News


సెన్సెక్స్‌ ర్యాలీకీ కారణాలు

Tuesday 4th February 2020
Markets_main1580812420.png-31505


 

మంగళవారం సెక్టోరియల్‌ ఇండెక్స్‌లన్నీ గ్రీన్‌లో ట్రేడ్‌ అయ్యాయి. మెటల్‌ షేర్లు  2.4 శాతం పెరగగా ఇదే బాటలో నడిచిన ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, ఫార్మాలు 1 శాతం పెరిగాయి. శనివారం పడిపోయిన మార్కెట్‌లు మంగళవారం భారీగా పుంజుకోవడంతో సెన్సెక్స్‌ 600 పాయిట్లు పెరిగింది. మరోపక్క నిఫ్టీ 11,900 పాయింట్ల పైకి ఎగబాకింది.ఈ విధంగా షేర్‌ మార్కెట్‌ ర్యాలీ కొనసాగడానికి ముఖ్యంగా నాలుగు కారణాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
గ్లోబల్‌ రికవరీ
ఆసియా మార్కెట్‌లు పడిపోవడానికి ముఖ్యమైన కారణం కరోనా వైరస్‌ విరుచుకుపడడమే. కరోనా భారీస్థాయిలో విరుచుకుపడడంతో చైనాలో 20 వేలమంది దీని బారినపడగా 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చైనాలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా 23 దేశాలకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందింది. దీంతో షేర్‌ మార్కెట్‌లు బాగా పడిపోయాయి. అయితే మంగళవారం  షాంఘై కాంపొజిట్‌ 0.5 శాతం కోలుకోగా, నికాయ్‌, హ్యాంగ్‌ సెంగ్‌, కాస్పీలు 0.5నుంచి 1.8 శాతం పుంజుకోవడం కూడా మంగళవారం మార్కెట్ల ర్యాలీకి ఒక కారణం. అంతేగాక  డౌజోన్స్‌ ప్యూచర్స్‌ ర్యాలీ181 పాయింట్ల పాజిటివ్‌ ఓపెనింగ్‌ కూడా మార్కెట్‌కు కలిసొచ్చింది. 

మార్కెట్లపై బడ్జెట్‌ నెగిటివ్‌ ప్రభావం చూపకపోవడం
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌-2020 అధిక అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ  దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండడంతో షేర్‌ మార్కెట్‌పై నెగిటివ్‌ ప్రభావాన్ని చూపలేదు. అంతా ఎదురుచూసినట్లుగా లాంగ్‌ టర్మ్‌ గేయిన్స్‌(ఎల్‌టీసీజీ)ఎత్తివేయకపోయినా, పర్సనల్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లో సవరణలు, డివిడెండ్‌ పంపిణీ పన్ను ఎత్తివేయడం, కార్పోరేట్‌ బాండ్స్‌పై ఎఫ్‌ఐఐ ఇన్వెస్ట్‌మెంట్‌ను పరిధిని పెంచడం, ద్రవ్యలోటును 3.3 నుంచి 3.8శాతంకు పెంచడం, ఎల్‌ఐసీని ఐపీఓకి తెస్తామని చెప్పడం వంటి అనేక అంశాల వల్ల మార్కెట్లో నెగిటివ్‌ ప్రభావం పడలేదు. 

సెక్టార్లన్నీంటిలో కొనుగోళ్లు పెరగడం, వీఐఎక్స్‌ తగ్గడం..
నిఫ్టీలో బ్యాంక్‌, మెటల్‌ షేర్లు పెరగడంతో..సెక్టోరియల్‌ ఇండెక్స్‌లో అన్ని గ్రీన్‌లో ట్రేడ్‌ అయ్యాయి. నిఫ్టీలో ప్రధాన గెయినర్స్‌ అయినటువంటి హీరో మొటోకార్ప్‌, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, ఐఒసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, వేదాంత, అల్ట్రా టెక్‌ సిమెంట్‌లు 2-3.6 శాతంతో ర్యాలీ అవుతున్నాయి. వీఐఎక్స్‌ దాదాపు 7శాతం తగ్గి 17.36 నుంచి 14.7 శాతం వద్ద ముగియడం వంటివి మార్కెట్‌ ర్యాలీకీ దోహదం చేశాయి.

ఆయిల్‌ ధరలు స్థిరంగా
కరోనా వైరస్‌ భయంతో డిమాండ్‌ తగ్గడంతో చాలా విమానాలను రద్దు చేశారు. దీంతో ఆయిల్‌ ధరలు పడిపోయాయి. బ్రైంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ తిరిగి పుంజుకుని 55 డాలర్ల వద్ద కొనసాగడంతో క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటున్న భారత్‌ వంటి దేశాలపై ఇది పాజిటివ్‌ ప్రభావాన్ని చూపింది. 


 You may be interested

ఎయిర్‌టెల్‌ క్యూ3 గణంకాలపై బ్రోకరేజ్‌ల అంచనాలివే..!

Tuesday 4th February 2020

టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ మంగళవారం మార్కెట్ ముగింపు అనంతరం డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనుంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్‌) బకాయిలకు క్యు2లో కేటాయింపులు చేసిన నేపథ్యంలో ఈ డిసెంబర్‌ క్వార్టర్‌లో నష్టాలు తక్కువగా ఉండవచ్చని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్‌ మొదటి వారంలో టారీఫ్‌ల పెంపు క్వార్టర్‌ లాభదాయకతకు మద్దతునిస్తుంది.  అంచనాలు... ఈ క్యూ3లో కంపెనీ రూ.780.8 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయవచ్చు. ఆదాయం 3.1శాతం

సెన్సెక్స్‌.. వండర్‌ఫుల్‌ ర్యాలీ

Tuesday 4th February 2020

917 పాయింట్ల హైజంప్‌ 40,789కు ఎగసిన సెన్సెక్స్‌ నిఫ్టీ 272 పాయింట్ల దూకుడు ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ ప్లస్‌ ఉన్నట్టుండి స్టాక్‌ బుల్‌ విరుచుకు పడింది. దీంతో రెండు రోజుల క్రితం కరోనా భయాలు, బడ్జెట్‌ నిరాశలతో కుప్పకూలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ ఏకంగా 917 పాయింట్లు దూసుకెళ్లింది. వెరసి బడ్జెట్‌ రోజు నష్టాలను పూడ్చేసుకుంది. సోమవారం సైతం 137 పాయింట్లు లాభపడటంతో సెన్సెక్స్‌ రెండు

Most from this category