News


ఈ మూడు స్టాక్స్‌ టెక్నికల్‌ బ్రేకవుట్స్‌!

Monday 24th February 2020
Markets_main1582528054.png-32042

జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రికమండేషన్స్‌

ఈ వారంలో ఫిబ్రవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగియనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసే అవకాశమున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన మార్కెట్‌ నిపుణులు ఆనంద్‌ జేమ్స్‌ పేర్కొంటున్నారు. ఉన్నట్టుండి అంతర్జాతీయంగా కోవిడ్‌-19 విస్తరించడం, వైరస్‌ బాధితులు, మృతుల సంఖ్య పెరగడం సెంటిమెంటును బలహీనపరచినట్లు తెలియజేశారు. మార్కెట్లు, పసిడి, స్టాక్స్‌ తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

12,300 వద్ద రెసిస్టెన్స్‌
ఫిబ్రవరి కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో ట్రేడర్లు చాలావరకూ షార్ట్‌ పొజిషన్లను కవర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 12,300ను చేరే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ చైనాతోపాటు తాజాగా దక్షిణ కొరియా, ఇరాన్‌ తదితర దేశాలనూ వణికిస్తోంది. అయితే గత వారం నిఫ్టీ ఒకేరోజు 12,100 పాయింట్ల మార్క్‌ను అందుకుంది. ఇదే విధంగా ఆసియా పసిఫిక్‌ మార్కెట్లలో థాయ్‌లాండ్‌, ఇండొనేసియా, మలేసియా ఈ నెల కనిష్టాల నుంచి కోలుకున్నాయి. దేశీయంగా చూస్తే నిఫ్టీకి 12,300 వద్ద ప్రధాన అవరోధాలు ఎదురుకావచ్చు. తదుపరి సిరీస్‌లో నిఫ్టీ జోరం‍దుకుంటే 12,850వైపు ప్రయాణిం‍చవచ్చు. ట్రేడర్లు వేచిచూడవలసి ఉంటుంది.

డాలరు బలపడుతోంది
నిజానికి సంక్షోభ పరిస్థితులు బంగారానికి డిమాండ్‌ పెంచుతుంటాయి. దీంతో డాలరు ఇండెక్స్‌ను బంగారం బలహీనపరుస్తుంటుంది. అయితే ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ బలపడుతూ వస్తోంది. గత వారం మూడేళ్ల గరిష్టానికి చేరింది కూడా. తద్వారా ప్రత్యామ్నాయ కరెన్సీగా బంగారానికున్న ఆకర్షణను తగ్గించే వీలుంది. కాగా.. మరోవైపు కోవిడ్‌-19 కారణంగా విదేశీ మార్కెట్లో పసిడి ధరలు సైతం పుంజుకుంటూ వస్తున్నాయి. రూపాయి నెల రోజులుగా బలహీనపడటంతో దేశీయంగా పసిడి ధరలు వేగంగా పెరుగుతూ వచ్చాయి. దీంతో దేశీయంగా ప్రస్తుత స్థాయిలో బంగారం కొనుగోలు యోచనను సమర్ధించలేము. ఇక మార్కెట్ల విషయానికివస్తే.. చార్టుల ప్రకారం మూడు స్టాక్స్‌ సాంకేతికంగా బ్రేకవుట్‌ సాధించాయి. జాబితాలో డెల్టా కార్ప్‌, ఇండియా సిమెంట్స్‌, సెంచురీ ప్లైబో‍ర్డ్స్‌ ఉన్నాయి. 

డెల్టా కార్ప్‌
2019లో నమోదైన కనిష్టాల వద్ద కొనుగోళ్లు పెరగడంతో డెల్టా కార్ప్‌ బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. మూడు నెలల్లో 35 శాతం పతనమయ్యాక ఈ కౌంటర్‌ జోరందుకుంది. వారపు చార్టుల ప్రకారం మరింత బలపడే సంకేతాలు కనిపిస్తు‍న్నాయి. రూ. 174 టార్గెట్‌ ధరతో స్వల్ప కాలానికి కొనుగోలు చేయవచ్చు. రూ. 144 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది.

ఇండియా సిమెంట్స్‌
ప్రస్తుత అప్‌ట్రెండ్‌లో భాగంగా ఇండియా సిమెంట్స్‌ కౌంటర్‌లో మార్నింగ్‌ స్టార్‌ ప్యాటర్న్‌ కనిపిస్తోంది. ఇతర సాంకేతిక అంశాలు సైతం​ఈ కౌంటర్‌ మరింత బలపడనున్నట్లు సూచిస్తున్నాయి. దీంతో రూ. 87.4 టార్గెట్‌ ధరతో స్వల్ప కాలానికి కొనుగోలు చేయవచ్చు. రూ. 75.55 వద్ద స్టాప్‌లాస్‌ అమలు చేయవలసి ఉంటుంది.

సెంచురీ ప్లైబోర్డ్స్‌
పక్షం రోజులుగా క్షీణిస్తూ వచ్చిన సెంచురీ ప్లైబోర్డ్స్‌ కౌంటర్‌లో రెండు రోజుల క్రితం కొనుగోళ్ల ఆసక్తి పెరిగింది. దీంతో సాంకేతికంగా ఈ కౌంటర్‌ బుల్లిష్‌ సంకేతాలను ఇస్తోంది. వెరసి ఈ కౌంటర్‌ మరింత పుంజుకునేందుకు వీలుంది. రూ. 162 టార్గెట్‌ ధరతో ఈ కౌంటర్‌లో పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ. 148 వద్ద స్టాప్‌లాస్‌ తప్పనిసరి. 
 You may be interested

ఏజీఆర్‌ చెల్లింపుల ఎఫెక్ట్‌: మూసివేత దిశగా మరో కంపెనీ ..!

Monday 24th February 2020

టెలికం రంగంలో నెలకొన్న సంక్షోభంతో మరో సంస్థ మూసివేతకు దారితీసింది. బ్రాడ్‌బాండ్‌ సేవల అందించే అమెరికా ఆధారిత సం‍స్థ హ్యూస్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌ ఇండియాలో తన సేవలను పూర్తిగా నిలిపివేసేందుకు సిద్దమైంది. కేంద్రానికి చెల్లించాల్సి భారీ సుంకాల కారణంగా భారత్‌ తన కార్యకలాపాలను మూసివేయాల్సి ఉంటుందని, ఈ పరిణామం వేలాది బ్యాంకింగ్ సేవలను ప్రశ్నార్థం చేస్తుందని కంపెనీ టెలికాం శాఖను లేఖ రాసినట్లు ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్‌ ప్రచురించింది.  హ్యూస్‌

52 వారాల కనిష్టానికి 117 షేర్లు

Monday 24th February 2020

సోమవారం 117 షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయి. వీటిలో ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, ఏబీబీ ఇండియా, అలోక్‌ ఇండస్ట్రీస్‌,ఆంధ్రా పేపర్‌, అపర్‌ ఇండస్ట్రీస్‌, అప్కోటెక్స్‌, ఆర్కోటెక్‌, అర్షియా, అట్లాంటా, బంధన్‌ బాయంక్‌, బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా, భారత్‌ గేర్స్‌, బిల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, బిర్లా టైర్స్‌, సీ అండ్‌ సీ కనస్ట్రక్షన్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, సీఎల్‌ ఎడ్యుకేట్‌, సీఐఎల్‌ నోవా పెట్రో కెమికల్స్‌, సీఎస్‌బీ బ్యాంక్‌,

Most from this category