News


ఈ స్టాకులపై ఐఐఎఫ్‌ఎల్‌ బుల్లిష్‌

Thursday 24th January 2019
Markets_main1548321609.png-23784

ఏసియన్‌ పెయింట్స్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మైండ్‌ట్రీ, ఐటీసీ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ బ్రోకింగ్‌ సంస్థ ప్రతినిధి సంజీవ్‌ బాసిన్‌ చెప్పారు. ఏసియన్‌ పెయింట్స్‌ డెకరేటివ్‌ పెయింటింగ్‌ వ్యాపారంలో మెజార్టీ వాటా పెంచుకుంటూపోతోందన్నారు. రూ. 1150 నుంచి ఈ షేరుపై బుల్లిష్‌గా ఉన్నామన్నారు. ఇటీవల పెంచిన ఉత్పత్తుల ధర ‍ప్రభావం వచ్చే మూడునెలల్లో ఫలితాల్లో కనిపిస్తుందన్నారు. మైండ్‌ట్రీపై రూ.800 స్థాయి నుంచి బుల్లిష్‌గా ఉన్నామన్నారు. ఈ కంపెనీలో వాటాలను ఎల్‌అండ్‌టీ కొనబోతోందన్న వార్తలు వస్తున్నాయి. ఐటీసీలో బుధవారం వచ్చిన పతనం ఒక కొనుగోలు అవకాశమన్నారు. కంపెనీ సిగిరెట్ల వాల్యూంలు చాలా బాగున్నాయన్నారు. ఒక్కసారి కంపెనీ ధరలను పెంచితే ఈ వాల్యూంలతో భారీ లాభం వస్తుందన్నారు. కంపెనీ ఇతర వ్యాపారాలు కూడా మంచి వృద్ది చూపాయన్నారు. ఈ ఏడాదికి ఐటీసీ సూపర్‌స్టార్‌గా మారవచ్చని అంచనా వేశారు. వీటితో పాటు వృద్ది అవకాశాలున్న కొన్ని రంగాల్లో మిడ్‌క్యాప్స్‌, లార్జ్‌క్యాప్స్‌లో కొన్ని మంచి షేర్లున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇలాంటి షేర్లలో కొనుగోళ్ల హవా కనిపిస్తోందని, వీటిలో సరిపడ కొనుగోళ్లు పూర్తయ్యాక మార్కెట్లలో ఆవరించుకున్న బలహీనత తొలగి ర్యాలీ మొదలవుతుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల దావోస్‌లో జరిగిన సమావేశంలో కొందరు బడా పారిశ్రామికవేత్తలు సైతం భారత్‌ మార్కెట్‌ త్వరలో బాగా బుల్లిష్‌గా మారుతుందని చెప్పారని సంజీవ్‌ తెలిపారు.You may be interested

నష్టాల బాటలో అటో షేర్లు

Thursday 24th January 2019

మార్కెట్‌ ఫ్లాట్‌ ట్రేడింగ్‌లో భాగంగా అటో షేర్లు గురువారం ట్రేడింగ్‌లో నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1శాతనికి పైగా నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా అశోక్‌లేలాండ్‌ 4.50శాతం షేరు నష్టపోయింది. అలాగే టాటామోటర్స్‌ డీవీఆర్‌, టాటామోటర్స్‌ షేర్లు 3శాతం క్షీణించాయి. ఎక్సైడ్‌ లిమిటెడ్‌, మదర్‌సుమి లిమిటెడ్‌, భారత్‌ ఫోర్జ్‌ షేర్లు 2శాతం, టీవీఎస్‌ మోటర్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, బజాజ్‌ అటో, అమరరాజాబ్యాటరీస్‌, అపోలో

టీటీకే హెల్త్‌కేర్‌ 20శాతం జంప్‌

Thursday 24th January 2019

ప్రముఖ వైద్య సేవల కంపెనీ టీటీకే హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ గురువారం 20శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.770.3ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తెలియని కారణాలతో ఇంట్రాడేలో షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఏకంగా 20శాతం ర్యాలీ చేసి రూ.924.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:00లకు షేరు గతముగింపు(రూ.770.3)తో పోలిస్తే దాదాపు 19శాతం లాభంతో రూ.921ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  బీఎస్‌ఈలో

Most from this category