News


ఈ కంపెనీల లాభం రెట్టింపయ్యెను

Friday 16th August 2019
Markets_main1565978799.png-27818

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికానికి సంబంధించి ఫలితాల సీజన్‌ దాదాపు ముగిసినట్టే. ఏవో కొన్ని కంపెనీలను మినహాయిస్తే చాలా కంపెనీలు ఇప్పటికే ఫలితాలను ప్రకటించేశాయి. ఎఫ్‌ఎంసీజీ, పెయింట్స్‌, కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ సంస్థలు అంచనాలకు మించి మెరుగైన ఫలితాలను ప్రకటించాయి. ఆటో, ఆటో యాన్సిలరీ, మధ్యస్థాయి ఐటీ కంపెనీల ఫలితాల్లో మాత్రం వృద్ధి అంచనాలు మిస్సయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 20 కంపెనీల లాభం పెరగ్గా, ఇతర కంపెనీల లాభం తగ్గింది. 

 

ఇప్పటి వరకు సుమారు 2,500 వరకు బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలు ఫలితాలను ప్రకటించాయి. వీటిల్లో స్మాల్‌, మిడ్‌క్యాప్‌ విభాగాలకు చెందిన 35 కంపెనీల లాభం, అంతక్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరిగింది. ఈ కంపెనీలు కూడా కనీసం రూ.30 కోట్లు, ఆపైన లాభాలను ప్రకటించినవి కావడం గమనార్హం. కొన్ని కంపెనీల లాభం ఈ స్థాయిలో పెరగడానికి అసాధారణంగా వచ్చినవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు నిట్‌ కంపెనీకి ఏకీకృతంగా రూ.1,291 కోట్లు రావడంతో లాభం 61 రెట్లు పెరిగేందుకు దారితీసింది. ఒక్కోసారి కంపెనీలు తమ అనుబంధ కంపెనీల వాటాలు విక్రయించడం, లేదా పన్ను రూపంలో మిగులు ఇలా రకరకాల అంశాలతో ఏకీకృతంగా కొంత మేర కలిసి వస్తుంటుంది. దీంతో లాభం భారీగా పెరిగినట్టు కనిపిస్తుంది. అందుకే లాభాలు పెరగడానికి అసలు కారణాలను చూసిన తర్వాతే ఇన్వెస్టర్లు పెట్టుబడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ‘‘ఒకవేళ ఇది ఏకీకృత రూపంలో వచ్చినది అయితే కంపెనీ రెండు రెట్ల పెరుగుదల ప్రకటించినా కానీ అప్రమత్తంగా ఉండాలి. స్థిరమైన మంచి వృద్ధి చూపించే కంపెనీలను ఇన్వెస్టర్లు ఎంచుకోవాలి’’ అని ఎక్వినామిక్స్‌ వ్యవస్థాపకుడు జి.చొక్కలింగం సూచించారు. 

 

ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, ఉషా మార్టిన్‌, గోకల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌, ఎంసీఎక్స్‌, ఐవోఎల్‌ కెమికల్స్‌, దీపక్‌ నైట్రేట్‌ కంపెనీలు 300 నుంచి 4,220 శాతం మధ్య లాభంలో వృద్ధిని చూపించాయి. నిట్‌ లాభంలో అంత వృద్ధి ఉందని వెంటనే ఇన్వెస్ట్‌ చేస్తారేమో..? ఎలారా క్యాపిటల్‌ ఈ స్టాక్‌ టార్గెట్‌ ధరను రూ.183 నుంచి రూ.157కు తగ్గించింది. కనీస ప్రత్యామ్నాయ పన్ను రూపంలో కలసి వచ్చిన దాన్ని తాము పరిగణనలోకి తీసుకోవడం లేదని ఎలారా క్యాపిటల్‌ పేర్కొంది. ఇక ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో)కు జెట్‌ ఎయిర్‌వేస్‌ మూతపడడం కలిసొచ్చింది. అదే సమయంలో పనితీరు మెరుగుపడడంతో మంచి ప్రదర్శన చూపించింది. దీంతో ఈ స్టాక్‌ టార్గెట్‌ను రూ.1,846గా సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఇ‍వ్వడం గమనార్హం. పోకర్ణ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఓరియంట్‌ సిమెంట్‌, ఇండియా సిమెంట్స్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు, జైడస్‌ వెల్‌నెస్‌, తమిళనాడు న్యూస్‌ప్రింట్‌, జేకే సిమెంట్‌, కోల్టే పాటిల్‌, హిందుస్తాన్‌ మీడియా వెంచర్స్‌, దాల్మియా భారత్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, బ్యాంకు ఆఫ్‌ ఇండియా, వెల్‌స్పన్‌ కార్ప్‌ 150-260 మధ్యలో లాభాల వృద్ధిని చూపించాయి. అలాగే, ఏయూస్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, యునైటెడ్‌ స్పిరిట్స్‌, డీఎల్‌ఎఫ్‌, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌, సుబ్రోస్‌, ఫోనిక్స్‌ మిల్స్‌, ట్రిడెంట్‌, సీమెక్‌, సుప్రీం పెట్రోకెమ్‌, పవర్‌గ్రిడ్‌, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌, ఇప్కా ల్యాబ్‌, హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ లాభం 100 శాతానికి పైగా పెరిగింది. You may be interested

'ఆటో'లో మరిన్ని మూసివేతలు

Saturday 17th August 2019

  తాత్కాలికంగా ఉత్పత్తి నిలిపివేసిన హీరో, సుందరం క్లేటన్‌ హీరో ప్లాంటు 4 రోజుల పాటు మూసివేత న్యూఢిల్లీ: వాహన విక్రయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని మరింతగా తగ్గించుకుంటున్నాయి. దీంతో ప్లాంట్ల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌, సుందరం-క్లేటన్ (ఎస్‌సీఎల్‌) సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. హీరో మోటోకార్ప్‌ ఆగస్టు 15-18 దాకా (నాలుగు రోజుల పాటు) ప్లాంట్లను

తగ్గిన ప్రమోటర్ల తనఖా బంధం..

Friday 16th August 2019

ఇన్వెస్టర్లను సంతోషానికి గురి చేసే సమాచారం ఏమిటంటే... బీఎస్‌ఈ 500 కంపెనీల్లో ప్రమోటర్ల తనఖా షేర్ల పరిమాణం జూన్‌ క్వార్టర్‌లో తగ్గడం. తనఖాలో ఉన్న ప్రమోటర్ల వాటాల పరిమాణం జనవరి-మార్చి క్వార్టర్‌లో 2.83 శాతంగా ఉండగా, ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో 2.47 శాతానికి క్షీణించిందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ ఓ నివేదికలో వెల్లడించింది. తనఖాలో ఉన్న ప్రమోటర్ల మొత్తం వాటాల విలువ 1.73 లక్షల కోట్లు.    ప్రమోటర్లు తమ వాటాలను రుణాల కోసం

Most from this category