News


ఇన్‌ఫ్రా నుంచి టాప్‌3 బెట్స్‌

Thursday 4th July 2019
Markets_main1562235276.png-26800

ఆనంద్‌ రాఠీ సిఫార్సులు
బడ్జెట్లో మౌలిక వసతులపై ఎక్కువ ఫోకస్‌ ఉంటుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆనంద్‌ రాఠీ సంస్థ మూడు టాప్‌ ఇన్‌ఫ్రా షేర్లను రికమండ్‌ చేస్తోంది.
1. ఎల్‌అండ్‌టీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1820. గత క్యు4లో కంపెనీ ఆదాయంలో సుమారు 10.5 శాతం లాభం నమోదు చేసింది. ఇన్‌ఫ్రా విభాగంలో కంపెనీ సమయానికి ప్రాజెక్టులను అందించడం కలిసివచ్చే అంశం. హైడ్రోకార్బన్‌ విభాగంలో కూడా స్థిర వృద్ది నమోదు చేస్తోంది. హెవీ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రిక్‌; ఆటోమేషన్‌, సర్వీస్‌ వ్యాపారాలు క్రమానుగతంగా మెరుగుపడుతున్నాయి.
2. కమ్మిన్స్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 955. గత ఆర్థిక సంవత్సరం ఎబిటాలో మంచి మెరుగుదల చూపింది. దేశీయ మూలధన వ్యయంలో బలమైన రికవరీ రాబోతున్న వేళ కంపెనీ పరుగులు తీయనుంది. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్‌ బాగుంది. బలమైన పోటీ ఉన్నందున మార్జిన్లలో భారీ పెరుగుదల ఉండకపోవచ్చు. 
3. సీమెన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1644. బలమైన ఆర్డర్‌ బుక్‌తో బలమైన విక్రయాలను నమోదు చేసింది. వచ్చే రెండేళ్లకు కూడా బలమైన ఆర్డర్లున్నాయి. ఈ ఏడాది ప్రధమార్ధంలో ఆర్డర్ల ప్రవాహం 13.6 శాతం పెరిగింది. ఈ ఏడాది విక్రయాలు 12 శాతం పెరుగుతాయని అంచనా. 



You may be interested

ఇలాంటి బుల్‌ మార్కెట్‌తో జాగ్రత్త!

Thursday 4th July 2019

మార్కెట్‌ నిపుణుడు శంకర్‌ శర్మ స్వల్ప రేంజ్‌లో కదలాడే బుల్‌మార్కెట్లు చివరకు భారీ నష్టాలతో ముగుస్తాయని, ఇలాంటి మిధ్యా ర్యాలీలు ఇన్వెస్టర్లను దెబ్బతీస్తాయని మార్కెట్‌ నిపుణుడు శంకర్‌ శర్మ హెచ్చరించారు. ప్రస్తుతం భారత్‌ స్థూల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందంటున్నారని, కానీ నిజానికి అత్యంత అధ్వాన్నమైన కార్పొరేట్‌స్థాయి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. అందువల్లే దేశీయ మార్కెట్‌ చాలా నీరసంగా, స్వల్ప రేంజ్‌లో కదలాడుతోందన్నారు. కేవలం బ్లూచిప్‌ స్టాకులు కొన్నింటి వల్లనే సూచీలు పైస్థాయిల్లో

బంగారంలో పెట్టుబడులు పెట్టండి: మార్క్‌ మోబియస్‌

Thursday 4th July 2019

వడ్డి రేట్లు తగ్గుతుండడం, బంగారం కొనుగోళ్లను సెంట్రల్‌ బ్యాంకులు పొడిగించడానికి సిద్ధపడడం, అంతర్జాతీయ రాజకీయ పరిస్థీతులలో అనిశ్చితి నెలకొని ఉండడం, క్రిప్టోకరెన్సీకి డిమాండ్‌ పెరగడం వంటి సంకేతాల వలన బంగారం గరిష్ఠ స్థాయిలను తాకనుందని, ఇది ఔన్సు 1,500 డాలర్ల పైకి ఎగబాకనుందని పెట్టుబడి నిపుణుడు మార్క్‌ మోబీస్‌ అన్నారు. మూడు దశాబ్దాలు ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌లో ఇన్వెస్టమెంట్‌లో పనిచేసి గత ఏడాది మోబియస్‌ క్యాపిటల్‌ పార్టనర్స్‌ ఎల్‌ఎల్‌పీ పేరుతో ఆయన కొత్తగా

Most from this category