ఆరు నెలల్లో ఎక్కువ లాభాలు తినిపించాయ్...
By Sakshi

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు కొత్త రికార్డు స్థాయిలను నమోదు చేయడంతోపాటు కన్సాలిడేషన్ దశలో ఉన్నాయి. జూలై 5న కేంద్ర బడ్జెట్ సమీప కాలంలో మార్కెట్ల దిశను నిర్ణయిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సెన్సెక్స్ 40,312, నిఫ్టీ 12,103 స్థాయిలను నమోదు చేశాయి. అయితే, ఇదే ఆరు నెలల కాలంలో ఇన్వెస్టర్ల సంపద నికరంగా రూ.6 లక్షల కోట్ల మేర పెరిగినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల సగటు మార్కెట్ క్యాపిటలైజేషన్ గత డిసెంబర్ 31 నాటికి రూ.144.8 లక్షల కోట్లుగా ఉంటే, అది 2019 జూన్ 21 నాటికి రూ.150.47 లక్షల కోట్లకు పెరిగింది. సెన్సెక్స్ 8.67 శాతం, నిఫ్టీ 8 శాతం మేర పెరిగాయి. కానీ, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ మాత్రం 5.2 శాతం, స్మాల్‌క్యాప్ 4.2 శాతం మేర ఈ ఏడాది ఇప్పటి వరకు నష్టపోవడం గమనార్హం. కొన్ని స్టాక్స్ మాత్రం ఇన్వెస్టర్లకు లాభాలను తినిపించాయి. బీఎస్ఈ500లో 100కు పైగా స్టాక్స్ బెంచ్‌మార్క్‌తో పోలిస్తే మంచి పనితీరును చూపించాయి. బీఎస్ఈ500లో 123 స్టాక్స్ 10-50 శాతం మధ్య పెరిగాయి. వీటిల్లో 24 స్టాక్స్ జనవరి-జూన్ మధ్య కాలంలో 30 శాతానికి పైగా పెరిగినవే. వీటిల్లో డీసీబీ బ్యాంకు, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, పీఐ ఇండస్ట్రీస్, జస్ట్ డయల్, ఎస్ఆర్ఎఫ్, మణప్పురం ఫైనాన్స్, స్పైస్‌జెట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఓరియంట్ సిమెంట్, టైటాన్ కంపెనీ ఉన్నాయి. ముఖ్యంగా స్పైస్‌జెట్ 53 శాతం, మణప్పురం 53 శాతం, ఎస్ఆర్ఎఫ్ 50 శాతం చొప్పున పెరిగాయి. పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, రిలయన్స్ నిప్పన్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ, గుజరాత్ గ్యాస్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, ఐనాక్స్ లీజర్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, సోమాని సిరామిక్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, మహారాష్ట్ర స్కూటర్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, ఇలా పెరిగిన స్టాక్స్‌లో వాటాలను విక్రయించి లాభాలు స్వీకరించాలా లేక కొనసాగాలా? అన్నది ఇన్వెస్టర్ల ముందున్న ప్రశ్న. ‘‘వీటిల్లో చాలా స్టాక్స్ వేగంగా పెరిగి పై స్థాయిల్లో నిలబడడానికి కారణం అవి మంచి ఫలితాలను ప్రకటించడమే. అలాగే, ఎర్నింగ్స్ అవకాశాలు బలంగా ఉన్నవి. పోటీ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను అవకాశాలుగా తీసుకుని మార్కెట్ వాటా పెంచుకున్నవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు విమానయానంలో స్పైస్‌జెట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎన్బీఎఫ్సీలో బజాజ్ ఫైనాన్స్ కంపెనీలు’’ అని కోటక్ సెక్యూరిటీస్‌కు చెందిన రుష్మిక్ ఓజా తెలిపారు. ఇప్పటికే బాగా దిద్దుబాటుకు గురై, డౌన్‌సైడ్ పరిమితంగా ఉన్న వాటిల్లో మంచి స్టాక్స్‌ను కొనుగోలు చేసుకోవడం మంచిదని, కొన్ని నెలల తర్వాత ఇవి కోలుకోవచ్చని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో రూ.100 కోట్ల కంటే మార్కెట్ క్యాప్ తక్కువగా ఉన్న కంపెనీల్లో 31 కంపెనీలు 100 నుంచి 500 శాతం మధ్య పెరిగినవీ ఉన్నాయి. వీటిల్లో 7ఎన్ఆర్ రిటైల్, సీమెక్, సీహెచ్‌డీ కెమికల్స్, ఇండో యూఎస్ బయోటెక్, భిల్వారా స్పిన్నర్స్ ఉన్నాయి. అయితే, ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుంటూ, అసాధారణంగా పెరిగిన స్టాక్స్ విషయంలో పెట్టుబడులను పునర్వర్గీకరించుకోవాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్‌హెడ్ దీపక్ జసానీ తెలిపారు.
You may be interested
లార్జ్‌క్యాప్‌లో వ్యాల్యూ స్టాక్స్
Monday 24th June 2019సెన్సెక్స్, నిఫ్టీ వ్యాల్యూషన్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. సెన్సెక్స్ ఐదేళ్ల సగటు పీఈ 21 అయితే, ప్రస్తుత పీఈ 28. అయితే, అలా అని ప్రధాన సూచీల్లోని స్టాక్స్ అన్నింటిలోనూ వ్యాల్యూషన్లు అధికంగా ఏమీ లేవు. కొన్ని అయితే, చాలా తక్కువ వ్యాల్యూషన్కే అందుబాటులో ఉన్నాయి. ఈ విభాగంలో విలువ ఆధారిత రెండు స్టాక్స్‌ను వ్యాల్యూ రీసెర్చ్ సంస్థ సూచించింది. జీ ఎంటర్టైన్మెంట్ సుభాచ్ చంద్ర ఆధ్వర్యంలోని ఎస్సెల్ గ్రూపు
ఇండియామార్ట్ ఐపీఓకు తొలిరోజు 12 శాతం సబ్‌స్ర్కిప్షన్
Monday 24th June 2019ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు తొలిరోజైన సోమవారం మధ్యాహ్నం వచ్చిన ఇండియామార్ట్ ఇంటర్ మెస్ సంస్థ 12 శాతం షేర్లకు మాత్రమే బిడ్లను రాబట్టగలిగింది. కంపెనీ మొత్తం 26,92,824 షేర్లను ఐపీఓలో పెట్టగా 3,17,610 షేర్ల కోసం బిడ్లు దాఖాలయ్యాయి. ఐసీఐసీఐ మూచ్యువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మూచ్యువల్ ఫండ్, ఎస్బీఐ మూచ్యువల్ ఫండ్ వంటి15 యాంకర్ ఇన్వెస్టర్లు శుక్రవారం 21,95,038 షేర్లను ధర శ్రేణి రూ.970-973.... పై హద్దు వద్ద కొనుగోలు చేశాయి.