News


ఈ మూడు రంగాల్లో నెగిటివ్‌ సర్‌ప్రైజ్‌!

Friday 18th October 2019
Markets_main1571395170.png-28986

క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌
సెప్టెంబర్‌ త్రైమాసికంలో కార్పొరేట్‌ బ్యాంకులు, మెటల్స్‌, ఆటో రంగాల కంపెనీలు కోలుకుంటాయని ఎక్కువమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ఈ మూడు రంగాల్లో నెగిటివ్‌ సర్‌ప్రైజ్‌ ఉండొచ్చని క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ నీరజ్‌ దివాన్‌ అభిప్రాయపడుతున్నారు. వీటిలో ఇంకా నెగిటివ్‌ వార్తలు రావాల్సిఉందన్నారు. అందువల్ల ఈ త్రైమాసికంలో ఫలితాలు అంతబాగా ఉండకపోవచ్చని తెలిపారు. అయితే పీఎస్‌యూ బ్యాంకులు గతంలో చవిచూసినంతటి డ్యామేజీ ఉండకపోవచ్చన్నారు. ఇప్పటికే ఈ నెగటివ్‌ వార్తల ప్రభావాన్ని ఇండస్‌ఇండ్‌, ఫెడరల్‌ బ్యాంకు ఫలితాలు ప్రతిబింబించాయని చెప్పారు. కార్పొరేట్‌ లెండర్లతో పాటు ఆటో, మెటల్‌ రంగాల్లో కూడా ఈ నెగిటివ్‌ ప్రభావం ఉంటుందన్నారు. యూఎస్‌లో ఎన్నికలు ఒక్క ఏడాదిలో ఉన్నందున ఇకపై ట్రేడ్‌వార్‌కు సంబంధించి ముందడుగులే ఉంటాయని అంచనా వేశారు. బ్రెగ్జిట్‌కు బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆమోదం లభిస్తే మార్కెట్లలో పాజిటివ్‌ సెంటిమెంట్‌ పెరుగుతుందన్నారు. క్రమంగా అంతర్జాతీయ ఆందోళనలు సద్దుమణుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మెటల్స్‌లో ఎంపికచేసిన కౌంటర్లలో కొనుగోళ్లుండొచ్చన్నారు. 
వీటిపై బుల్లిష్‌
ప్రస్తుతానికి ఇన్‌ఫ్రా విభాగంపై మాత్రమే తాను పాజిటివ్‌గా ఉన్నట్లు నీరజ్‌ తెలిపారు. వినిమయ రంగంలో గోద్రేజ్‌ కన్జూమర్‌, డాబర్‌ షేర్లు బాగుంటాయని, కానీ ఇవి ఇప్పటికే ర్యాలీ చేసినందున కొత్త పొజిషన్లు తీసుకునే ముందు కొంత వేచిచూస్తానని తెలిపారు. మిడ్‌క్యాప్స్‌లో వెంకీస్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌పై బుల్లిష్‌గా ఉన్నట్లు చెప్పారు. ఈ షేర్లు బాగా కుంగుబాటు చూశాయని, కానీ ఇంకా వాటిలో పిక్‌అప్‌ర్యాలీ రాలేదని తెలిపారు. వివిధ రంగాల్లో వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉండి, ఎలాంటి ఆకస్మిక ఇబ్బందులు ఉండవని భావించిన కంపెనీలను ఎంచుకోవాలని సూచించారు. ఎన్‌బీఎఫ్‌సీల్లో సైతం ఆందోళన తగ్గుముఖం పడుతోందని, ఇందులో కూడా నాణ్యమైన కంపెనీలను ఎంచుకోవచ్చని చెప్పారు. 



You may be interested

ఆరోరోజూ అదే జోరు ...!

Friday 18th October 2019

246 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ 11650పై ముగిసిన నిఫ్టీ  మార్కెట్‌ లాభాలు ఆరో రోజూ కొనసాగాయి. సెన్సెక్స్‌ 246.32 పాయింట్లు పెరిగి 39,298.38 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 75.50 పాయింట్లు లాభంతో 11,661.85 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కొనసాగుతుండం, ఇప్పటివరకు క్యూ2 ఫలితాలను ప్రకటించిన కంపెనీలు అంచనాలకు మించి ఉండటం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి లాభాల ట్రేడింగ్‌ ఈక్విటీ కొనుగోళ్లకు కారణమయ్యాయి. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,

ఆటో రంగంలో బజాజ్‌,టీవీఎస్‌, మారుతి షేర్లే బెటర్‌!

Friday 18th October 2019

‘ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యనైనా తీసుకుంటుందనే ఆలోచన మార్కెట్‌ వర్గాలలో పెరుగుతోంది. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికి మార్కెట్‌ సెంటిమెంట్‌ మాత్రం బలపడుతుందనే విషయాన్ని గమనించాలి’ అని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సీఈఓ, నిశ్చల్ మహేశ్వరి ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... పీఎస్‌యూ బ్యాంక్‌లకు దూరం.. ఎస్‌బీఐ, బ్యాంక్‌ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌యూ బ్యాంక్‌లు)ను మినహాయిస్తే, చాలా

Most from this category