News


నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు ప్లస్‌

Wednesday 8th January 2020
Markets_main1578461322.png-30759

యస్‌ బ్యాంక్‌, గోవా కార్బన్‌
నవీన్‌ ఫ్లోరిన్‌ కెమికల్స్‌

హెచ్చరించిన విధంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై తాజాగా ఇరాన్‌ మిసైళ్లతో దాడి చేసిన వార్తలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ఆపై బలహీనంగా కదులుతున్నాయి. ఉదయం 10.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 120 పాయింట్లు క్షీణించి 40,750 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 44 పాయింట్లు తక్కువగా 12,008 వద్ద కదులుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు తొలుత అమ్మకాలకు ఎగబడ్డారు. దీంతో సెన్సెక్స్‌ 40,477 దిగువన ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇది దాదాపు 400 పాయింట్ల నష్టంకాగా.. ఈ బాటలో నిఫ్టీ సైతం 12,000 దిగువన 11,930 వరకూ నీరసించింది. కాగా.. ఈ నేపథ్యంలోనూ విభిన్న వార్తల ఆధారంగా ఈ మూడు మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం..

యస్‌ బ్యాంక్‌
ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ తాజాగా ఈక్విటీ షేర్లు, బాండ్లు తదితర సెక్యూరిటీల జారీ ద్వారా నిధుల సమీకరణ ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు బ్యాంకు బోర్డు శుక్రవారం(10న) సమావేశమవుతున్నట్లు యస్‌ బ్యాంక్‌ తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. తొలుత ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 47ను అధిగమించింది. ప్రస్తుతం 2 శాతం బలపడి రూ. 46 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఇటీవల రూ. 21,000 కోట్ల విలువైన యస్‌ బ్యాంక్‌ బాండ్ల రేటింగ్‌ను.. కేర్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడం గమనార్హం! బ్యాంకు కార్యకలాపాలకు కీలకమైన ఈక్విటీ పెట్టుబడులను సమకూర్చుకోవడంలో జాప్యంపై అంచనాలతో బాండ్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు కేర్‌ రేటింగ్స్‌ పేర్కొంది.

గోవా కార్బన్‌
అంతక్రితం నెలతో పోలిస్తే డిసెంబర్‌(2019)లో గోవా ప్లాంటులో ఉత్పత్తి 132 శాతం జంప్‌చేసి దాదాపు 6255 ఎంటీకి చేరినట్లు గోవా కార్బన్‌ తాజాగా తెలియజేసింది. నవంబర్‌ 2019లో ఈ ప్లాంటు ద్వారా దాదాపు 2697 ఎంటీ ఉత్పత్తిని మాత్రమే సాధించినట్లు తెలియజేసింది. ఇక ఈ డిసెంబర్‌లో మొత్తం 11,112 ఎంటీ ఉత్పత్తిని అందుకున్నట్లు వెల్లడించింది. 2018 డిసెంబర్‌లో నమోదైన మొత్తం ఉత్పత్తి 6289 ఎంటీతో పోలిస్తే ఇది 77 శాతం అధికమని వివరించింది. ఈ నేపథ్యంలో గోవా కార్బన్‌ కౌంటర్‌కు డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 230.60 వద్ద ఫ్రీజయ్యింది.  

నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌
మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లోగల ప్లాంటు సీజీఎంపీ సామర్థ్య విస్తరణ పూర్తికావడంతో ఈ నెల 6 నుంచీ ఉత్పత్తిని ప్రారంభించినట్లు నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌ తాజాగా పేర్కొంది. కాంట్రాక్ట్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌కు ఈ ప్లాంటు కీలకంకాగా.. మరోవైపు గుజరాత్‌లోని దహేజ్‌లో రూ. 450 కోట్లతో కొత్త ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. రానున్న మూడు, నాలుగేళ్లలో ఈ ప్లాంటును నెలకొల్పనున్నట్లు వివరించింది. దీంతో ప్రస్తుతం బీఎస్‌ఈలో నవీన్‌ ఫ్లోరిన్‌ షేరు 4.5 శాతం జం‍ప్‌చేసి రూ. 1068 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1084 వరకూ జంప్‌చేసింది.You may be interested

టీసీఎస్‌ లాభాల్లో- ఇన్ఫీ నేలచూపు

Wednesday 8th January 2020

రుపీ ఎఫెక్ట్‌? లాభాల్లో ఎన్‌ఐఐటీ టెక్‌, టీసీఎస్‌ ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌, టాటా ఎలక్సీ డీలా అమెరికా, ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు, బంగారం ధరలు జోరందుకున్నాయి. దీంతో దేశీ కరెన్సీ మరోసారి డీలా పడింది. డాలరుతో మారకంలో 72 మార్క్‌ను తాకింది. ఫలితంగా మార్కెట్లు బలహీనపడ్డాయి. అయితే తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ అమ్మకాలకు ఎదురీదుతూ లాభపడింది. తదుపరి కొంత బలహీనపడింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టీసీఎస్‌, మిడ్‌

నిఫ్టీలో షార్ట్‌ స్ట్రాంగిల్‌ వ్యూహం బెటర్‌!

Wednesday 8th January 2020

నిపుణుల సూచన రిస్కు తీసుకునేందుకు సంశయించని ట్రేడర్లు ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టీ ఆప్షన్స్‌లో షార్ట్‌ స్ట్రాంగిల్‌ వ్యూహం అవలంబించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం వచ్చే వారం ఎక్స్‌పైరీ అయ్యే ఆప్షన్‌ సీరిస్‌ను ఎంచుకోవాలని తెలిపారు. ఇరాన్‌, యూఎస్‌ ఉద్రిక్తతలతో సూచీల్లో ఆటుపోట్లు పెరిగిన సంగతి తెలిసిందే. వీఐఎక్స్‌ కీలక 15 స్థాయికి పైన ప్రస్తుతం కదలాడుతోంది. ఇలాంటప్పుడు పరిమిత లాభాల కోసం కొంత రిస్కు తీసుకొని పైన చెప్పిన వ్యూహం పాటించవచ్చని

Most from this category