News


అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల నుంచి 4 స్టాక్‌ రికమెండేషన్లు

Thursday 20th February 2020
Markets_main1582192563.png-31965

పరిమితి శ్రేణి ట్రేడింగ్‌లో భాగంగా గురువారం సూచీలు లాభ, నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలు ఓ నాలుగు షేర్లను రికమెండ్‌ చేస్తున్నాయి. 

1.బ్రోకరేజ్‌ సంస్థ: బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌
షేరు పేరు: అరబిందో ఫార్మా
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.634
విశ్లేషణ: అరబిందో ఫార్మాకు చెందిన యూనిట్‌-VI యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి  వాలంటరీ యాక్షన్ ఇనిషియేటెడ్ హోదాతో ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ (EIR) ను అందుకోవడం కలిసొచ్చే అంశమని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తోంది. ఈ డెవెలప్‌మెంట్‌తో యూఎస్‌ఎఫ్‌డీ వర్తింపు స్కోరు మెరుగుపడుతుందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. 

2. బ్రోకరేజ్‌ సంస్థ: జేపీ మోర్గాన్‌
షేరు పేరు: అశోక్‌ లేలాండ్‌
రేటింగ్‌: న్యూట్రల్‌
టార్గెట్‌ ధర: రూ.75
విశ్లేషణ: మార్జిన్‌ ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడంతో కంపెనీ క్యూ3 ఫలితాలు నిరుత్సాహరిచాయి. వాల్యూమ్ వృద్ధి రికవరీ అస్పష్టంగానే ఉంది. షేరు తదుపరి మూవెంట్‌కు స్క్రాపేజ్ విధానం కీలకంగా మారిందని జేపీ మోర్గాన్‌ తెలిపింది.

3. బ్రోకరేజ్‌ సంస్థ: మెర్య్కూరీ 
షేరు పేరు: బంధన్‌ బ్యాంక్‌
రేటింగ్‌: అండర్‌ఫెర్‌ఫాం
టార్గెట్‌ ధర: రూ.470
విశ్లేషణ: బ్యాంకులో ఫండమెంటల్‌ స్థాయి & వాటా-అమ్మకం స్థాయి రెండింటిలోనూ చాలా ఎక్కువ జరిగిందని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తోంది. ఈ కారణంగా స్టాక్‌ ట్రేడింగ్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా స్టాక్‌ను కొనడానికి ఇది సరైన సమయం కాదని మెర్క్యూరీ అభిప్రాయపడింది.

4. బ్రోకరేజ్‌ సంస్థ: జేపీ మోర్గాన్‌
షేరు పేరు: ఇండియన్‌ హోటల్స్‌
రేటింగ్‌: ఓవర్‌ వెయిట్‌
టార్గెట్‌ ధర: రూ.175
విశ్లేషణ: ఈ త్రైమాసికంలో హోటల్‌ రంగంలో ఆర్‌ఈవిపీఏర్‌ (రెవెన్యూ ఫర్‌ అవేలబుల్‌ రూమ్‌) రికవరీని సాధించింది. ముంబై, ఢిల్లీ, బెంగళూర్‌, హైదరాబాద్‌ల్లోని హోటల్స్‌ మంచి ఫలితాలను సాధించాయని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది.

ఫైనాన్స్‌ రంగ షేర్ల కొనుగోలుకు మరికొంత సమయం వేచిచూడాలని సీఎల్‌ఎస్‌ఏ బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. బ్యాంకు రుణ న్యాణత మెరుగుపడేందుకు మరికొంత కాలం పడుతుందని,  క్యూ3లో ఎన్‌సీఎల్‌టీ నుంచి రికవరీలు బాగానే జరిగాయని తెలిపింది. బ్యాంకులు విలీనాలకు సిద్ధమవుతున్న తరుణంలో పీఎస్‌యూ బ్యాంకుల పనితీరు... కన్షాలిడేషన్‌ దశను ప్రభావితం చేస్తుందని సీఎల్‌ఎస్‌ఏ పేర్కోంది.

 You may be interested

నష్టాల ముగింపు...నిఫ్టీ 45 పాయింట్లు డౌన్‌

Thursday 20th February 2020

153 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్‌ హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్లు వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ ముందు రోజు హైజంప్‌ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒక్క రోజులోనే కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. రోజంతా హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. చివరికి ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 153 పాయింట్లు క్షీణించి 41,170 వద్ద నిలవగా.. నిఫ్టీ 45 పాయింట్ల వెనకడుగుతో 12,081 వద్ద స్థిరపడింది. బుధవారం అమెరికా మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద నిలవడంతో

ఈ లార్జ్‌క్యాప్స్‌ మీ పోర్టుఫోలియోలో ఉన్నాయా??

Thursday 20th February 2020

డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం కొన్ని లార్జ్‌క్యాప్స్‌ను ప్రముఖ బ్రోకరేజ్‌లు తమ టాప్‌ పిక్స్‌గా పేర్కొన్నాయి. అలాంటి టాప్‌ లార్జ్‌క్యాప్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి... మోతీలాల్‌ ఓస్వాల్‌ సిఫార్సులు 1. హెచ్‌యూఎల్‌: క్యు3లో కంపెనీ రూ. 1616 కోట్ల లాభం నమోదు చేసింది. కమోడిటీల వ్యయాలు తగ్గడం కలిసివచ్చింది. స్థూల ఆర్థిక వాతావరణం ఇంకా మెరుగుపడకున్నా కంపెనీ మాత్రం మంచి పనితీరునే కొనసాగిస్తుందని అంచనా. 2. హెచ్‌డీఎఫ్‌సీ: కంపెనీ లాభం గృహ్‌ ఫైనాన్స్‌, బంధన్‌

Most from this category