News


మూడు బ్యాంకులపై కోటక్‌ బుల్లిష్‌

Wednesday 13th November 2019
Markets_main1573667309.png-29563

కోటక్‌ సెక్యూరిటీస్‌ మూడు ప్రైవేటు బ్యాంకులపై బుల్లిష్‌గా ఉంది. అవి ఐసీఐసీఐ బ్యాంకు, కరూర్‌వైశ్యా బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు. రానున్న కాలంలో వీటి ఆర్థిక పనితీరు బాగుంటుందని అంచనా వేస్తోంది. కోటక్‌ సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌ సంజీవ్‌ జర్బాడే ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇలా ఉంది. 

 

మార్కెట్ల మూడ్‌  ఏ విధంగా ఉండనుంది?
మందగమనం ఇంకా కొనసాగుతోంది. వినియోగ డిమాండ్‌ తగ్గుముఖం పట్టింది. అమ్మకాల వృద్ధిపై అందోళనలు ఉన్నాయి. కానీ, కంపెనీ ఫలితాలను గమనిస్తే అమ్మకాల్లో వృద్ధి చక్కగా ఉంది. సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి కంపెనీల ఫలితాలపై అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే, స్థూల మార్జిన్లు మెరుగుపడ్డాయి. బ్యాంకింగ్‌లో పన్నుకు ముందస్తు లాభం (పీబీటీ) ఎంతో బాగుంది. మొత్తం మీద ఫలితాల సీజన్‌ అంచనాల కంటే మెరుగ్గానే ఉంది. వచ్చే రెండు నెలల్లో ఎటువంటి సంకేతాల్లేవు. మార్కెట్‌ స్థిరీకరణ దశలో కొనసాగొచ్చు. ఇప్పుడిక మరిన్ని సంస్కరణలను ప్రభుత్వం నుంచి మార్కెట్‌ ఆశిస్తోంది. జీఎస్‌టీ ఆదాయ గణాంకాలు ప్రకటించాల్సి ఉంది. ఐఐపీ డేటా ప్రతికూలంగా ఉంది. ప్రభుత్వం నుంచి సంస్కరణల చర్యలు ఉంటే, మార్కెట్లలో కచ్చితంగా ఉత్సాహం నెలకొంటుంది. ఇతర అంశాలను చూస్తే.. ఎఫ్‌ఐఐలు కొనుగోలు చేస్తున్నా కానీ, దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ అమ్మకాల వైపున్నాయి. ఒకవేళ ఇరు వర్గాలూ అమ్మకాలకు దిగితే మార్కెట్లు కనిష్ట స్థాయిలకు వెళతాయి. 

 

ప్రైవేటు బ్యాంకుల్లో ఏవి సూచిస్తారు?
ప్రైవేటు బ్యాంకుల్లో రుణ ప్రొవిజన్లు గణనీయంగా తగ్గాయి. కొత్తగా ఎన్‌పీఏలు కూడా తగ్గాయి. రుణాల వృద్ధి బలహీనంగా ఉంది. రెండేళ్ల కాలంలో ప్రైవేటు బ్యాంకుల రాబడుల రేషియో మంచి స్థాయికి చేరుతుంది. ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు, కరూర్‌ వైశ్యా బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు పట్ల బుల్లిష్‌గా ఉన్నాం. రానున్న కాలంలో వీటి రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ కచ్చితంగా మెరుగుపడుతుంది. మీడియాలో ప్రింట్‌ మీడియా పట్ల నెగెటివ్‌గా, బ్రాడ్‌కాస్టింగ్‌ (డిజిటల్‌ చానళ్లు) విభాగంలో జీఎంటర్‌టైన్‌మెంట్‌ పట్ల పాజిటివ్‌గా ఉన్నాం.



You may be interested

ఈ స్టాక్స్‌ ‘వ్యాల్యూ బై’

Wednesday 13th November 2019

వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ విధానంలో స్టాక్స్‌ను చౌకగా ఉన్నప్పుడే సొంతం చేసుకోవాలి. అంటే చౌకగా ఉన్నప్పుడు కొనుగోలు చేయడం, మంచి విలువ వచ్చే వరకు వేచి చూడడాన్ని వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌గా చెబుతారు. బీఎస్‌ఈ లిస్టెడ్‌ స్టాక్స్‌ డేటాను గమనిస్తే.. 45 స్టాక్స్‌ పోటీ కంపెనీలతో పోలిస్తే చౌకగా కనిపిస్తూ, వృద్ధి దిశగా సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. వీటిల్లో లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఇవి...   రెఫెక్స్‌

11850 దిగువన ముగిసిన నిఫ్టీ

Wednesday 13th November 2019

మిడ్‌సెషన్‌ నుంచి బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లలో అనూహ్య అమ్మకాలతో మార్కెట్‌ బుధవారం భారీ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 229 పాయింట్లు కోల్పోయి 40,116 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 73 పాయింట్లు నష్టపోయి 11850 దిగువున 11,840 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 574 పాయింట్లు నష్టపోయి 30,541 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌

Most from this category