News


ఈ మిడ్‌ క్యాప్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చా?

Saturday 11th January 2020
Markets_main1578736474.png-30864

కోల్టెపాటిల్‌ డెవలపర్స్‌
ఇండియన్‌ హోటల్స్‌
ర్యాలీస్‌ ఇండియా

దేశ, విదేశీ అంశాల ప్రభావంతో ఇటీవల దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య సరికొత్త గరిష్టాలను అందుకుంటున్నాయి. దేశీయంగా జీడీపీ మందగమనం, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపుసహా ఫిబ్రవరిలో వెలువడనున్న కేంద్ర బడ్జెట్‌ వంటి అంశాలకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యమిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందం, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ తగ్గింపు బాట వంటి అంశాలు కీలకంగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో దేశీ బ్రోకింగ్‌ కంపెనీలు మధ్యకాలానికి కొన్ని మిడ్‌ క్యాప్‌ కౌంటర్లపట్ల ఆశావహంగా స్పందిస్తున్నాయి. వివరాలు చూద్దాం..

కోల్టెపాటిల్‌ డెవలపర్స్‌- టార్గెట్‌ రూ. 317
షేరు ధర: రూ. 244(10న ముగింపు) 
దేశీ బ్రోకింగ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. రియల్టీ రంగ కంపెనీ కోల్టేపాటిల్‌ డెవలపర్స్‌ కౌంటర్‌కు బయ్‌ రేటింగ్‌ను ప్రకటించింది. రూ. 317 టార్గెట్‌ ధరలో కొనుగోలుకి సిఫారసు చేస్తోంది. ఇకపై కోల్టెపాటిల్‌ ఆర్థికంగా పటిష్ట పనితీరునును చూపనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం(MMR)లో ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో కంపెనీ సాధించే ప్రగతిని పరిశీలించవలసి ఉన్నట్లు స్పందించింది. ఇదే విధంగా పుణే రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో ఆర్గనైజ్‌డ్‌ కంపెనీలు ప్రవేశించడంతో కోల్టెపాటిల్‌పై పడే ప్రభావాన్ని అంచనా వేయవలసి ఉన్నట్లు పేర్కొంది. ప్రాజెక్టులపై వసూళ్ల తీరును సైతం పరిగణించవలసి ఉన్నట్లు తెలియజేసింది. 

ఇండియన్‌ హోటల్స్‌- టార్గెట్‌ రూ. 174
షేరు ధర: రూ. 138(10న ముగింపు) 
దేశీ బ్రోకింగ్‌ సంస్థ నిర్మల్‌ బంగ్‌.. తాజ్‌ గ్రూప్‌ హోటళ్ల నిర్వాహక దిగ్గజం ఇండియన్‌ హోటల్స్‌ షేరు కొనుగోలుకి సిఫారసు చేస్తోంది. ఆతిథ్య రంగానికి చెందిన ఈ టాటా గ్రూప్‌ కంపెనీ షేరుకి రూ. 174 టార్గెట్‌ ధరను ప్రకటించింది. ఆతిథ్య రంగంలో గత జనవరి(2019)లో కనిపించిన పటిష్ట రికవరీ తదుపరి తొమ్మిది నెలల్లో కొనసాగలేదని నిర్మల్‌ బంగ్‌ పేర్కొంది. అయినప్పటికీ ఇండియన్‌ హోటల్స్‌ పనితీరు ఆకట్టుకున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో డిసెంబర్‌ క్వార్టర్‌లో నికర లాభం 36 శాతం జంప్‌చేయగలదని భావిస్తోంది. ఆదాయం సైతం 14 శాతంపైగా పుంజుకోగలదని అంచనా వేసింది. కొత్తగా రూములను జత చేసుకోవడం ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది.
 

ర్యాలీస్‌ ఇండియా- టార్గెట్‌ రూ. 215
షేరు ధర: రూ. 186(10న ముగింపు) 
టాటా గ్రూప్‌ కంపెనీ ర్యాలీస్‌ ఇండియా కౌంటర్‌కు దేశీ బ్రోకింగ్‌ సంస్థ ఎమ్‌కే.. బయ్‌ రేటింగును ప్రకటించింది. అగ్రి కెమికల్స్‌ తయారీ ఈ కంపెనీ షేరుకి రూ. 215 టార్గెట్‌ ధరను ఇచ్చింది. ఎగుమతులు పుంజుకోవడం ద్వారా ర్యాలీస్‌ ఆదాయం 14 శాతం పెరగనున్నట్లు ఎమ్‌కే అంచనా వేసింది. మెరుగైన నిర్వహణ కారణంగా మార్జిన్లు బలపడనున్నట్లు భావిస్తోంది. దేశీయంగానూ విక్రయాలు పెరుగుతుండటంతో నికర లాభం 27 శాతం జంప్‌చేయనున్నట్లు ఎమ్‌కే అంచనా వేస్తోంది. You may be interested

ఎర్నింగ్స్‌, బడ్జెట్‌ కీలకం!

Saturday 11th January 2020

జిమిత్‌ మోదీ ఈ వారమంతా మార్కెట్లు ఆశకు, భయానికి మధ్య తీవ్ర ఊగిసలాట చూశాయి. ఒకపక్క ఇరాన్‌ సంక్షోభంతో భయాలు, మరోపక్క ఎర్నింగ్స్‌పై అంచనాలు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీంతో నిఫ్టీ 11970 స్థాయిని, 12300 పాయింట్ల స్థాయిని ఈ వారంలో చవిచూసింది. రిటైలర్లు, ఎఫ్‌పీఐలు కొనుగోళ్లు తగ్గించినా, సిప్‌ల్లోకి మాత్రం నిధుల ప్రవాహం కొనసాగింది. బడ్జెట్‌ ముందు స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో అధిక యాక‌్షన్‌ ఉండొచ్చని అంచనాలున్నాయి. లార్జ్‌ క్యాప్స్‌

2020కి యస్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు

Saturday 11th January 2020

కొత్త ఏడాదిలో ఆరు అధిక రాబడినిచ్చే స్టాకులతో యస్‌ సెక్యూరిటీస్‌ మోడల్‌ పోర్టుఫోలియోను అప్‌డేట్‌ చేసింది. 1. అశోక్‌ లేలాండ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 100. వాణిజ్యవాహన విభాగంలో సైక్లిక్‌ రికవరీకి అవకాశాలున్నాయి. దీంతో కంపెనీ ముందుగా లాభపడనుంది. కంపెనీ వచ్చే రెండేళ్ల పాటు ఎబిటా, ఈపీఎస్‌లో వరుసగా 26, 38 శాతం చక్రీయ వార్షిక వృద్ధి నమోదు చేయవచ్చు. ప్రస్తుతం వాల్యూషన్లు గరిష్ఠాల వద్ద ఉన్నాయి. ఇలా వాల్యూషన్లు సైక్లిక్‌

Most from this category