News


210 షేర్లు ఏడాది కనిష్టానికి ...

Tuesday 18th June 2019
Markets_main1560843254.png-26383

మార్కెట్లో మిడ్‌సెషన్‌ సమయానికి ఆరంభలాభాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి స్థిరమైన ర్యాలీ దేశీయ మార్కెట్‌కు అండగా నిలుస్తున్నాయి. మధ్యాహ్నం గం.1:00ని.లకు సెన్సెక్స్‌ 185 పాయింట్లు పెరిగి 39,145.09 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లను ఆర్జించి 11,723.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఒక్క ఎఫ్‌ఎంసీజీ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. బ్యాంకింగ్‌, ఆర్థిక, మెటల్‌ రంగ షేర్లు అత్యధికంగా లాభపడుతున్నాయి. 
ఎన్‌ఎస్‌ఈలో 210 షేర్లు ఏడాది కనిష్టానికి:- 
సూచీలు లాభాల్లో కదలాడుతున్నప్పటీకీ.., ఎన్‌ఎస్‌ఈలో 210 షేర్లు ఏడాది కనిష్టానికి పతనమయ్యాయి. వాటితో అగర్వాల్‌ ఇండస్ట్రీయల్‌ కార్పోరేషన్‌, ఏషియన్‌ హోటల్స్‌, అమరరాజా బ్యాటరీస్‌, అలెంబిక్స్‌ ఫార్మాస్యూటికల్స్‌, అతుల్‌ అటో, బేయర్‌ కార్ప్‌సైన్స్‌, భారత్‌ ఫోర్జ్‌, బయోకాన్‌ షేర్లు తాజాగా 52-వారాల కనిష్టానికి చేరుకున్నాయి. వాటితో పాటు బోరోసిల్‌ గ్లాస్‌ వర్క్స్‌, కేడిల్లా హెల్త్‌కేర్‌, సైయంట్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఇమామి, ఎస్కార్ట్స్‌, హెచ్‌ఈజీ, హిందూస్థాన్‌ జింక్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, లక్ష్మీ మెషన్‌ వర్క్స్‌, మన్‌పసంద్‌ బేవరీజెస్‌, మోనోశాటో ఇండియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌, టాటా స్పాంజ్‌ ఐరన్‌, షేర్లు ఏడాది కనిష్టానికి చేరుకున్నాయి. ఇక ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన నిఫ్టీ-50 ఇండెక్స్‌లో ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫ్రాటెల్‌, ఏషియన్‌ పేయిం‍ట్స్‌, బ్రిటానియా, హిందూస్థాన్‌యూనిలివర్‌ షేర్లు టాప్‌ - 5 లూజర్లుగా కొనసాగుతున్నాయి.
మరో 5 షేర్లు ఏడాది గరిష్టానికి:- 
మరోవైపు మార్కెట్‌ ర్యాలీ భాగంగా 6 షేర్లు మాత్రం 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. డిజికాంటెంట్‌, మంధనా ఇండస్ట్రీస్‌, ఓసీఎల్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌, పీఐ ఇండస్ట్రీస్‌, ప్రకాశ్‌ ఫైప్స్‌ షేర్లు ఏడాది గరిష్టస్థాయిలను అందుకున్నాయి. ఇదే సమయనికి ఎన్‌ఎస్‌ఈలోని ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ -50 ఇండెక్స్‌లో జీ లిమిటెడ్‌, ఇండస్‌ఇండ్, ఐసీఐసీఐ బ్యాంక్‌, వేదాంత, పవర్‌గ్రిడ్‌ షేర్లు టాప్‌ -5 గెయినర్లుగా ట్రేడ్‌ అవుతున్నాయి.You may be interested

నిఫ్టీలో మరింత పతనానికి ఛాన్స్‌?!

Tuesday 18th June 2019

గత మూడు వారాల కనిష్ఠ స్థాయి 11,769ని బ్రేక్‌ చేస్తూ నిఫ్టీ ఈ వారం 1.25శాతం నష్టంతో 11,672 వద్ద మొదలైంది. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 11,450-11,500 వద్ద మద్దతు లభించనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే నిఫ్టీ 11,655 వద్ద 20 రోజుల ఎక్స్‌పోనెన్సియల్‌ మూవింగ్‌ ఏవరేజి(ఈఎమ్‌ఏ)ని దాటేసిందని, ఇప్పుడు 50రోజుల ఈఎమ్‌ఏ కి చేరువలో ఉందని నిపుణులంటున్నారు. మే 20న వెలువడిన ఎక్సిట్‌ పోల్స్‌ తరువాత నిఫ్టీ 11,426

స్పెన్సర్‌ రిటైల్‌లో వాటాల కొనుగోలు చేసిన పొరింజు

Tuesday 18th June 2019

పొరింజు వెలియత్‌కు చెందిన ఈక్యూ ఇండియా ఫండ్‌ నాలుగు లక్షల స్పెన్సర్స్‌ రిటైల్‌ షేర్లను షేరుకు రూ. 94.53 చొప్పున కొనుగోలు చేసింది. దీంతో పాటు పలు బల్క్‌డీల్స్‌ మార్కెట్లో జరిగాయి. వాటి వివరాలు... - సిల్కాన్‌ ట్రేడ్స్‌ ఎల్‌ఎల్‌పీ 96,000 ఫెలిక్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లను షేరుకు రూ.17.01 చొప్పున కొనుగోలు చేసింది. - వైట్‌ ఐరిస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ 1,93,11,255 అపోలో టైర్స్‌ షేర్లను నిఫ్టీలో షేరుకు రూ.199.77 చొప్పున కొనుగోలు

Most from this category