందినా, ఇప్పటికీ నిప్టీతో పోలిస్తే చిన్న స్టాకుల సూచీలు వెనుకబడే ఉన్నాయన్నారు. వ్యవస్థలో క్రెడిట్‌ సమస్య కొంత సన్నగిల్లితే బ్యాంకులు కొంత ధైర్యం చేసి మరిన్ని రుణాలిచ్చేందుకు ముందుకువస్తాయని పంకజ్‌ చెప్పారు. వచ్చే రెండుమూడు త్రైమాసికాల పాటు వ్యవస్థలో బడా డిఫాల్టులు లేకపోతే విశ్వాసం పెరుగుతుందన్నారు. అయితే ఇలా వ్యవస్థలో విశ్వాసం పెరగడం ఒక క్రమానుగత పరిణామమని తెలిపారు. ఇప్పటికిప్పుడు వీ ఆకారపు రికవరీ వస్తుందని తాను భావించడం లేదని, నిజానికి ఇలా క్రమానుగత రికవరీతోటే మార్కెట్లలో నమ్మకం పెరుగుతుందని వివరించారు. ఉదాహరణకు గత నెలన్నరగా ఇలాంటి విశ్వాసం క్రమంగా పెరగడం వల్లనే సెప్టెంబర్‌ కనిష్ఠాల నుంచి షేర్లు దాదాపు 30 శాతం వరకు కోలుకున్నాయని చెప్పారు. ఇప్పటికీ పలు చిన్న స్టాకులు ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉన్నాయని, ఇలాంటి వాటిలో దీర్ఘకాలిక వ్యాపార విలువ ఉన్న వాటిని ఎంచుకోవాలని సూచించారు. ఇలాంటి బాటమ్‌ అప్‌ షేర్లను ఎంచుకోవడమే భవిష్యత్‌ లాభాలకు తొలిమెట్టని చెప్పారు.  



You may be interested

‘‘వాట్సాప్‌ పే’’కు లైన్‌క్లియర్‌

Friday 7th February 2020

ప్రపంచమంతా డిజిటల్‌ టెక్నాలజితో పరుగులు పెడుతోంది. దీంతో ఏ పనైనా సెకన్లు లేదా నిమిషాల్లో అయిపోతుంది.  ముఖ్యంగా ఏదైనా పేమెంట్‌ చేయాలంటే వెంటనే మనకు గుర్తుకొచ్చేది గూగుల్‌ పే, ఫోన్‌ పేలు. ఇప్పుడు వీటి సరసన ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌ చేరనుంది. గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ‘వాట్సాప్‌ పే’ సేవలు ఇండియాలో అందించడానికి లైన్‌క్లియర్‌ అయింది. ద నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) ‘వాట్సాప్‌  పే’ సేవలను

ఐఆర్‌సీటీసీ.. షేరుకి ‘తేజస్‌’

Friday 7th February 2020

ఐపీవో ధర రూ. 320 లిస్టింగ్‌ ధర రూ. 644 ప్రస్తుతం రూ. 1515(ఎన్‌ఎస్‌ఈ) ప్రభుత్వ రంగ సంస్థ.. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) లిమిటెడ్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యాక రేసు గుర్రంలా దౌడు తీస్తోంది. అందరి అంచనాలను మించుతూ షేరు పురోగమిస్తోంది. గురువారం (6న) ఇంట్రాడేలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ. 1563 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. చివరికి రూ. 1504 వద్ద ముగిసింది. ప్రస్తుతం 1 శాతం

Most from this category