News


234 షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌!

Tuesday 21st May 2019
Markets_main1558427625.png-25862

సోమవారం ముగింపు ప్రకారం 234 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, అశోక్‌లేలాండ్‌, అదానీ పోర్ట్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐబీ రియల్‌ఎస్టేట్‌, అదానీ గ్రీన్‌, భెల్‌, ఎన్‌బీసీసీ, ఓఎన్‌జీసీ, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, ఐడీబీఐ బ్యాంక్‌, టాటా పవర్‌, అలహాబాద్‌ బ్యాంక్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు ఇన్ఫోసిస్‌, సొనాటా సాఫ్ట్‌వేర్‌, కొఠారీ ప్రొడక్ట్స్ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. 
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.



You may be interested

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Tuesday 21st May 2019

నష్టాల మార్కెట్లో మెటల్‌ షేర్లు కరిగిపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ సమయానికి 2శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా నాల్కో షేరు 5శాతం నష్టపోయింది. ఏపిఎల్‌అపోలో, వెల్‌స్పన్‌ కార్ప్‌ 4.50శాతం పతనమయ్యాయి. టాటాస్టీల్‌, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌ షేర్లు 2.50శాతం క్షీణించాయి. సెయిల్‌, ఎన్‌ఎండీసీ, హిందాల్కో, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. వాటితో పాటు వేదాంత, కోల్‌ ఇండియా, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పై పేటెంట్‌ ఉల్లంఘన కేసు

Tuesday 21st May 2019

అమెరికాలో వ్యాజ్యం దాఖలు చేసిన ఫ్లాష్‌ ఎలక్ట్రానిక్స్‌  న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ సంస్థ ఫ్లాష్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా, ఐచర్‌ మోటార్స్‌కు చెందిన రాయల్‌ఎన్‌ఫీల్డ్‌కు వ్యతిరేకంగా అమెరికా న్యాయ స్థానంలో పేటెంట్‌ ఉల్లంఘన కేసు దాఖలు చేసింది. ద్విచక్ర వాహనంలో వినియోగించే ఓ ఉపకరణం పేటెంట్‌ను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఉల్లంఘించినట్టు ఆరోపించింది. ఫ్లాష్‌ ఎలక్ట్రానిక్స్‌కు రెగ్యులేటర్‌ రెక్టిఫయర్‌ డివైజ్‌, అవుట్‌పుట్‌ ఓల్టేజ్‌ రెగ్యులేటింగ్‌ విధానానికి  అమెరికా పేటెంట్‌, ట్రేడ్‌ మార్క్‌ ఆఫీసు

Most from this category