News


‘2020లో 400 మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ రెట్టింపు’

Wednesday 25th December 2019
Markets_main1577213261.png-30413

స్మాల్‌క్యాప్‌ ఇన్వెస్టర్‌గా పేర్కొనే పొరింజు వెలియాత్‌, ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ అనే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ అధిపతి కూడా అయిన ఆయన.. 2020లో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యా్ప్‌ స్టాక్స్‌ ర్యాలీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగాల్లో 1,000 కంపెనీలు ఉండగా, సుమారు 350-400 వరకు సగటున 100 శాతం కంటే ఎక్కవ రాబడులను వచ్చే ఏడాదిలో ఇస్తాయని ఓ వార్తా సంస్థకు తెలిపారు. 

 

మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు 15-20 లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లోకే వెళుతుండడం అనారోగ్య ధోరణేనని, నూతన సంవత్సరంలో ఇది మారబోతుందన్నారు పొరింజు వెలియాత్‌. మార్కెట్‌వ్యాప్త ర్యాలీని తాను అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ‘‘చాలా స్టాక్స్‌ ఏదో ఒక సమయంలో ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరుస్తాయి. స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ కేవలం 3-5 పీఈలో ట్రేడ్‌ అవుతున్నా కానీ వాటిపై ఇన్వెస్టర్లు నమ్మకం కోల్పోయారు. కానీ, ఈ కంపెనీలు వార్షికంగా 15-20 శాతం మేర వృద్ధి చెందుతూ, 3-6 శాతం డివిడెండ్‌ రాబడిని ఆఫర్‌ చేస్తున్నాయి. వీటిల్లో చాలా స్టాక్స్‌ తప్పకుండా ఆశ్చర్యపరుస్తాయి’’ అని వెలియాత్‌ వివరించారు. 2015-2017 మధ్య స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ కొంత మేర పెరిగాయని, కానీ ఈ రోజు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్నారు.

 

స్టాక్స్‌ను తెలివిగా ఎంచుకోవాలని వెలియాత్‌ సూచించారు. భారీ అమ్మకాలతో పెద్ద ఎత్తున స్టాక్స్‌ విలువ కరిగిపోయిందని, ఇప్పటికీ 300-400 మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీలు (పెట్టుబడులకు అర్హం కానివి) సున్నా స్థాయికి విలువను కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేశారు. గత ఏడాదిన్నరగా స్మాల్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీలలో చాలా వాటి మార్కెట్‌ విలువ వాటి జీవిత గరిష్టాల నుంచి చూస్తే, 50-90 శాతం మధ్య తరిగిపోయింది. ఈ తరహా అంతరాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు వెలియాత్‌. సంస్కరణల కంటే చిన్న స్టాక్స్‌ను పైకి తీసుకెళ్లేందుకు సెంటిమెంటల్‌ బూస్టర్‌ అవసరం అన్నారు. లార్జ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ వ్యాల్యూషన్ల మధ్య మరింత అంతరం వచ్చినందున కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోళ్ల రూపంలో మద్దతు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ‘‘బడ్జెట్‌ నుంచి ఈ మద్దతు రావచ్చు. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) తొలగింపు లేదా డివిడెండ్‌ పంపిణీ పన్నును తగ్గిస్తే అప్పుడు స్టాక్స్‌ పట్ల ఆసక్తి తిరిగి ఏర్పడుతుంది’’అని వెలియాత్‌ అంచనా వేశారు. వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబుల రూపంలోనూ ఉపశమనం ఉండొచ్చన్నారు. 



You may be interested

బీపీసీఎల్‌ విక్రయం ఆలస్యమైతే కరెక్షనే!

Wednesday 25th December 2019

బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటాలను ప్రైవేటు సంస్థకు విక్రయించే ప్రతిపాదనను వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేస్తే అది తప్పకుండా మార్కెట్లపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీపీసీఎల్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల విక్రయాన్ని 2020 మార్చి 31 తర్వాతకు వాయిదా వేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్త కథనం మంగళవారం వెలుగు చూసింది. దీంతో బీపీసీఎల్‌ ధర 3 శాతం పడిపోయి రూ.477.40 వద్ద క్లోజయింది.    బీపీసీఎల్‌ ప్రైవేటీకరణను

సెన్సెక్స్‌ 181, నిఫ్టీ 48 పాయింట్ల డౌన్‌

Tuesday 24th December 2019

ఇంట్రాడే కనిష్టం వద్ద ఇండెక్సుల ముగింపు ఐటీ, ఆటో, మీడియా వీక్‌- మెటల్‌,  రియల్టీ అప్‌ ట్రెండ్‌ను ప్రభావితం చేయగల ప్రధాన అంశాలు కొరవడిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు డీలాపడ్డాయి. సెన్సెక్స్‌ 181 పాయింట్లు క్షీణించి 41,461 వద్ద నిలవగా.. నిఫ్టీ 48 పాయింట్లు నీరసించి 12215 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,703 వద్ద గరిష్టాన్ని తాకగా.. 41,423 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇదేవిధంగా నిఫ్టీ

Most from this category