News


కీలక అవరోధ శ్రేణి 38,360-38,422

Monday 17th September 2018
Markets_main1537159758.png-20314

మన మార్కెట్లో రెండు వారాల క్రితం మొదలైన డౌన్‌ట్రెండ్‌ కొనసాగుతున్నప్పటికీ, పతనం ఎంత వేగంగా వుంటున్నదో, రికవరీ సైతం అంతే త్వరితంగా జరుగుతున్నది. అయితే తాజా బౌన్స్‌ల్లో హెవీవెయిట్‌ షేర్లు ఏవీ కూడా కొత్త గరిష్టస్థాయిల్ని నమోదు చేయలేకపోతున్నాయి. సూచీలు మళ్లీ కొత్త రికార్డుల్ని నెలకొల్పాలంటే, హెవీవెయిట్‌ షేర్లు తొలుత ముందడుగు వేయాల్సివుంటుంది. లేకపోతే, మార్కె‍ట్‌ కరెక‌్షన్‌ కొనసాగే ప్రమాదం వుంటుంది. రూపాయి పతనాన్ని నిలువరించేందుకు కేంద్రం పలు చర్యల్ని గత శుక్రవారం ప్రకటించినప్పటికీ,  ఈ వారం పెద్ద షేర్లు వ్యవహరించే తీరు..మన సూచీల ట్రెండ్‌ను నిర్దేశించవచ్చు. ఇక మన ప్రధాన సూచీల సాంకేతికాంశాలు ఇలా వున్నాయి.... 

సెన్సెక్స్ సాంకేతికాలు..
గత మార్కెట్‌ పంచాంగంలో కీలకస్థాయిగా ప్రస్తావించిన 38,525 పాయింట్ల స్థాయిని అధిగమించలేకపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సెప్టెంబర్‌ 14తో ముగిసినవారంలో వేగంగా 37,342 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. అటుతర్వాత కొంతవరకూ కోలుకుని 38,091 పాయింట్ల వద్ద ముగిసింది. అంతక్రితంవారంతో పోలిస్తే 299 పాయింట్లు నష్టపోయింది. ఈ వారం సెన్సెక్స్‌కు 38,360-38,422 పాయింట్ల శ్రేణి కీలకమైనది. 38,990-37,342 పాయింట్ల మధ్య జరిగిన కరెక‌్షన్‌కు 38,360 పాయింట్లు 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయికాగా, 38,422 పాయింట్ల స్థాయి అంతక్రితంవారంలో క్రియేట్‌ అయిన హయ్యర్‌ టాప్‌. ఈ కీలక శ్రేణిని దాటితేనే తదుపరి రికవరీ సాధ్యపడుతుంది. ఆ సందర్భంలో తదుపరి 38,840 పాయింట్ల వద్దకు, అటుతర్వాత మరోమారు 38,990 పాయింట్ల గరిష్ఠాన్ని చేరే ఛాన్స్‌ వుంటుంది. ఈ వారం తొలి అవరోధశ్రేణి దాటలేకపోయినా, గ్యాప్‌డౌన్‌తో మొదలైనా 37,860-37,750 పాయింట్ల శ్రేణి వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ లోపున ముగిస్తే కొద్దిరోజుల్లో తిరిగి 37,340 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే ప్రస్తుత అప్‌ట్రెండ్‌కు అతిముఖ్యమైన మద్దతు 37,135-37,060 పాయింట్ల శ్రేణి మధ్య లభిస్తున్నది.

నిఫ్టీ కీలక అవరోధ శ్రేణి 11,565-11,603
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ గత కాలమ్‌లో ప్రస్తావించిన 11,620 పాయింట్ల కీలక నిరోధాన్ని దాటలేకపోవడంతో వేగంగా 11,250 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది. అటుతర్వాత నష్టాల్లో కొంతవరకూ పూడ్చుకుని 11,515 పాయింట్ల వద్ద ముగిసింది. వారంలో మొత్తంమీద 74 పాయింట్లు నష్టపోయింది.  ఈ వారం మార్కెట్‌ రికవరీ కొనసాగితే నిఫ్టీకి 11,565-11,603 పాయింట్ల నిరోధశ్రేణి కీలకం. రెండు వారాల పతనానికి 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన 11,565 పాయింట్లుకాగా, గతవారపు హయ్యర్‌ టాప్‌ 11,603 పాయింట్లు. ఈ శ్రేణిని దాటితే 11,640 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ స్థాయిపైన స్థిరపడితే, కొద్దిరోజుల్లో అటుపైన తిరిగి 11,760పాయింట్ల స్థా
యిని అందుకోవొచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, గ్యాప్‌డౌన్‌తో మొదలైనా, 11,430-11,380 శ్రేణి మధ్య తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును ముగింపులో కోల్పోతే 11,250 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే, కొద్దిరోజుల్లో 11,210-11,185 పాయింట్ల శ్రేణి వరకూ పతనం కావొచ్చు.You may be interested

బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ ప్రయోజనాలేమిటి? 

Monday 17th September 2018

ప్ర: ఏ ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోలో అయినా కనీసం ఒక బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ ఉంటే మంచిదని చాలా మంది విశ్లేషకులు సూచిస్తున్నారు. అసలు బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఎందుకు ఇన్వెస్ట్‌ చేయాలి ? బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం తప్పనిసరా ? -శ్రీహరి, విశాఖపట్టణం  జ: సాధారణంగా రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. మొదటిది.. పోర్ట్‌ఫోలియోను ఆటోమేటిక్‌గా రీబ్యాలన్స్‌ చేయడం. మీరు కొన్ని ఆర్థిక లక్ష్యాల కోసం కొన్ని మ్యూచువల్‌

ఎయిరిండియా అనుబంధ సంస్థల విక్రయంపై కేంద్రం కసరత్తు

Monday 17th September 2018

న్యూఢిల్లీ: నష్టాలు, రుణాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకి చెందిన నాలుగు అనుబంధ సంస్థలను విక్రయించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఎయిర్‌లైన్‌ అలైడ్ సర్వీసెస్ (ఏఏఎస్‌ఎల్‌), హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌సీఐ), ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (ఏఐఏటీఎస్‌ఎల్), ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీస్ (ఏఐఈఎస్‌ఎల్)ను వ్యూహాత్మకంగా విక్రయించే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, న్యూఢిల్లీలోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయం భవంతితో పాటు

Most from this category