News


హెచ్‌ఎస్‌బీసీ నుంచి 3 అటో స్టాక్స్‌ రికమెండేషన్లు

Thursday 9th January 2020
Markets_main1578553982.png-30798

ఈ ఏడాదిలో వాహనరంగాలకు డిమాండ్‌ పెరగకపోతే ఆటోమొబైల్ షేర్లు ఇన్వెస్టర్లకు ఆశించినస్థాయిలో ఆదాయాలను ఇవ్వడం అసాధ్యమని హెచ్‌ఎస్‌బీసీ బ్రోకరేజ్‌ సంస్థ అంటోంది. దేశీయ అటోరంగం 2019 ఏడాదిలో ఈ దశాబ్దంలో అతిపెద్ద గడ్డు పరిస్థితిని ఎదుర్కోంది. స్ధూల ఆర్థిక వ్యవస్థ బలహీనత, వ్యవస్థలో ద్రవ్య కొరత, పన్ను ఉద్దీపన చుట్టూ అనిశ్చితి, కఠినతరమైన నిబంధనలు డిమాండ్‌ను ప్రభావితం చేశాయని బ్రోకరేజ్‌ సంస్థ తన నివేదికలో తెలిపింది. అయితే ఈ ఏడాదిలో డిమాండ్‌ పుంజుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా పాసింజర్‌ వాహన విభాగంలో విక్రయాలు పెరగవచ్చని హెచ్‌ఎస్‌బీసీ పేర్కోంది. ఈ సందర్భంగా హెచ్ఎస్‌బీసీఐ మూడు అటోరంగ షేర్లను సిఫార్సు చేస్తుంది. 

షేరు పేరు: బజాజ్‌ అటో
ప్రస్తుత ధర: రూ.3060
రేటింగ్‌: కొనవచ్చ
టార్గెట్‌ ధర: రూ.3,600
ఆదాయపు అంచనా: 18శాతం
విశ్లేషణ: బలమైన ఎగుమతి పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఉద్గార, రక్షణ నిబంధనలు ద్వారా ప్రభావితం కాదు. బలహీన డిమాండ్‌ నేపథ్యంలో తక్కువ వాల్యూమ్స్‌ నమోదుకావచ్చనే అంచనాలతో ఆర్థిక సంవత్సరం 2021 ఆదాయ అంచనాలను 2శాతం తగ్గిస్తున్నట్లు హెచ్‌ఎస్‌బీఎస్‌ తెలిపింది. 

షేరు పేరు: మహీంద్రా అండ్‌ మహీంద్రా
ప్రస్తుత ధర: రూ.524
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.780
ఆదాయ అంచనా: 49శాతం 
విశ్లేషణ: షేరు బై రేటింగ్‌ను కేటాయించడంతో పాటు ఈ ఏడాదిలో షేరు 49శాతం రాబడిని ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. బలహీనమైన డిమాండ్ వాతావరణం నేతృత్వంలో తక్కువ వాల్యూమ్‌లకు నమోదు కావచ్చనే అంచనాల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం 2021 ఆదాయ అంచనాలను 3శాతం తగ్గిస్తున్నామని హెచ్‌ఎస్‌బీఎస్‌ తెలిపింది

షేరు పేరు: ఎస్కార్ట్స్‌
ప్రస్తుత ధర: రూ.613
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.780
ఆదాయ అంచనా: 35శాతం

విశ్లేషణ: బలమైన ఆపరేటింగ్ పనితీరు, ఈక్విటీపై రాబడిలో మెరుగుదల కారణంగా బ్రోకరేజ్  సంస్థ ఈ స్టాక్‌ను 15 రెట్లు 12 నెలల ఫార్వర్డ్ ప్రైస్ టు ఆదాయాలు (పిఇ) నిష్పత్తికి, 5 సంవత్సరాల చారిత్రక సగటుకు 15శాతం ప్రీమియంగా నిర్ణయించింది. ఆర్థిక సంవత్సరం 21 ఆదాయ అంచనాల కంటే పస్తుత షేరు విలువ 10రెట్లు అధికంగా ఉండటం షేరు కలిసొచ్చే అంశమని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. You may be interested

షుగర్‌, పీఎస్‌యూ సైక్లికల్స్‌ ఆకర్షణీయం!

Thursday 9th January 2020

కొటక్‌ పీఎంఎస్‌, సీఐవో అన్షుల్‌ సైగల్‌ ఇరాన్‌, అమెరికా మధ్య నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వృద్ధి అవకాశాలను ధరలో ప్రతిబింబించని కంపెనీలవైపు దృష్టి సారించనున్నట్లు కొటక్‌ పీఎంఎస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ అన్షుల్‌ సైగల్‌ చెబుతున్నారు. ఇంకా మార్కెట్ల తీరు, మిడ్‌ క్యాప్స్‌లో పెట్టుబడులు తదితర అంశాలపై ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం... గతంలో అంటే 2003-05 మధ్య ఇరాక్‌

ఈ ర్యాలీకి కారణాలేంటి?

Thursday 9th January 2020

దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లోకి మరలాయి. నిఫ్టీ బలంగా 12150 పాయింట్లపైన 12190 పాయింట్ల వద్ద కదలాడుతోంది. బుధవారం అమెరికా మార్కెట్లు బలంగా క్లోజవడం, గురువారం ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ఉండడంతో దేశీయ మార్కెట్లు కూడా బలమైన గ్యాప్‌ అప్‌తో ఓపెనయ్యాయి. అనంతరం వెనుకంజ వేయకుండా ముందుకే కొనసాగాయి. మార్కెట్లో ఇంత బలమైన ర్యాలీకి కారణాలను నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు. 1. ఇరాన్‌ దాడులపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించకపోవడం: ఇరాక్‌లోని

Most from this category