News


2020లో పెట్టుబడులకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బెట్స్‌

Tuesday 31st December 2019
Markets_main1577784659.png-30563

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌: 2020 స్టాక్‌ పిక్స్‌
విభిన్న రంగాల నుంచి 23 స్టాక్స్‌ ఎంపిక
జాబితాలో ఫైనాన్స్‌, ఆటో, ఫార్మా, టెక్‌ సెక్టార్స్‌

దేశీ రీసెర్చ్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కొత్త ఏడాది(2020)లో పెట్టుబడులకు అనువైన 23 స్టాక్స్‌ను ఎంపిక చేసింది. వీటిని విభిన్న రంగాల నుంచి ఎంచుకుంది. జాబితాలో ఫైనాన్షియల్స్‌, కన్జూమర్‌, ఫార్మా, ఇండస్ట్రియల్స్‌, ఆయిల్‌, ఆటోమొబైల్‌, సిమెంట్‌, టెక్నాలజీ రంగాలకు చోటు లభించడం గమనార్హం. గత మూడు నెలల్లో దేశీయంగా స్టాక్‌ మార్కెట్లలో నెలకొన్న ర్యాలీకి దేశ, విదేశీ అంశాలు కారణమైనట్లు  ఈ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ నోట్‌లో అభిప్రాయపడింది. కొన్ని ఎంపిక చేసిన ఇండెక్స్‌ స్టాక్స్‌ మాత్రమే ర్యాలీకి కారణమైనట్లు పేర్కొంది. అంటే ఇన్వెస్టర్లు నాణ్యమైన కంపెనీలపట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేసింది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌, తక్కువ రుణ భారం, పటిష్ట ఫండమెంటల్స్‌కు ప్రాధాన్యం లభించినట్లు వివరించింది. రక్షణాత్మక పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తూ ఇన్వెస్టర్లు ముందుకు సాగుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపేన్‌ సేథ్‌ తెలియజేశారు. వెరసి డజను స్టాక్స్‌ మాత్రమే భారీస్థాయిలో ర్యాలీ చేసినట్లు వివరించారు. కాగా.. ఆర్థిక మందగమనం, కంపెనీల మిశ్రమ ఫలితాలు వంటి అంశాల నేపథ్యంలోనూ దేశ, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించడం గమనించదగ్గ అంశమని చెప్పారు. ఇతర వివరాలు చూద్దాం..

బడ్జెట్‌పై అంచనాలు
అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార పరిస్థితులు, ప్రభుత్వ సంస్కరణలపై అంచనాలు, ఫిబ్రవరిలో వెలువడనున్న బడ్జెట్‌పై ఆశలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ప్రభుత్వం.. జీఎస్‌టీ, రెరా, ఐబీసీ, పన్ను కోతలు వంటి పలు సంస్కరణలు తీసుకువచ్చినప్పటికీ మరిన్నింటిని రూపొందించవలసి ఉంటుంది. రెండోదఫా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ మరింత కఠినంగా వ్యవహరించే అవకాశముంది. 2020 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యకరమైన నిర్ణయాలు ప్రకటిం‍చవచ్చు. కాగా.. స్టాక్స్‌ సిఫారసు జాబితాలో బ్యాంకింగ్‌ విభాగం నుంచి యాక్సిస్‌, ఎస్‌బీఐ.. ఐటీ నుంచి ఇన్ఫోసిస్‌, సొనాటా.. కన్జూమర్‌ రంగంలో బ్రిటానియా, సింఫనీ..తదితరాలు చోటుసాధించాయి. 

ఎంపిక వెనుక
ఆర్థిక మందగమనం నేపథ్యంలోనూ ఇప్పటికే మొండిబకాయిలతో కుదేలైన ఫైనాన్షియల్‌ రంగం ఇకపై రికవరీ బాటపట్టే వీలుంది. బలమైన కంపెనీలకు అవకాశాలు పెరగనున్న అంచనాలు ఈ రంగంలోని స్టాక్స్‌ ఎంపికకు కారణంకాగా.. వృద్ధి కొనసాగనుందన్న అంచనాలతో ఎస్‌బీఐ లైఫ్‌కు ప్రాధాన్యమిచ్చామంటున్నారు సేథ్‌. ఈ బాటలో వినియోగ షేర్లు ఖరీదుగా ఉన్నప్పటికీ వృద్ధి అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలియజేశారు. ఇక టెక్నాలజీ విభాగంలో ఫ్రీక్యాష్‌ ఫ్లోస్‌, డివిడెండ్‌ ఈల్డ్స్‌ తదితరాలు కీలకంగా నిలిచాయి. సిమెంట్‌లో మార్కెట్‌ లీడర్‌తోపాటు వేగంగా ఎదుగుతున్న కంపెనీలను ఎంపిక చేశాం. ఇన్‌ఫ్రాలో స్థిరమైన పనితీరు చూపుతున్న కేఎన్‌ఆర్‌, హెల్త్‌కేర్‌ విభాగంలో దేశీయంగా దృష్టిపెట్టిన టొరంట్‌ ఫార్మా తదితరాలను సిఫారసు చేస్తున్నట్లు తెలియజేశారు.

కొత్త ఏడాది కొత్తకొత్తగా..                                               

సెక్టార్‌  కంపెనీ పేరు షేరు ధర(రూ.)   టార్గెట్‌
    31-12-19 రూ.లలో
ఫైనాన్షియల్స్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ 760 958
  స్టేట్‌బ్యాంక్‌ 337 404
  సిటీయూనియన్‌ 232  261
  చోళమండలం ఇన్వెస్ట్‌ 304 404
  ఎస్‌బీఐ లైఫ్‌ 989 1230
ఐటీ& న్యూఏజ్‌ ఇన్ఫోసిస్‌ 737 840
  ఎల్‌అండ్‌టీ టెక్‌ 1479 1705
  టీమ్‌లీజ్‌ 2524 3415
  సొనాటా సాఫ్ట్‌వేర్‌ 305 405
కన్జూమర్‌ సింఫనీ 1162  1888
  జూబిలెంట్‌ ఫుడ్‌ 1627 2184
  బ్రిటానియా 3042 3638
  డాబర్‌ 460 512
  వీమార్ట్‌  1639 2150
సిమెంట్‌ అల్ట్రాటెక్‌ 4056 5350
  జేకే సిమెంట్‌ 1160 1523
ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ గుజరాత్‌ గ్యాస్‌ 226 270
  ఆల్కిల్‌ అమైన్స్‌ 1069  1840
ఆటోమొబైల్స్‌ బజాజ్‌ ఆటో 3242 3530
లాజిస్టిక్స్‌ కంటెయినర్‌​ కార్ప్‌  573   640
ఫార్మాస్యూటికల్స్‌ టొరంట్‌ ఫార్మా 1870 2100
ఇండస్ట్రియల్స్‌& ఇన్‌ఫ్రా
 
 ఎల్‌అండ్‌టీ 1300 1703
  కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ 234  378 You may be interested

ఐటీసీ సహా 46 షేర్లు బుల్లిష్‌!

Tuesday 31st December 2019

ఎంఏసీడీ సంకేతాలు మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు

వెలుగులోకి ప్రభుత్వరంగ షేర్లు : గెయిల్‌ ఇండియా 2శాతం ర్యాలీ

Tuesday 31st December 2019

నష్టాల మార్కెట్లో ప్రభుత్వ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా మంగళవారం మిడ్‌సెషన్‌ కల్లా బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1శాతం లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌ 6,931.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  ప్రభుత్వరంగ షేర్లైన కోల్‌ ఇండియా, గెయిల్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఎన్‌టీపీసీ, ఆర్‌ఈసీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్లు షేర్లు 2శాతం నుంచి 1శాతం లాభపడ్డాయి. బీహెచ్‌ఈఎల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్‌,

Most from this category