News


కునాల్‌ బోత్రా నుంచి 3స్టాక్‌ సిఫార్సులు

Monday 24th February 2020
Markets_main1582538683.png-32047

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం సెన్సెక్స్‌ ఏకంగా 807 పాయింట్లను కోల్పోయి 40,363 వద్ద, నిఫ్టీ 242 పాయింట్ల నష్టంతో 11850 దిగువున 11,838 వద్ద ముగిశాయి. ఈ నేపథ్యంలో  ప్రముఖ మార్కెట్‌ అనలిస్ట్‌ కునాల్‌ బోత్రా ట్రేడింగ్‌ పరంగా మూడు స్టాక్స్‌ను ఆయన సూచించారు. అందులో ఎస్‌బీఐ, మణప్పురం షేర్లను కొనమని సిఫార్సు చేస్తూ, ఎస్‌ఆర్‌ఎఫ్‌ షేరును విక్రయించమని సలహానిచ్చారు. ఇప్పుడు ఆయా షేర్లపై బోత్రా సంపూర్ణ విశ్లేషణలు ఇప్పుడు చూద్దాం...

షేరు పేరు: మణప్పురం ఫైనాన్స్‌ 
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.188
స్టాప్‌ లాస్‌: రూ.176

విశ్లేషణ: నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో సేవలు అందిస్తోంది. మిడ్‌క్యాప్‌ కంపెనీ. మార్కెట్‌ క్యాప్‌ రూ.14884.55 కోట్లుగా ఉంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం నాటికి కంపెనీ మొత్తం అమ్మకాలు రూ.1399.02 కోట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు క్వార్టర్‌లో నమోదైన మొత్తం రూ.1286.79 కోట్లతో పోలిస్తే ఇవి 8.72శాతం ఎక్కువ. వార్షిక ప్రాతిపాదిన పోలిస్తే... 29.40శాతం అధికం. ఇదే డిసెంబర్‌క్వార్టర్‌లో మొత్తం నికరలాభం రూ.402.23కోట్లుగా నమోదయ్యాయి. 31-12-2019 నాటికి, కంపెనీ మొత్తం 8.5 కోట్ల షేర్లను కలిగి ఉంది.

షేరు పేరు: ఎస్‌బీఐ
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.344.0
స్టాప్‌ లాస్‌: రూ.323

విశ్లేషణ: బ్యాంకింగ్‌ రంగంలో సేవలు అందిస్తోంది. 1955 సంవత్సరంలో విలీనమైంది. కంపెనీ మొత్తం మార్కెట్‌ క్యాప్‌ రూ.292414.90కోట్లుగా ఉంది. డిసెంబర్‌ క్వార్టర్‌ నాటికి వార్షిక ప్రాతిపాదిక వడ్డీ ఆదాయం 15.63 శాతం వృద్ది చెంది రూ.49570.01 కోట్లుగా నమోదైంది. క్వార్టర్‌ టు క్వార్టర్‌ 6.43శాతం పెరిగింది. తాజా త్రైమాసికంలో రూ.6797.25  నికర లాభాన్ని బ్యాంక్ నివేదించింది. 

షేరు పేరు: ఎస్‌ఆర్‌ఎఫ్‌
రేటింగ్‌: అమ్మవచ్చు
టార్గెట్‌ ధర: రూ.4112
స్టాప్‌ లాస్‌: రూ.4180

విశ్లేషణ: డైవర్సిఫైడ్ విభాగంలో సేవలు అందిస్తోంది. 1970 లో విలీనమైంది. ఇది ఒక పెద్ద క్యాప్ సంస్థ. కంపెనీ మార్కెట్‌ ‍క్యాప్‌ రూ. 23955.00 కోట్లుగా ఉంది. త్రైమాసిక ప్రాతిపదికన డిసెంబర్‌ క్వార్టర్‌లో మొత్తం అమ్మకాలు 6.19శాతం క్షీణించి రూ.1807.45 కోట్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 5.23శాతంగా క్షీణించాయి. తాజాగా కంపెనీ నికర లాభం రూ.342.99 కోట్లుగా నమోదైంది. 



You may be interested

సెన్సెక్స్‌ 807 పాయింట్లు క్రాష్‌

Monday 24th February 2020

242 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ మరోసారి ఈక్విటీ మార్కెట్లను ముంచిన కరోనా వైరస్‌ భయాలు ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లల్లో కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలు మరోసారి తెరపైకి సోమవారం దేశీయ మార్కెట్‌ భారీ నష్టాలను మూటగట్టుకుంది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ ఏకంగా 807 పాయింట్లను కోల్పోయి 40,363 వద్ద, నిఫ్టీ 242 పాయింట్ల నష్టంతో 11850 దిగువన 11,838 వద్ద ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌

స్టాప్‌లాస్‌తో స్వల్పకాలానికి రికమండేషన్స్‌

Monday 24th February 2020

జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ మారికో, బీవోబీ, టాటా స్టీల్‌, ఐటీసీ   గత వారం కన్సాలిడేషన్‌ మధ్య ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 12,100 స్థాయికి చేరింది. ఈ వారం ఫిబ్రవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు కారణంగా మార్కెట్లు మరోసారి హెచ్చుతగ్గులను చవిచూసే వీలున్నదంటున్నారు విశ్లేషకులు. కరోనా ఆందోళనలతో ప్రస్తుతం నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్‌ దిగువన ట్రేడవుతోంది. దీంతో ఈ వారం నిఫ్టీ పుంజుకునే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా..

Most from this category