News


సత్తా చూపిస్తున్న డయోగ్నోస్టిక్‌ స్టాక్స్‌

Monday 21st October 2019
Markets_main1571680190.png-29033

హెల్త్‌కేర్‌ రంగం స్టాక్స్‌ (ఫార్మా) గడ్డు పరిస్థితులను చవిచూస్తుంటే, మరోవైపు ఇదే విభాగంలోని డయోగ్నోస్టిక్‌ (వ్యాధి నిర్ధారణ కేంద్రాలు) కంపెనీల స్టాక్స్‌ మంచి రాబడులను అందించాయి. దేశంలో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిశ్రమ పరిమాణం 9 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా. గత ఐదేళ్లలో హెల్త్‌కేర్‌ విభాగంలో ఈ విభాగం ఒక ఆశాకిరణంగా కొనసాగుతోంది. లివర్‌ పనితీరు నుంచి, కొలెస్ట్రాల్‌ వరకు తమ ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకోవాలన్న అభిలాష దేశ ప్రజల్లో పెరుగుతోందని గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ నివేదిక పేర్కొంది. ఈ అవగాహనే ఈ రంగానికి ఆదాయన్ని తెచ్చిపెడుతోంది. 

 

డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్‌, మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌, థైరోకేర్‌ టెక్నాలజీస్‌ ఈ మూడు లిస్టెడ్‌ డయోగ్నోస్టిక్‌ కంపెనీలు. 2018-19లో అమ్మకాల వృద్ధి, మార్జిన్ల స్థిరత్వం, ఆర్‌వోసీఈ 30 శాతానికి పైగా ఉండడం, క్యాష్‌ ఫ్లో సౌకర్యంగా ఉండడం వంటి అంశాలను ఈ కంపెనీల ఆర్థిక నివేదికల ఆధారంగా ఎడెల్‌వీజ్‌ గుర్తించింది. డాక్టర్‌ పాత్‌ ల్యాబ్స్‌ ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే ఇప్పటికే 52 శాతానికి పైగా రాబడులను ఇచ్చింది. బ్రాండ్‌ పరంగా బలంగా ఉండడం ఈ కంపెనీకి కలిసొచ్చే అంశం. బీ2సీ విభాగంలో బలమైన వృద్ధి నమోదు చేసింది. మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ కూడా ఈ ఏడాది ఏప్రిల్‌లో స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్‌ కాగా, ఇష్యూ ధరతో చూస్తే 46 శాతం రాబడులు ఇచ్చింది. థైరోకేర్‌ మాత్రం తక్కువగా కేవలం 7 శాతం రాబడులను ఇచ్చింది. 

 

‘‘డాక్టర్‌ లాల్‌పాథ్‌ల్యాబ్స్‌ వీటిల్లో మెరుగ్గా ఉంది. ఎందుకంటే బ్రాండ్‌ పరంగా మంచి పేరున్నది కావడమే. ఈ కంపెనీ ఎక్కువగా బీ2సీ విభాగంపై ఆధారపడింది. ఈ స్టాక్‌కు అక్యుములేట్‌ రేటింగ్‌ ఇస్తున్నాం. కాకపోతే మిగిలిన కంపెనీలతో పోలిస్తే పాథ్‌ల్యాబ్స్‌ వ్యాల్యూషన్‌ ఖరీదుగా ఉంది. వ్యాల్యూషన్‌ పరంగా ఈ మూడింటి మధ్య తీవ్ర అంతరం ఉంది. డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్‌, మెట్రోపోలిస్‌ విలువ థైరోకేర్‌ కంటే రెట్టింపులో ఉంది’’ అని ప్రభుదాస్‌ లీలాధర్‌ అనలిస్ట్‌ సురజిత్‌పాల్‌ తెలిపారు. లాల్‌ పాథ్‌ల్యాబ్స్‌ 55 పీఈలోను, మెట్రోపోలిస్‌ 50 పీఈలో ట్రేడవుతున్నాయి. థైరోకేర్‌ మాత్రం 30 పీఈలో అందుబాటులో ఉంది. వ్యాల్యూషన్‌ పరంగా చౌకగా ఉన్నందున మిగిలిన రెండింతో పోలిస్తే తాను మాత్రం థైరోకేర్‌ను ఎంచుకుంటానని పాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతానికి డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్‌ షేరుకు స్ట్రాంగ్‌బై రేటింగ్‌, బై రేటింగ్‌, హోల్డ్‌ రేటింగ్‌ మొత్తం 14 ఉన్నాయి. సెల్‌, స్ట్రాంగ్‌ రేటింగ్‌లు మూడున్నాయి. మెట్రో పోలిస్‌కు బై రేటింగ్‌లు మూడు, ఒకటి హోల్డ్‌ రేటింగ్‌, రెండు సెల్‌ రేటింగ్‌లు ఉన్నాయి. థైరోకేర్‌కు బై రేటింగ్‌లు ఐదు, హోల్డ్‌ రేటింగ్‌ ఒకటి ఉంది.You may be interested

మరోసారి సార్వభౌమ గోల్డ్‌ బాండ్‌ ఇష్యూ

Monday 21st October 2019

పండుగల సందర్భంగా బంగారానికి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పౌర్వభౌమ బంగారం బాండ్ల ఇష్యూను ఈ నెల ఆరంభంలో ఒకసారి తీసుకురాగా, తాజాగా మరో ఇష్యూను కూడా చేపట్టింది. ఈ నెల 7 నుంచి 11 వ తేదీ వరకు సౌర్వభౌమ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019-20 - సిరీస్‌-5 ఇష్యూను తీసుకొచ్చింది. మళ్లీ పది రోజుల వ్యవధిలోనే మరో ఇష్యూను ప్రకటించి ఆశ్చర్యపరించింది. దీనికి ప్రధాన కారణం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలపై బ్రోకరేజ్‌లు పాజిటివ్‌

Monday 21st October 2019

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక ఫలితాలను శనివారం విడుదల చేసింది. ఇతర మార్గాల నుంచి ఆదాయాలు అధికంగా రావడం, స్థిరమైన రుణ వృద్ధి కారణంగా ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకున్నాయి. దీంతో ఈ బ్యాంక్‌ షేర్లకు అనలిస్టులు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించారు. ఇక బ్యాంకు ఈ క్యూ2లో రూ.6, 638 కోట్ల నికరలాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఆర్జించిన

Most from this category