News


25 స్టాకుల్లో బుల్లిష్‌ సంకేతాలు!

Tuesday 30th July 2019
Markets_main1564470633.png-27409

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
బుల్లిష్‌ సిగ్నల్స్‌
సోమవారం ముగింపు ప్రకారం 25 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, మైండ్‌ట్రీ, బల్‌రామ్‌పూర్‌ చిని, జయశ్రీటీ, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, జీఎన్‌ఎఫ్‌సీ, సుజ్లాన్‌; ఆప్‌టెక్‌, జీహెచ్‌సీఎల్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌, శాలిమర్‌ పెయింట్స్‌ తదితరాలున్నాయి.ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 33 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. డిష్‌టీవీ, వేదాంత, అంబుజా సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్‌, ఐజీఎల్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, హెచ్‌యూఎల్‌, రేనుకా సుగర్స్‌, బీఈఎంఎల్‌, పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్‌, అలెంబిక్‌ ఫార్మా తదితరాలు ఈ జాబితాలో ఉన్నాయి. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. 



You may be interested

క్షీణించిన ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు

Tuesday 30th July 2019

మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్ల పతనం కొనసాగుతుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతనిథ్యం వహించే పీఎస్‌యూ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం మిడ్‌సెషన్‌ సమయానికి దాదాపు 2.50 శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,853.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒకదశలో దాదాపు 2శాతం మేర నష్టపోయి 2778.55ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది.

రెండు రెట్లు పెరిగిన డీఎల్‌ఎఫ్‌ లాభం

Tuesday 30th July 2019

రూ.415 కోట్లకు నికర లాభం  న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం, డీఎల్‌ఎఫ్‌ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రెండు రెట్లు పెరిగింది. గత క్యూ1లో రూ.173 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.415 కోట్లకు పెరిగిందని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. రూ.297 కోట్ల అసాధారణ ఆదాయం కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,658 కోట్ల నుంచి రూ.1,541 కోట్లకు

Most from this category