News


25 షేర్లు బుల్లిష్‌గా మారాయ్‌!

Tuesday 25th February 2020
Markets_main1582613097.png-32072

ఎంఏసీడీ సంకేతాలు
దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 25 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో అంబుజా సిమెంట్స్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, ఎస్‌బీఐ లైఫ్‌, హికాల్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌; సీఎస్‌బీ బ్యాంక్‌, వెంకీస్‌ ఇండియా, కొచిన్‌ షిప్‌యార్డ్‌, జీఎస్‌కే ఫార్మా తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. మరోవైపు 26 షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. ఐసీఐసీఐ బ్యాంకు, అరబిందో ఫార్మా, ఎస్‌జేవీఎన్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఫిలిప్‌ కార్బన్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
ఎంఏసీడీ అంటే...
మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

 ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  You may be interested

52 వారాల కనిష్టానికి 99 షేర్లు

Tuesday 25th February 2020

మంగళవారం 99 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో 3P ల్యాండ్‌ హోల్డింగ్స్‌, A2Z ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, అధునిక్‌ ఇండస్ట్రీస్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, అర్కోటెక్‌, భారత్‌ గేర్స్‌, బిల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, బిర్లా టైర్స్‌, బ్రూన్‌పూర్‌ సిమెంట్‌, కెనరా బ్యాంక్‌, సీఅండ్‌ సీ కన్‌స్ర్టక్షన్స్‌, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సొల్యూషన్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీస్‌, సీఎల్‌ ఎడ్యూకెట్‌, సీఐఎల్‌

టీవీఎస్‌ మోటార్‌ 3% శాతం డౌన్‌

Tuesday 25th February 2020

మంగళవారం టీవీఎస్‌ మోటార్‌ షేరు 3 శాతం పడిపోయింది.రూ.16.10 తగ్గి  రూ.422.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది.కోవిడ్‌-19 ప్రభావంతో టూ వీలర్‌, త్రీవీలర్‌ విడిభాగాల దిగుమతులు ఆగిపోవడంతో టీవీఎస్‌ కంపెనీ వాహన ఉత్పత్తి 10 శాతం ఆగిపోయిందని చెన్నై కేంద్రంగా పనిచేస్తోన్న టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ వెల్లడించింది. దీంతో టీవీఎస్‌ మోటార్‌ షేరు విలువ పడిపోయింది.కాగా BS-VI  వాహనాల తయారీ కావాల్సి విడిభాగాలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కంపెనీ వెల్లడించింది.

Most from this category