News


ఫండ్‌ మేనేజర్స్‌ షాపింగ్‌

Thursday 14th March 2019
Markets_main1552504754.png-24590

దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు ఫిబ్రవరి నెలలో నికరంగా రూ.565 కోట్ల విలువచేసే షేర్లను విక్రయించాయి. గత నెల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోళ్లు చేస్తుంటే, దేశీయ ఇనిస్టిట్యూషన్లు అమ్మకాలు చేస్తున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి నిధుల రాక తగ్గింది కూడా. సాధారణ ఎన్నికల ముందు మార్కెట్ల ప్రతికూల పనితీరు ప్రభావం నిధుల రాకపై పడింది. దీంతో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.23.4 లక్షల కోట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఫిబ్రవరి నెలలో చేసిన అమ్మకాలు, విక్రయాలను పరిశీలిస్తే... 

 

లార్జ్‌క్యాప్‌ విభాగంలో వివిధ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) పలు పథకాల పరిధిలో... గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌, హీరో మోటోకార్ప్‌, ఏసీసీ లిమిటెడ్‌, సెయిల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంకు స్టాక్స్‌ను కొనుగోలు చేశాయి. మిడ్‌క్యాప్‌ విభాగంలో ఇమామీ లిమిటెడ్‌, టాటా కమ్యూనికేషన్స్‌, నాల్కో, అపోలో హాస్పిటల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ స్టాక్స్‌లో తాజా పెట్టుబడులు పెట్టాయి. స్మాల్‌క్యాప్‌లో చాలెట్‌ హోటల్స్‌, బలరాంపూర్‌ చినీమిల్స్‌, యూనికెమ్‌ ల్యాబ్స్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, బిర్లాసాఫ్ట్‌ స్టాక్స్‌ను కొన్నాయి. 

 

ఫండ్స్‌ అమ్మకాలను పరిశీలిస్తే... లార్జ్‌క్యాప్‌ విభాగంలో పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ హోల్డింగ్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ను... మిడ్‌క్యాప్‌లో ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఆయిల్‌ ఇండియా, ఎస్కార్ట్స్‌... స్మా్ల్‌క్యాప్‌ విభాగంలో గల్ఫ్‌ ఆయిల్‌ లూబ్రికెంట్స్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌, గుజరాత్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్స్‌ను విక్రయించాయి.  



You may be interested

మార్కెట్లపై ఎన్నికల ప్రభావం...!

Thursday 14th March 2019

రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోనున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయన్న ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొంది. అయితే, ఎన్నికల ఫలితాల ప్రభావం మార్కెట్లపై స్వల్ప కాలం పాటేనంటోంది క్వాంటం మ్యూచువల్‌ ఫండ్‌. ఇందుకు సంబంధించి ఓ అధ్యయనం చేసి గణాంకాలను విడుదల చేసింది.    2004 ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ సర్కారు ఓటమి పాలు కావడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మే 12న 5,358 పాయింట్ల నుంచి మే 21 నాటికి

ఆగని పరుగు...మూడో రోజూ లాభాల ముగింపు

Wednesday 13th March 2019

హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ద్వయం ర్యాలీతో బుధవారం మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఆర్థిక, ఎనర్జీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్‌ 216 పాయింట్లు పెరిగి 37752 వద్ద,  నిఫ్టీ 40 పాయింట్ల లాభపడి 11341.70 వద్ద స్థిరపడ్డాయి.  ఈ మూడు రోజుల్లో సెన్సెక్స్‌ 1080 పాయింట్లను, నిఫ్టీ 306 పాయింట్లను ఆర్జించాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సి్‌స్‌ బ్యాంక్‌ షేర్లు ర్యాలీతో బ్యాంక్‌

Most from this category