News


నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు జూమ్‌

Monday 20th January 2020
Markets_main1579513473.png-31050

చెన్నై పెట్రోలియం హైజంప్‌
గోవా కార్బన్‌ అప్పర్‌ సర్క్యూట్‌
పాలీకేబ్‌ ఇండియా కొత్త గరిష్టం

తొలుత హుషారుగా ప్రారంభమైనప్పటికీ తదుపరి అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు  పతన బాట పట్టాయి. మధ్యాహ్నం 2.30 సమయంలో సెన్సెక్స్‌ 333 పాయింట్లు పతనమై 41,612ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 12,245 వద్ద ట్రేడవుతోంది. ఈ పరిస్థితుల్లోనూ విభిన్న వార్తల కారణంగా చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌, గోవా కార్బన్‌, పాలీకేబ్‌ ఇండియా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌
పీఎస్‌యూ... చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో స్టాం‍డెలోన్‌ ప్రాతిపదికన రూ. 6.4 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 367 కోట్ల నికర నష్టం నమోదైంది. ఈ క్యూ3లో రూ. 9 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. గతంలో ఇదే కాలానికి రూ. 555 కోట్ల ఇబిటా నష్టం నమోదైంది. కాగా,.. మొత్తం ఆదాయం 7 శాతం క్షీణించి రూ. 9147 కోట్లకు చేరింది. స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు సగటున 2.69 డాలర్లను తాకాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో చెన్నై పెట్రోలియం షేరు దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 154 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 164 వరకూ ఎగసింది.

గోవా కార్బన్‌ లిమిటెడ్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో గోవా కార్బన్‌ లిమిటెడ్‌ నికర నష్టాలను తగ్గించుకుంది. స్టాం‍డెలోన్‌ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో రూ. 4 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 4.9 కోట్ల నష్టం నమోదైంది. కాగా.. అమ్మకాలు సైతం 13 శాతం పెరిగి రూ. 107 కోట్లను తాకాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గోవా కార్బన్‌ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 14 జంప్‌చేసి రూ. 294 వద్ద ఫ్రీజయ్యింది. 

పాలీకేబ్‌ ఇండియా
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) క్యూ3 ఫలితాలు మంగళవారం(21న) ప్రకటించనున్న నేపథ్యంలో ఎలక్ట్రిలక్‌ గూడ్స్‌ కంపెనీ పాలీకేబ్‌ ఇండియా కౌంటర్‌ జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పాలీకేబ్‌ షేరు 2 శాతం బలపడి రూ. 1130 వద్ద ట్రేడవుతోంది. తొలుత 3 శాతం ఎగసి రూ. 1140 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. కాగా.. పటిష్ట పనితీరు కారణంగా గత మూడు నెలల్లో పాలీకేబ్‌ షేరు 58 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఇందుకు సెప్టెంబర్‌ క్వార్టర్‌(క్యూ2)లో నికర లాభం రెట్టింపునకుపైగా పెరిగి రూ. 194 కోట్లకు చేరడం సహకరించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.



You may be interested

ఫలితాల తర్వాత టీసీఎస్‌ షేరు చాలా ఖరీదు: బ్రోకరేజ్‌లు

Monday 20th January 2020

దేశీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ శుక్రవారం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.  ప్రకటించిన ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే షేరు విలువ అధికంగా ఉంది. కాబట్టి ఈ షేరు కొనుగోలు పట్ల కొంత అప్రమత్తత వహించాలని దేశీయ బ్రోకరేజ్‌ సంస్థలు ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నాయి.  ఈ క్యూ3లో రూ. 8,118 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన రూ.8,105 కోట్ల

ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ హైజంప్‌- ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ పతనం

Monday 20th January 2020

ఉన్నట్టుండి ఊపందుకున్న అమ్మకాల కారణంగా మార్కెట్లు  పతన బాట పట్టాయి. మధ్యాహ్నం 2.10 సమయంలో సెన్సెక్స్‌ 300 పాయింట్లు, నిఫ్టీ 85 పాయింట్లు చొప్పున కోల్పోయాయి. కాగా.. లోఖండ్వాలా డీబీ రియల్టీ కంపెనీలో ప్రధాన వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడించడంతో ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. అయితే మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ కౌంటర్లో అమ్మకాలు

Most from this category