News


4 వారాలకు 3 స్టాక్‌ రికమండేషన్స్‌?

Wednesday 22nd January 2020
Markets_main1579667654.png-31091

8-14 శాతం రిటర్న్స్‌ అంచనా
సాంకేతిక అంశాల ఆధారంగా సిఫారసులు

వరుసగా రెండు రోజులపాటు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న దేశీ స్టాక్‌ మార్కెట్లు బుధవారం బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. బడ్జెట్‌పై అంచనాలు పెరగడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సెన్సెక్స్‌ 185 పాయింట్లు ఎగసి 41,510కు చేరగా.. నిఫ్టీ 48 పాయింట్లు పుంజుకుని 12,218ను తాకింది. పెట్టుబడులు, వినియోగంపై దృష్టిపెడుతూ బడ్జెట్‌ వెలువడనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. జీడీపీ వృద్ధికి ఊతమిచ్చే బాటలో ఇన్‌ఫ్రా, హౌసింగ్‌ రంగాలకు సైతం జోష్‌నిచ్చే చర్యలు ఉండవచ్చని చెబుతున్నారు. దీంతో మార్కెట్లు జోరందుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. భారత్‌సహా ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ కుదించిన నేపథ్యంలో మంగళవారం దేశీ మార్కెట్లు వరుసగా రెండో రోజు నీరసించిన విషయం విదితమే. కాగా.. ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌కు చెందిన సీనియర్‌ సాంకేతిక నిపుణులు షితిజీ గాంధీ నాలుగు వారాలకుగాను 8-14 శాతం రిటర్నులు ఇవ్వగల మూడు స్టాక్స్‌ను కొనుగోలుకి సిఫారసు చేస్తున్నారు. సాంకేతిక అంశాల ఆధారంగా ఇచ్చిన ఈ స్టాక్స్‌ వివరాలు చూద్దాం..

రాయల్‌ ఆర్కిడ్‌ హోటల్స్‌
డిసెంబర్‌లో రూ. 51 వద్ద కనిష్టాలను చవిచూశాక స్వల్ప కాలంలోనే రాయల్‌ ఆర్కిడ్‌ హోటల్స్‌ షేరు బౌన్స్‌బ్యాక్‌ అయ్యి రూ. 80 స్థాయికి ఎగసింది. రూ. 77-84 స్థాయిలో కన్సాలిడేషన్‌ జరిగాక ఈ స్టాక్‌ 200 రోజుల చలన సగటు నుంచి బ్రేకవుట్‌ సాధించింది. చార్టుల ప్రకారం ప్రస్తుతం ఈ కౌంటర్‌ సానుకూలంగా కనిపిస్తోంది. దీంతో సమీప కాలంలో ఈ షేరు మరింత జోరు చూపే అవకాశముంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రాయల్‌ ఆర్కిడ్‌ హోటల్స్‌ షేరు 2 శాతం నష్టంతో రూ. 85 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 90ను అధిగమించింది. ఈ షేరుని రూ. 98 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 78 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది.

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
ఇటీవల పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ రూ. 580ను తాకిన తదుపరి పలుమార్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. రూ. 420 వరకూ నీరసించింది. అయితే ఆపై వేగవంత రికవరీ సాధించింది. రోజువారీ చార్టుల ప్రకారం 100 రోజుల చలన సగటుకంటే ఎగువకు చేరింది. ఈ నేపథ్యంలో ట్రేడింగ్‌ పరిమాణంసైతం స్వల్పంగా పెరగడంతోపాటు బ్రేకవుట్‌ సాధించింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 2.2 శాతం బలపడి రూ. 564 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 572కు చేరింది. ఈ షేరుని రూ. 621 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 490 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది.

ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 
నెలవారీ చార్టుల ప్రకారం 100 రోజుల చలన సగటు నుంచి ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కౌంటర్‌ సపోర్ట్‌ను పొందింది. గత నాలుగు నెలలుగా రూ. 310-360 శ్రేణిలో కన్సాలిడేట్‌ అయ్యింది. ఈ వారం లాంగ్‌ బిల్డప్‌ జరిగింది. దీంతో మరోసారి తాజాగా బ్రేకవుట్‌ సాధించనున్నట్లు రోజువారీ చార్టులు పేర్కొంటున్నాయి. వెరసి 200 రోజుల చలన సగటు నుంచి బయటపడే వీలుంది. వారపు చార్టులు సైతం ఇదే అంశాన్ని ధృవీకరిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేరు 1 శాతం బలపడి రూ. 356 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరుని రూ. 380 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 325 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది.You may be interested

నేడు వార్తల్లో షేర్లు

Wednesday 22nd January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌:   జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ క్యూ3 నికర లాభం 37.9 శాతం తగ్గి రూ.349.4 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 5.5 శాతం తగ్గి రూ.2,048.7 కోట్లుగా నమోదైంది. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ: హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ క్యూ3 నికర లాభం 45 శాతం పెరిగి రూ.352.55 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన నికర ఆదాయం 10 శాతం పెరిగి రూ.524.73 కోట్లకు చేరింది. హవెల్స్‌:

12200పైన నిఫ్టీ ప్రారంభం

Wednesday 22nd January 2020

150 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ కలిసొచ్చిన జాతీయ, అంతర్జాతీయ అంశాలు రెండు రోజుల వరుస నష్టాల ముగింపు అనంతరం మార్కెట్‌ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 143 పాయింట్ల లాభంతో 41,467.13 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల పెరిగి 12200పైన 12,203.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడం, ఆసియా మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి లాభంతో ప్రారంభం కావడంతో పాటు

Most from this category