News


ఎంఏసీడీ ప్రకారం ఈ షేర్లలో బుల్లిష్‌ సంకేతాలు!

Tuesday 18th February 2020
Markets_main1582003853.png-31886

సోమవారం ముగింపు ప్రకారం దేశీయ సూచీల్లో  24 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ముత్తూట్‌ ఫైనాన్స్‌; టొరెంట్‌ పవర్‌, బీజీఆర్‌ ఎనర్జీ, లుపిన్‌, మయూర్‌ యూనికోటర్స్‌, గ్రీవ్స్‌ కాటన్‌, ఏసియన్‌ హోటల్స్‌-వెస్ట్‌, నీల్‌కమల్‌, బ్లుడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, టీటీకే ప్రెస్టేజ్‌, శక్తి సుగర్స్‌, హుమ్‌టమకీ పీపీఎల్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 53 షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్‌, జిందాల్‌స్టీల్‌, బజాజ్‌ ఆటో, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, డాబర్‌ఇండియా, సన్‌టీవీ, అరబిందోఫార్మా, ఈఐహెచ్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, జిల్లెట్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
ఎంఏసీడీ అంటే..
మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  



You may be interested

జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ జూమ్‌

Tuesday 18th February 2020

నష్టాల మార్కెట్లోనూ షేరు  5 శాతం ప్లస్‌ జీఎంఆర్‌ కమలంగ ఎనర్జీ(జీఈఎల్‌)లో పూర్తి వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో ప్రయివేట్‌ రంగ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ ఈ షేరు లాభాలతో కళకళలాడుతోంది. ఉదయం 10.45 ప్రాంతంలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4.5 శాతం జంప్‌చేసి రూ. 66 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 68.4 వరకూ ఎగసింది.

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం క్రాష్‌..!

Tuesday 18th February 2020

బ్యాంకింగ్‌ రంగ షేర్లు మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 30,661.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టెలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలను 'స్వల్పంగా చెల్లించినప్పటికీ, బ్యాంకింగ్‌ రంగంలో మొండి రుణాలపై ఆందోళనలతో ఇన్వెస్టర్లు అటు ప్రభుత్వ బ్యాంక్‌, ఇటు ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లను

Most from this category