News


10 శాతం రాబడికి మూడు రికమండేషన్లు

Tuesday 31st December 2019
Markets_main1577784026.png-30561

వచ్చే నెల రోజుల్లో దాదాపు 10 శాతం వరకు రాబడినిచ్చే మూడు స్టాకులను బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేశాయి.
1. వరుణ్‌ బెవరేజెస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 790. స్టాప్‌లాస్‌ రూ. 680. డైలీ చార్టుల్లో స్వల్పకాలిక నిరోధం రూ. 713ను దాటి బ్రేకవుట్‌ సాధించింది. స్టాకు ప్రస్తుతం తన కీలక డీఎంఏలకు పైన కదలాడుతోంది. ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీ బుల్లిష్‌గా మారాయి. 
2. సుదర్శన్‌ కెమికల్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 450. స్టాప్‌లాస్‌ రూ. 390. పలుమార్లు దిగువకు వచ్చి 50 రోజుల డీఎంఏ వద్ద మద్దతు పొందింది. తాజాగా రెండు నెలల ట్రేడింగ్‌ రేంజ్‌ను ఛేదించి బయటపడింది. ప్రస్తుతం రూ.610 నిరోధానికి పైన బలంగా ఉంది. వాల్యూంలు కూడా బలంగా ఉన్నాయి. 
3. యూపీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 640. స్టాప్‌లాస్‌ రూ. 560. ఇటీవలే అధోముఖ వాలురేఖను పైవైపుగా ఖండిస్తూ బ్రేకవుట్‌ సాధించింది. దీంతో పాటు రూ. 581 నిరోధాన్ని సైతం బలంగా దాటింది. 20 రోజుల డీఎంఏకు పైన షేరు ధర మద్దతు పొందుతోంది. పలు ఇండికేటర్లు బుల్లిష్‌ సంకేతాలు ఇస్తున్నాయి. You may be interested

వెలుగులోకి ప్రభుత్వరంగ షేర్లు : గెయిల్‌ ఇండియా 2శాతం ర్యాలీ

Tuesday 31st December 2019

నష్టాల మార్కెట్లో ప్రభుత్వ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా మంగళవారం మిడ్‌సెషన్‌ కల్లా బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1శాతం లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌ 6,931.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  ప్రభుత్వరంగ షేర్లైన కోల్‌ ఇండియా, గెయిల్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఎన్‌టీపీసీ, ఆర్‌ఈసీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్లు షేర్లు 2శాతం నుంచి 1శాతం లాభపడ్డాయి. బీహెచ్‌ఈఎల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్‌,

వచ్చే ఏడాదిలో రూ.50వేల కోట్ల ఐపీఓలు

Tuesday 31st December 2019

వచ్చే ఏడాదిలో భారతీయ కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.50వేల కోట్ల నిధుల సమీకరణ సిద్ధమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది(2019)లో 16 కంపెనీలు సమీకరించిన రూ.12,362 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం(రూ.50వేల కోట్లు) విలువ నాలుగు రెట్లు అధికంగా ఉంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎస్‌బీఐ కార్డు అండ్‌ పేమెంట్‌(రూ.9వేల నుంచి 10వేల కోట్లు), యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(రూ.3,5000 నుంచి రూ.4,000), హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ (రూ.1500 కోట్లు),

Most from this category