News


ఈ స్టాకుల్లో ఎంఏసీడీ బై సిగ్నల్స్‌!

Tuesday 28th January 2020
Markets_main1580194050.png-31265

సోమవారం ముగింపు ప్రకారం 26 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోంది. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఐబీ హౌసింగ్‌, యాక్సిస్‌బ్యాంక్‌, ఆర్‌ఈసీ, హశ్రీచ్‌పీసీఎల్‌, కర్నాటక్‌ బ్యాంకు, టెక్‌మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్‌, ఏఫిల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ, బామర్‌ అండ్‌ లౌరీ, శిల్పా మెడికేర్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 47 షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. ఎల్‌ఐసీ హౌసింగ్‌, బయోకాన్‌, ఆప్‌టెక్‌, గాడ్‌ఫ్రేఫిలిప్స్‌, రైన్‌ ఇండస్ట్రీస్‌, అవంతి ఫీడ్స్‌, జిందాల్‌ సా, కోల్‌గేట్‌ పామోలివ్‌, సీఈఎస్‌సీ, ఫోర్స్‌ మోటర్స్‌, ట్రెంట్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
ఎంఏసీడీ అంటే..
మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ షేరు టార్గెట్‌ పెంపు!

Tuesday 28th January 2020

క్యూ3 ఫలితాల నేపథ్యం బ్రోకింగ్‌ సంస్థల తాజా అంచనాలు మార్టిగేజ్‌ రుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ ఈ ఏడాది(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన నేపథ్యంలో పలు బ్రోకింగ్‌ సంస్థలు ఈ కౌంటర్‌పట్ల ఆశావహంగా స్పందిస్తున్నాయి. కంపెనీ ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో స్టాండెలోన్‌ ప్రాతిపదికన నాలుగు రెట్లు అధికంగా రూ. 8372 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు గృహ ఫైనాన్స్‌, బంధన్‌ బ్యాంక్‌ మధ్య విలీనంకారణంగా లభించిన రూ. 9020

స్థిరంగా పుత్తడి

Tuesday 28th January 2020

రూ.40,500 వద్ద స్థిరంగా పసిడి  గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం ఎంసీఎక్స్‌లో రూ.40,500 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.  ఈరోజు 10.45 గంటల సమయంలో క్రితం రోజు ముగింపుతో పోలిస్తే రూ.53ల తగ్గుదలతో 10 గ్రాముల బంగారం ధర 40,532.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సోమవారం 10 గ్రాముల పసిడి ధర రూ.40,722.00 గరిష్టస్థాయిని చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు క్రితంరోజుస్థాయిలోనే ఔన్స్‌ బంగారం ధర 1,579.25  డాలర్ల వద్ద

Most from this category