News


ఈ మూడు చిన్న షేర్లకూ రెక్కలు!

Thursday 20th February 2020
Markets_main1582191100.png-31963

థామస్‌ కుక్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌
సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రా, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ జూమ్‌

ముందురోజు హైజంప్‌ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా మూడు స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. జాబితాలో థామస్‌ కుక్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చోటు చేసుకున్నాయి., వివరాలు చూద్దాం.. 

థామస్‌ కుక్‌ ఇండియా
ఇటీవల కొంత కాలంగా పతన బాటలో సాగిన ట్రావెల్‌ లీజర్‌ కంపెనీ థామస్‌ కుక్‌ ఇండియా కౌంటర్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనలను పరిశీలించేందుకు బోర్డు ఈ నెల 26న సమావేశంకానున్నట్లు తాజాగా థామస్‌ కుక్‌ ఇండియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2.40 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో థామస్‌ కుక్‌ ఇండియా షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 8.25 ఎగసి రూ. 49.50 వద్ద ఫ్రీజయ్యింది. గత రెండు నెలల్లో ఈ షేరు 41 శాతం పతనంకావడం గమనార్హం!

సింప్లెక్స్‌  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
కంపెనీలో ఈక్విటీ వాటాను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేయనుందన్న వార్తల నడుమ మౌలిక రంగ కంపెనీ సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 54 వద్ద ట్రేడవుతోంది. అదానీ గ్రూప్‌కాకుండా మరో రెండు పీఈ సంస్థలు సైతం సింప్లెక్స్‌లో వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. రుణ ఒత్తిళ్లలో పడ్డ సింప్లెక్స్‌ ప్రమోటర్లతో అదానీ గ్రూప్‌ ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌
ఆప్టికల్‌ కనెక్టివిటీ సొల్యూషన్స్‌, నెట్‌వర్క్‌ సర్వీసుల విభాగంలో తాజాగా రూ. 1500 కోట్ల విలువైన ఆర్డర్లు పొందినట్లు స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ షేరు దాదాపు 3 శాతం లాభపడి రూ. 114 వద్ద ట్రేడవుతోంది. తొలుత 7 శాతం పుంజుకుని రూ. 119 వరకూ ఎగసింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ నికర లాభం 38 శాతం క్షీణించి రూ. 91 కోట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే.You may be interested

ఈ లార్జ్‌క్యాప్స్‌ మీ పోర్టుఫోలియోలో ఉన్నాయా??

Thursday 20th February 2020

డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం కొన్ని లార్జ్‌క్యాప్స్‌ను ప్రముఖ బ్రోకరేజ్‌లు తమ టాప్‌ పిక్స్‌గా పేర్కొన్నాయి. అలాంటి టాప్‌ లార్జ్‌క్యాప్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి... మోతీలాల్‌ ఓస్వాల్‌ సిఫార్సులు 1. హెచ్‌యూఎల్‌: క్యు3లో కంపెనీ రూ. 1616 కోట్ల లాభం నమోదు చేసింది. కమోడిటీల వ్యయాలు తగ్గడం కలిసివచ్చింది. స్థూల ఆర్థిక వాతావరణం ఇంకా మెరుగుపడకున్నా కంపెనీ మాత్రం మంచి పనితీరునే కొనసాగిస్తుందని అంచనా. 2. హెచ్‌డీఎఫ్‌సీ: కంపెనీ లాభం గృహ్‌ ఫైనాన్స్‌, బంధన్‌

మరో రూ.1000 కోట్లు చెల్లించిన వోడాఫోన్‌ ఐడియా

Thursday 20th February 2020

న్యూఢిల్లీ: వోడాఫోన్‌ ఐడియా ఏజీఆర్‌ చెల్లింపుల్లో భాగంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డీఓటీ)కు గురువారం మరో రూ.1000 కోట్లు చెల్లించినట్లు కంపెనీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఏజీఆర్‌ బాకీలకు సంబంధించి సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సోమవారం వోడాఫోన్‌ ఐడియా డీఓటీకు రూ.2500 కోట్లను చెల్లించిన సంగతి తెలిసింది. డీఓటీ గణాంకాల బట్టి సవరించి స్థూల ఆదాయం లెక్కల ప్రకారం టెల్కో నుంచి లైసెన్సు ఫీజులు,

Most from this category