News


ఎంఏసీడీ ఏం చెబుతోంది!

Tuesday 25th June 2019
Markets_main1561444066.png-26557

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
బుల్లిష్‌ సిగ్నల్స్‌
సోమవారం ముగింపు ప్రకారం 38 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో సుజ్లాన్‌, హిండాల్కో, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, ఎన్‌సీసీ, ఎస్కార్ట్స్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, మార్క్‌సాన్స్‌ ఫార్మా, ఐగారషి మోటర్స్‌, టీబీజడ్‌, స్పెన్సర్స్‌, ఓబెరాయ్‌ రియల్టీ, హాత్‌వే, ఎల్‌అండ్‌టీ టెక్‌ సర్వీసెస్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 16 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. అరబిందో ఫార్మా, టెక్‌మహీంద్రా, మహానగర్‌ గ్యాస్‌, యూకో బ్యాంక్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌ తదితరాలు ఈ జాబితాలో ఉన్నాయి. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. You may be interested

టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌కు రేటింగ్‌ కోత

Tuesday 25th June 2019

ప్రముఖ రేటింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఈ ... టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూసీల్‌ కంపెనీల రేటింగ్‌పై కోతను విధించింది. ప్రస్తుతం స్టీల్‌ ధరలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. అలాగే ఎర్నింగ్‌ రిస్క్‌, వాల్యూవేషన్లు విపరీంగా పెరిగాయి. దీంతో జూలై - సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఐరన్‌ ఓర్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ఐరన్‌ ఓర్‌ ధరలు కంపెనీల వ్యయ నియంత్రణ చర్యలపై భారంగా మారేందుకు అవకాశం ఉన్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది.

నష్టాల్లో ఆసియా మార్కెట్లు

Tuesday 25th June 2019

జీ20 సమ్మిట్‌ ముందు ఎదురు చూసే దోరణి అమెరికా-చైనా సమావేశంపై ఇన్వెస్టర్ల దృష్ఠి  ఆసియా మార్కెట్లు మంగళవారం(జూన్‌ 25)ట్రేడింగ్‌లో నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ వారం చివరిలో జపాన్‌లో జరగనున్నా జీ20 సమ్మిట్‌లో అమెరికా- చైనా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించడంతో ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. చైనా షాంఘై కాంపోసీట్‌ 1.6 శాతం, షెంజన్‌ 1.1 శాతం నష్టపోయాయి. అదేవిధంగా హాంకాంగ్‌ హంగ్‌ సెంగ్‌ ఇండెక్స్‌ 1.2 శాతం,

Most from this category