News


ఎఫ్‌అండ్‌ఓ నుంచి నిష్క్రమించే స్టాకులను ఏం చేద్దాం?

Thursday 27th June 2019
Markets_main1561630219.png-26630

జూన్‌ సీరిస్‌తో 34 స్టాకులు ఎఫ్‌అండ్‌ఓ నుంచి వైదొలగుతున్నాయి. ఈ స్టాకులను ఫ్యూచర్స్‌ విభాగం నుంచి తొలగిస్తున్నట్లు ఏప్రిల్‌లోనే ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఇలా ఎఫ్‌అండ్‌ఓ నుంచి నిష్క్రమిస్తున్న స్టాకుల్లో ఆర్‌పవర్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, జైన్‌ ఇరిగేషన్‌, పీసీ జువెల్స్‌, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, సీజీ పవర్‌, సియట్‌, అజంతా ఫార్మా, ఐడీఎఫ్‌సీ, కావేరీ సీడ్స్‌, సౌత్‌ ఇండియా బ్యాంక్‌, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ తదితరాలున్నాయి. మార్కెట్‌ క్యాప్‌ పరంగా దేశీయ కంపెనీల్లో టాప్‌500 స్థానాల్లో లేని వాటిని ఎన్‌ఎస్‌ఈ తన ఎఫ్‌అండ్‌ఓ విభాగం నుంచి తొలగిస్తుంది. వరుసగా మూడు సీరిస్‌లు నిర్దేశిత నియమావళిని అందుకోలేని స్టాకులు ఎఫ్‌అండ్‌ఓ నుంచి నిష్క్రమిస్తాయి. 

ఏప్రిల్‌లో వీటి నిష్క్రమణ గురించి ప్రకటించిన అనంతరం ఈ 34 స్టాకుల్లో 7 స్టాకులు మాత్రమే ఇప్పటివరకు పాజిటివ్‌ రాబడులు ఇచ్చాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే వీటిలో కేవలం 4 స్టాకులే పాజిటివ్‌గా ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిర్ణయంతో వీటిలో పతనం వచ్చిందని చెప్పలేమని, వీటి ఫండమెంటల్స్‌ కారణంగానే నష్టాలు వచ్చాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నోటిఫికేషన్‌ అనంతరం జాగ్రత్త పడిన ఇన్వెస్టర్లు కొంతమేర ఊరట పొందారని చెప్పారు.

ఈ కంపెనీల్లో చాలా కంపెనీలు వివిధ సమస్యలతో సతమతమవుతున్నందున వీటిని ప్రస్తుతం కొనుగోలు చేయడం అంత మంచిది కాదని ఎస్‌ఎస్‌జే ఫైనాన్స్‌ ప్రతినిధి అతీష్‌ సలహా ఇచ్చారు. వీటిలో అత్యధికం రుణభారంతో కుంగిపోతున్నాయని, అందువల్ల సాధారణ వ్యాపారం కొనసాగించడం కూడా వీటికి కష్టంగా మారిందని చెప్పారు. ఈ స్టాకులు రికవరీ అవుతాయన్న నమ్మకంతో అలాగే పెట్టుబడులు కొనసాగించడం మంచిదికాదన్నారు. అయితే వీటిలో బీఈఎంఎల్‌, సియట్‌, గోద్రేజ్‌ లాంటి కొన్నికంపెనీలు తిరిగి పుంజుకునే సత్తా ఉన్నవని, వీటిలో పెట్టుబడులు పరిశీలించవచ్చని సూచించారు. వచ్చే రెండు మూడేళ్ల కోసం వీటిని క్యాష్‌మార్కెట్లో కొనుగోలు చేయవచ్చని సూచించారు. బయటకు పోతున్న ఈ స్టాకులను నమ్మేకన్నా త్వరలో ఎఫ్‌అండ్‌ఓలోకి రాగల సత్తా ఉన్న స్టాకులను నమ్ముకోవాలని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సూచించింది. You may be interested

త్వరలో ఫైనాన్షియల్‌ ఈటీఎఫ్‌?

Thursday 27th June 2019

ఆర్థిక రంగానికి ప్రత్యేకించిన ఎక్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. మార్కెట్లో లిస్టయిన పీఎస్‌యూ బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రభుత్వ రంగ విత్తసంస్థల షేర్లతో కొత్త ఈటీఎఫ్‌ను రూపొందించనున్నారు. ఈ ఫండ్‌ సృష్టించేందుకు కావలిసిన సలహాదారు నియామకానికి తాజాగా డీఐపీఏఎం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌, భారత్‌ 22 ఈటీఎఫ్‌లు బాగా విజయవంతమయ్యాయని డీఐపీఏఎం అధికారి వ్యాఖ్యానించారు. గతేడాదిలో పీఎస్‌బీలు బలోపేతం చెందినందున

వాటా విక్రయంతో యాక్సిస్‌ బ్యాంక్‌ హెచ్చుతగ్గులు

Thursday 27th June 2019

యాక్సిస్‌బ్యాంక్‌ షేరు గురువారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. ఒకదశలో ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.806.65 నుంచి 2 శాతం నష్టపోయి రూ.781 వద్దకు తగ్గిన యాక్సిస్‌ బ్యాంక్‌ తిరిగి పుంజుకుని రూ. 800 సమీపంలో క్లోజయ్యింది. కంపెనీ షేర్ల అమ్మకం ద్వారా సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 130 కోట్ల డాలర్లను సమీకరించనుందని బ్లుమ్‌బర్గ్‌ వార్తా సంస్థ నివేదించడంతో ఈ షేరులో హెచ్చుతగ్గులు నెలకొన్నాయి. రూ.789.35 వద్ద ప్రారంభమై, మొదట్లోనే  2శాతం లాభపడి రూ.806.65కు చేరుకుంది.

Most from this category