News


30 కంపెనీల్లో ప్రమోటర్ల తనఖాలు పెరిగాయ్‌..!

Friday 8th November 2019
Markets_main1573206169.png-29452

 ప్రమోటర్ల తనఖా చేసిన వాటా రెండో క్వార్టర్లో 2.52శాతానికి చేరుకుంది. జూన్‌ త్రైమాసికంలో ఈ వాటా 2.47శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌ మొత్తం క్యాపిటలైజేషన్‌లో 1.24శాతానికి సమానమైన ప్రమోటర్ల ఈక్విటీ షేర్లు తనఖాలో ఉన్నట్లు కోటక్ ఇంటర్నేషనల్‌ ఈక్విటీ గణాంకాలు చెబుతున్నాయి. తనఖా పెట్టిన షేర్ల ద్వారా సేకరించిన నిధులు... వాస్తవానికి కంపెనీ రోజువారీ వ్యాపారం సజావుగా నిర్వహించడానికి అవసరమైన వర్కింగ్‌ క్యాపిటల్‌ను పెంచడానికి సహాయపడుతుంది.  వ్యాపార విస్తరణకు నిధుల సేకరణలో భాగంగా ప్రమోటర్లు తమ షేర్లను తనఖా పెడతారు. 

‘‘రెండో త్రైమాసికపు పై రేటింగ్ ఏజెన్సీ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఏజెన్సీలు రేటింగ్‌ను తగ్గించడటం, కఠినమైన రుణ నిబంధనల కారణంగా చాలా బ్యాంకులు కార్పొరేట్ రుణాలను, ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాయి. చాలా వరకు కార్పొరేట్‌ రుణాలు స్థూల ఎన్‌పీఏలు మారాయి. తాజాగా కంపెనీలపై ప్రభుత్వం కార్పోరేట్‌ పన్ను తగ్గించింది. పన్ను మినహాయింపు నుంచి లాభపడే కంపెనీల షేర్లు ఇప్పటికే 10శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ఈ కారణంగా ప్రమోటర్ల హోల్డింగ్‌ విలువ పెరిగింది. బ్యాంకులు ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ నుండి నిధులను సేకరించడానికి ప్రమోటర్లు తమ షేర్లను తనఖాపెడుతున్నారు. అని బోనంజా పోర్ట్‌ఫోలియో లిమిటెడ్‌ సీనియర్‌ అనలిస్ట్‌ జితేంద్ర ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. 

వీటిలో జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, అజంతా ఫార్మా, మాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, డీబీ కార్పోరేషన్‌, ఫ్యూచర్‌ రీటైల్‌, ఇమామి, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, యస్‌బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫ్యూచర్‌ లైఫ్‌సైల్‌ కంపెనీలున్నాయి.

బీఎస్‌ఈ -500 ఇండెక్స్‌లో 110 కంపెనీల ప్రమోటర్లు తమ హోల్డింగ్స్‌ను తాకట్టు పెట్టారు. ఇందులో 7 కంపెనీల ప్రమోటర్లు 90శాతానికి పైగా వాటాను తనాఖా పెట్టారు.  

‘‘షేర్లు తనఖా పెట్టడం అనేది తప్పనిసరి కాదు. లేదా ప్రమోటర్‌ ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని​అర్థం కాదు. రుణాలు ఇచ్చే కంపెనీలు తాము ఇచ్చే మొత్తానికి షేర్ల రూపంలో సెక్యూరిటీని ప్రమోటర్ల నుంచి కోరుతాయి.’’ అని​కోటక్‌ సం‍స్థ స్పష్టం చేసింది. 

అయితే ప్రమోటర్లు ఎక్కువ శాతం షేర్లను తాఖట్టు పెట్టడటం మంచి పరిణామం కాదు. షేర్లు తనఖా పెట్టిన సమయంలో మార్కెట్‌ ఆకస్మిక పతనంతో తనఖా పెట్టిన షేర్ల విలువ భారీ పడిపోయే అవకాశం ఉంది.

తగ్గుతున్న తనఖా షేర్ల వాటా:- 
ఇటీవల కొన్ని కంపెనీల ప్రమోటర్లు తనఖాల పెట్టిన షేర్లు రుణాలు చెల్లించి ఉపసంహరించుకుంటున్నారు. జేకే టైర్స్‌, సెంట్రమ్‌ క్యాపిటల్‌, ఇన్ఫీభీమ్‌, గేట్‌ వే డిస్ట్రిపార్క్‌, స్వాన్‌ ఎనర్జీ, అదానీ పోర్ట్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా కంపనీల ప్రమోటర్లు తనఖా పెట్టిని షేర్లను విడుదల చేసుకుంటున్నారు. 
అయితే... ఈ కంపెనీల్లో షేర్లను కొనుగోళ్లు చేయవచ్చా అంటే.. ‘‘ప్రమోటర్లు తనఖా షేర్లను విడిపించుకోవడం శుభపరిణామం అయితే, ఇన్వెసర్లు ఈ తరహా షేర్లను కొనుగోలు చేసేటప్పుడు కంపెనీ ప్రాథమిక అంశాలను నిశితంగా పరిశీలించాలి సలహానిస్తున్నారు విశ్లేషకులు. You may be interested

సిప్‌ పెట్టుబడులు తగ్గాయ్‌: ఏఎంఎఫ్‌ఐ

Friday 8th November 2019

 సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) ఇన్‌ఫ్లో అక్టోబర్‌ నెలలో  స్వల్పంగా తగ్గిందని మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ ఇండియా(ఏఎంఎఫ్‌ఐ) శుక్రవారం ప్రకటించింది. ఈ నెలలో సిప్‌ల ప్రవాహం రూ. 8,262 కోట్ల నుంచి రూ. 8,245 కోట్లకు పడిపోయిందని తెలిపింది. కానీ మొత్తం సిప్‌ ఖాతాలు ఈ నెలలో 4.74 లక్షలు పెరిగి 2.18 కోట్లకు చేరింది. అంతేకాకుండా సిప్‌ల ద్వారా నిర్వహిస్తున్న ఆస్తి(ఏయూఎం) రూ. 14,600 కోట్లు పెరిగి, రూ. 3

పసిడికి తిరిగి డిమాండ్‌ పెరుగుతుంది!

Friday 8th November 2019

అధిక ధరలు కారణంగా బంగారు ఆభరణాలకు డిమాండ్‌ భారీగా తగ్గింది. తక్కువ కాలంలో ఇంత మొత్తంలో బంగారం ధరలు పెరగడం మొదటి సారిగా చూస్తున్నాం’ అని  వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఇండియా, ఎండీ, పీఆర్‌ సోమసుందరమ్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. బంగారం కొనుగోళ్లు తగ్గాయి.. ధరలు అధికంగా పెరగడంతో బంగారం ఆభరణాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. దీంతోపాటు బంగారం ధరలు పెరిగినప్పుడు, దానిని సొమ్ము

Most from this category