News


మూడు రంగాలు ఆకర్షణీయం

Tuesday 1st January 2019
Markets_main1546327586.png-23345

మార్కెట్‌ నిపుణుడు జీతెన్‌ పరమార్‌ సలహా
ఒక కంపెనీ షేరు దాని ఇంట్రెన్సిక్‌ విలువ కన్నా బాగా తక్కువగా ఉన్నప్పుడు దాన్ని కొనుగోలు చేయవచ్చని ప్రముఖ అనలిస్టు జీతెన్‌ పరమార్‌ సూచించారు. ఇలాంటి కాంట్రా ఇన్వెస్టింగ్‌ చాలా సార్లు మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. మార్కెట్లో నిరాశా పూరిత వాతావరణం ఉన్నప్పుడు ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ తరహా కాంట్రా పెట్టుబడితో రెట్టింపు లాభాలు పొందవచ్చన్నారు. కొత్త సంవత్సరానికి క్యాపిటల్‌ గూడ్స్‌, ఇన్‌ఫ్రా, సిమెంట్‌ రంగాల షేర్లు కాంట్రా ఇన్వెస్టింగ్‌కు అనువుగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఎకానమీలో చాలా రోజుల తర్వాత ప్రైవేట్‌ పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. సామర్ధ్య వినియోగ స్థాయిలు పెరిగే కొద్దీ ప్రైవేట్‌పెట్టుబడి ఊపందుకుంటోందని చెప్పారు. ఈ సందర్భంలో పై మూడు రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. 
క్యాపిటల్‌ గూడ్స్‌ రంగంంలోని కంపెనీల ఆర్డర్‌ బుక్స్‌ బలపడుతున్నాయని చెప్పారు. రైల్వే, మెట్రో, నిర్మాణ రంగాల్లో డిమాండ్‌ పెరిగిందని చెప్పారు. దీంతో పాటు ఆటోమేషన్‌ రంగం బాగా జోరు చూపుతోందని తెలిపారు. విద్యుత్‌ రంగంలో డిమాండ్‌ ఊపందుకోవాల్సిఉందన్నారు. సిమెంట్‌ రంగం చాలా గడ్డు రోజులు ఎదుర్కొందని చెప్పారు. ముడి ఉత్పత్తుల ధరలపెరగడం, లోడింగ్‌ నిబంధనలు, రవాణా ఖర్చులు ఈ రంగాన్ని కుంగదీశాయని చెప్పారు. ఈ రంగంలో ఇకపై ధరల పెరుగుదల ఉండకపోవచ్చని చెప్పారు. అయితే ఈ గడ్డు కాలంలో చాలా కంపెనీలు సామర్ధ్య విస్తరణ చేసుకున్నాయని చెప్పారు. రియల్టీ కూడా సిమెంట్‌తో పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపారు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని జితేన్‌ చెప్పారు. జీఎస్‌టీ రేట్లు తగ్గడం కలిసివచ్చే అంశమని వివరించారు. ఇన్‌ఫ్రా రంగంలో రోడ్ల నిర్మాణ రంగం ఆకర్షణీయంగా ఉందన్నారు. ఈ మూడు రంగాల్లో కంపెనీలను ఎంచుకునేముందు వాటి ట్రాక్‌ రికార్డు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు. You may be interested

ఈ స్టాకులు బుల్లిష్‌!

Tuesday 1st January 2019

సోమవారం ముగింపు ప్రకారం 63 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారినకంపెనీల్లో ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌సీఎల్‌ టెక్‌, లుపిన్‌, అంబుజా సిమెంట్‌, జైశ్రీటీ, పీవీఆర్‌, ఫిలిప్‌ కార్బన్‌, మహీంద్రా సీఐఈ ఆటో, ఏజిస్‌ లాజిస్టిక్స్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌, వినతి ఆర్గానిక్స్‌, ఎస్‌పీ అపెరల్స్‌ తదితరాలున్నాయి. ఈ

నిఫ్టీ 11,000 పాయింట్లు దాటకపోవచ్చు!

Tuesday 1st January 2019

సమీప భవిష్యత్‌లో నిఫ్టీ 11,000 పాయింట్లను దాటలేకపోవచ్చని ప్రముఖ అనలిస్టు శుభమ్‌ అగర్వాల్‌ అంచనా వేశారు. జనవరి సీరిస్‌లో నిఫ్టీకి 10,500 పాయింట్ల వద్ద మద్దతు దొరుకుతుందన్నారు. ఎగువన 11,000 పాయింట్ల వద్ద నిరోధం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని బేర్‌ పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం అనుసరించాలని సూచించారు. ఇది ఒక బేరిష్‌ వ్యూహం. ఇందులో ఒక లాట్‌ ఎట్‌ ద మనీ పుట్‌ను కొనుగోలు చేసి, ఒక లాట్‌

Most from this category