News


యస్‌ బ్యాంకులో పెట్టుబడులకు పీఈ ప్లేయర్లు రెడీ!?

Tuesday 16th July 2019
Markets_main1563215986.png-27082

ప్రైవేటు రంగ యస్‌ బ్యాంకు నిధుల సమీకరణ ప్రయత్నాలు ఫలితం దశకు చేరినట్టు ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం ఆధారంగా తెలుస్తోంది. బ్యాంకుకు నూతన సీఈవో వచ్చిన తర్వాత ఆస్తుల నాణ్యతపై ఫోకస్‌ పెరగడం, ఫలితంగా ఏప్రిల్‌ త్రైమాసికంలో ఎన్‌పీఏలకు చేసిన అధిక కేటాయింపులతో భారీ నష్టాలను బ్యాంకు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకు వృద్ధి బాట పట్టేందుకు నిధుల అవసరం ఎంతో ఉంది. సీఈవో రవనీత్‌గిల్‌ ఇదే విషయమై దృష్టి పెట్టి, పలు అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు కూడా నిర్వహించారు. దీంతో అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల విషయంలో షరతులతో కూడిన ఆఫర్‌ వచ్చినట్టు సమాచారం. 

 

బ్యాంకులో 850 మిలియన్‌ డాలర్ల విలువ మేర వాటా కొనుగోలు చేసేందుకు సదరు ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్ల కన్సార్షియం ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ కన్సార్షియంలో మరో ముగ్గురు ప్రైవేటు ఈక్విటీ ప్లేయర్లు కూడా ఉన్నారు. మొత్తం నలుగురు పీఈ ఇన్వె‍స్టర్లలో ఇద్దరు అమెరికన్‌ కాగా, మరో ఇద్దరు భారత్‌కు చెందినవారు. ఈ వార్తలతోనే యస్‌ బ్యాంకు షేరు సోమవారం ట్రేడింగ్‌ ఆరంభంలో 5 శాతం వరకు పెరిగింది. చివరకు ఒక శాతం లాభానికే పరిమితమై రూ.93 వద్ద ఆగిపోయింది. అమెరికాకు చెందిన ఓ పీఈ ఇన్వెస్టర్‌ ఈ కన్సార్షియంకు నేతృత్వం వహిస్తూ,  10 శాతం వాటా తీసుకునేందుకు ఆసక్తి చూపించగా, మిగిలిన పీఈ ప్లేయర్లు కలసి మరో 10 శాతం వాటా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నది కథనం సారాంశం. అయితే, ఈ డీల్‌పై ఈ నెల 17న జూన్‌ త్రైమాసికం ఫలితాలను వెల్లడించిన తర్వాతే బ్యాంకు ప్రకటన చేయనుందని తెలుస్తోంది. కాగా, ఈ వార్తలపై యస్‌ బ్యాంకు స్పందించలేదు. అనలిస్టులు సైతం యస్‌ బ్యాంకు వృద్ధి అవకాశాల కోసం క్యాపిటల్‌ అవసరమని భావిస్తున్నారు. అలాగే, బ్యాలన్స్‌ షీటులో మరింత నెగెటివిటీ కూడా లేదన్న భరోసా కూడా అవసరమేనంటున్నారు. You may be interested

ఈ స్టాక్స్‌ అంటే ఎఫ్‌పీఐలకు ఎందుకో ఆసక్తి!

Tuesday 16th July 2019

సాధారణ ఇన్వెస్టర్లు వేరు... హెచ్‌ఎన్‌ఐలు, ఇనిస్టిట్యూషన్స్‌(మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా సంస్థలు), విదేశీ ఇన్వెస్టర్లు వేరు. ముఖ్యంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) మన ఈక్విటీల్లో చాలా దూకుడుగా ఉంటారు. ఓ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసే విషయంలోనూ, ఆ పెట్టుబడులను రోజుల వ్యవధిలో వెనక్కి తీసుకునే విషయంలోనూ చురుగ్గా వ్యవహరిస్తుంటారు. అయితే, 13 స్టాక్స్‌లో మాత్రం ఎఫ్‌పీఐలు క్రమంగా వాటాలు పెంచుకుంటూ ఉండడం ఆసక్తికరం.    గత నాలుగు త్రైమాసికాల్లో ఈ 13 స్టాక్స్‌లో

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం పతనం

Monday 15th July 2019

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి స్వల్ప లాభంతో ట్రేడ్‌ అవుతోంది. అయితే.., బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో బ్యాంక్‌ ఇండెక్స్‌ అరశాతానికి నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతనిధ్యం వహించే ఇండెక్స్‌ నేడు 30,688.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ వారంలో బ్యాంకింగ్‌ రంగంలోని యస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బంధన్ బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంక్‌, డీసీబీ బ్యాంక్‌, ధన్ లక్ష్మి బ్యాంక్‌ లు తమ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్న

Most from this category