News


ఈ కంపెనీల లాభాలు రెట్టింపయ్యాయి..!

Thursday 29th August 2019
Markets_main1567019305.png-28076

బీఎస్‌ఈ 500లో 36 కంపెనీల లాభాలు క్యూ1లో రెట్టింపయ్యాయి. దేశ ఆర్థిక రంగ వృద్ధి, కార్పొరేట్‌ ఆదాయాల వృద్ధి మందగమనం పరిస్థితుల్లోనూ ఇంత చక్కని పనితీరు చూపించిన ఈ కంపెనీలపై ఇన్వెస్టర్లు తప్పక దృష్టి సారించాలి. 

 

ఇలా లాభాల విషయంలో మంచి పనితీరు చూపించిన కంపెనీల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఆస్ట్రాజెనెకా ఫార్మా, బోంబే బర్మా ట్రేడింగ్‌, చెన్నై పెట్రో, చోళమండలం ఫైనాన్షియల్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌, గుజరాత్‌ గ్యాస్‌, హ్యాట్సన్‌ ఆగ్రో, హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, జైప్రకాష్‌ అసోసియేట్స్‌, మహారాష్ట్ర స్కూటర్స్‌, మోన్‌శాంటో ఇండియా, ర్యాలీస్‌ ఇండియా, శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌, స్పైస్‌జెట్‌, ఎస్‌బీఐ, సుదర్శన్‌ కెమికల్‌, సన్‌ఫార్మా అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌, సన్‌ఫార్మా, సింఫనీ, తమిళనాడు న్యూస్‌ ప్రింట్‌, కర్ణాటక బ్యాంకు, టోరెంట్‌ పవర్‌, ట్రెంట్‌, టీవీ టుడే నెట్‌వర్క్స్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌, వరుణ్‌ బెవరేజెస్‌, వెంకీస్‌ ఇండియా, వోకార్డ్‌ ఉన్నాయి. 

 

కొన్ని కంపెనీలు అంతక్రితం త్రైమాసికాల్లో నష్టాలు ప్రకటించిన స్థితి నుంచి లాభాల్లోకి ప్రవేశించడం గమనార్హం. వీటిల్లో చాలా కంపెనీలను వాటి లాభం రెట్టింపునకు పైగా పెరిగినప్పటికీ కొనుగోలు చేసుకోవచ్చంటూ చెప్పలేమని, నికర లాభం పెరగడానికి రకరకాల కారణాలు ఉన్నట్టు విశ్లేషకులు పేర్కొన్నారు. ‘‘త్రైమాసికంగా లాభాలు పెరిగిన కంపెనీలన్నీ బలమైనవి కావు. స్టాక్‌ ధరపై ఎన్నో అంశాలు ‍ప్రభావం చూపిస్తాయి. ఏవియేషన్‌లో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, స్పైస్‌జెట్‌ కంపెనీలు జెట్‌ఎయిర్‌వేస్‌ మూతపడడం వల్ల లాభపడ్డాయి. అలాగే, ఈ 36 కంపెనీల లాభాలు పెరగడానికి ఎన్నో అంశాలు కారణంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక మందగమనంలో ధరలను చూసి ఈ షేర్లలో ప్రవేశిస్తే చిక్కుకున్నట్టే అవుతుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా అన్నారు. 

 

కేవలం లాభాలు మాత్రమే పెరిగే కంపెనీని ఎంచుకోవడం సరికాదన్నారు ఇండియాబుల్స్‌ వెంచర్స్‌కు చెందిన ఫోరమ్‌పరేఖ్‌. ‘‘అల్ట్రాటెక్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, గుజరాత్‌ గ్యాస్‌ లాభం ఎటువంటి అసాధారణ అంశాలు లేకుండా రెట్టింపునకు పైగా పెరిగింది. కనుక ఈ షేర్లను ప్రస్తుత కరెక్షన్‌లో కొనుగోలు చేయడం మంచిదే అవుతుంది. చాలా రంగాల్లో గత రెండు త్రైమాసికాల్లో మందగమనం నెలకొంది. ఇలాంటి తరుణంలోనూ ఈ కంపెనీలు మంచి లాభాలను ప్రకటించాయి. దీంతో మంచి సమయంలో ఇంకా మెరుగైన ఫలితాలను ప్రకటించగవలన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి’’ అని పరేఖ్‌ వివరించారు. కేవలం లాభాలను మాత్రమే చూడకుండా, ఆ కంపెనీల యాజమాన్యం సత్తా, కంపెనీ మూలధనంతో పోలిస్తే రుణ భారం ఎంత మేర ఉంది తదితర అంశాలను చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.You may be interested

200డీఎంఏ దాటితేనే ర్యాలీ...!

Thursday 29th August 2019

నిఫ్టీ50 ఇండెక్స్‌ కీలకమైన 200 డీఎంఏ స్థాయి(11,205)ని క్లోజింగ్‌లో అధిగమించినప్పుడే మార్కెట్లో స్థిరమైన ర్యాలీ సాధ్యపడుతుందని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు. సూచీల కదలికలపై ఆయన విశ్లేషణ ఇలా ఉంది...   ‘‘బుధవారం మరో అస్థిర సెషన్‌ కొనసాగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఆరంభంలో లాభాల్లోనే ఉన్నప్పటికీ చివరికి మూడు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. సూచీ 59 పాయింట్ల నష్టంతో (0.53శాతం) 11,046.10

మూడురోజుల లాభాలకు చెక్‌!

Wednesday 28th August 2019

ఆర్థిక మాంద్య భయాలు మార్కెట్‌లో లాభాల ర్యాలీకి చెక్‌ చెప్పాయి. బుధవారం ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 189.43 పాయింట్లు పతనమైన 37,451.84 వద్ద, నిఫ్టీ 59.25 పాయింట్ల నష్టంతో 11,046.10 వద్ద స్థిరపడ్డాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడే వీలున్నట్లు పెరిగిన ఆందోళనలతో నిన్న అమెరికా మార్కెట్లు, నేడు ఆసియా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. అలాగే బ్రెగ్జిట్‌కు

Most from this category