News


ఈ స్టాక్స్‌... మార్కెట్లకు ఎదురీత

Friday 9th August 2019
Markets_main1565373932.png-27673

గత ఏడాదిన్నరగా స్టాక్‌ మార్కెట్లో మిడ్‌క్యాప్‌, ‍స్మాల్‌క్యాప్‌ విభాగాలు ఇన్వెస్టర్లకు నికరంగా నష్టాలనే మిగిల్చాయి. బీఎస్‌ఈలో 90 శాతం నష్టాల పాలైన స్టాక్సే ఉన్నాయి. దీంతో వీటిల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఎక్కువ శాతం తుడిచిపెట్టుకుపోయినట్టుగానే భావించాలి. కానీ, ఓ 26 స్టాక్స్‌కు మాత్రం దీనికి మినహాయింపు. ఇవి సమస్యాత్మక కాలంలోనూ ఏటికి ఎదురీదాయి. 

 

ఇంత క్లిష్ట సమయాల్లోనూ ఇన్వె‍స్టర్లకు మంచి రాబడులు ఇచ్చిన కంపెనీలు కెమికల్స్‌, కన్జ్యూమర్‌ ఫుడ్‌, ఫార్మా, షిప్పింగ్‌, టెలికం, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, ఎన్‌బీఎఫ్‌సీ రంగాల నుంచి ఉన్నాయి. కోస్టల్‌ కార్పొరేషన్‌ షేరు గతేడాది జనవరి 1న రూ.16.90 దగ్గర ఉంటే, తాజా ధర రూ.252. ఏకంగా 1,370 శాతం ర్యాలీ చేసింది. దీని తర్వాత గ్రాండ్యూర్‌ ప్రొడక్ట్స్‌ 557 శాతం, లీడింగ్‌ లీజింగ్‌ ఫైనాన్స్‌ 549 శాతం, డార్జిలింగ్‌ రోప్‌వే 530 శాతం మేర పెరిగాయి. తియాన్‌ ఆయుర్వేదిక్‌, శాటియా ఇండస్ట్రీస్‌, క్యాపిటల్‌ ఇండియా, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ హెల్త్‌, యూగ్రో క్యాపిటల్‌ ఇండస్ట్రీస్‌ 200-500 శాతం మధ్య పెరిగాయి. 

 

‘‘నిరాశావాదం ఉన్న సమయంలో సూచీలు బోటమ్‌ అవుట్‌ అవుతాయని ఎదురు చూడడం సరికాదు. ఇప్పటికే బోటమ్‌ అవుట్‌ అయిన స్టాక్స్‌ కూడా ఉన్నాయి. లేదా బోటమ్‌కు దగ్గర్లో ఉన్నవి ఉన్నాయి. ఎందుకంటే ఎర్నింగ్స్‌ మూమెంటమ్‌ వాటికి సానుకూలంగానే ఉంది’’అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ ఎండీ రామ్‌దేవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. మాస్ట్రోస్‌ ఎలక్ట్రానిక్స్‌, అపోలో ఫిన్‌వెస్ట్‌, ఈస్ట్‌ వెస్ట్‌ హోల్డింగ్స్‌, జంప్‌ నెట్‌వర్క్స్‌, సాధన నైట్రో కెమ్‌, ఐవోఎల్‌ కెమికల్స్‌, కవిట్‌ ఇండస్ట్రీస్‌, రెస్పాన్సివ్‌ ఇండస్ట్రీస్‌, ప్రభాత్‌ టెక్నాలజీస్‌, వ్యాలియంట్‌ ఆర్గానిక్స్‌, సీమెక్‌, అపోలో ట్రికోట్‌ ట్యూబ్స్‌ నూరు శాతం వరకు పెరిగాయి. అయితే, గత పనితీరు భవిష్యత్తుకు గ్యారంటీ కాదని, ఇన్వెస్ట్‌ చేసే ముందు ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సాయం తీసుకోవడం లేదా సొంతంగా అధ్యయనం చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. You may be interested

రెండు రోజుల్లో భారీ ర్యాలీ... ఏమై ఉంటుంది?

Friday 9th August 2019

ఊహించని విధంగా స్టాక్‌ మార్కెట్లు గురు, శుక్రవారాల్లో భారీ ర్యాలీ చేశాయి. కనిష్ట స్థాయిల్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపించడం మంచి లాభాలకు తోడ్పడ్డాయి. దీని వెనుక అంశాలను పరిశీలిస్తే...    ఎఫ్‌ఫీఐలపై సర్‌చార్జీ బడ్జెట్లో అధిక ఆదాయ వర్గాలపై ఆదాయపన్ను సర్‌చార్జీని ప్రభుత్వం భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది. రూ.2-5 కోట్ల మధ్య ఆదాయం కలిగిన వారిపై 15 శాతం నుంచి 25 శాతానికి, రూ.5 కోట్లకుపైగా ఆదాయం కలిగిన వారిపై 15 శాతం

ఎల్‌ఐసీ ఐపీఓ.. నిజమైతే చాలా పాజిటివ్‌!

Friday 9th August 2019

గౌరవ్‌గార్గ్‌, క్యాపిటల్‌ వయా రిసెర్చ్‌ లిమిటెడ్‌ డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీని ఐపీఓకి తెచ్చే ఆలోచన చాలా పాజిటివ్‌ ముందడుగని క్యాపిటల్‌ వయా గ్లోబల్‌ రిసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌గార్గ్‌ చెప్పారు. ఈ దఫా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 1.05 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే ఎల్‌ఐసీని లిస్టింగ్‌కు తీసుకురావడం మంచిదన్న ఆలోచనలో ఉంది. ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి దాదాపు 74

Most from this category