News


200 కౌంటర్లలో బుల్లిష్‌ సంకేతాలు

Wednesday 14th August 2019
Markets_main1565761668.png-27757

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
బుల్లిష్‌ సిగ్నల్స్‌
సోమవారం ముగింపు ప్రకారం 205 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌; హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఏసీసీ, అంబుజా సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, ఇంజనీర్స్‌ ఇండియా, బెల్‌, ఆర్‌ఈసీ, హిందుస్థాన్‌ జింక్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ తదితరాలున్నాయి.ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 10 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. లుపిన్‌, కామత్‌ హోటల్స్‌, శిల్పా మెడికేర్‌, జోసిల్‌, ఆగ్రోటెక్‌, ఎసాబ్‌ ఇండియా, ఏస్‌ ఇంటిగ్రేటెడ్‌ సొల్యూషన్స్‌తదితరాలు ఈ జాబితాలో ఉన్నాయి. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. 



You may be interested

బ్యాంకింగ్‌ షేర్లు జంప్‌

Wednesday 14th August 2019

యుఎస్‌, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై విధించాలనుకున్న 10 శాతం సుంకాన్ని వాయిదా వేయడంతో బుధవారం అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. ఫలితంగా దేశియ మార్కెట్లు కూడా సానుకూలంగా కదులుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 11.20 సమయానికి 325.60 పాయింట్లు లాభపడి 28001.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.27 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.82 శాతం లాభపడ్డాయి. మిగిలిన

కోల్‌ ఇండియా లాభం రూ.4,630 కోట్లు

Wednesday 14th August 2019

రూ.26,089 కోట్లకు మొత్తం ఆదాయం  ఈ క్యూ1లో 137 మిలయన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మైనింగ్‌ దిగ్గజం, కోల్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.4,630 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత క్యూ1లో రూ.3,786 కోట్ల నికర లాభం ఆర్జించామని కోల్‌ ఇండియా తెలిపింది. ఆదాయం అధికంగా రావడంతో ఈ క్యూ1లో నికర లాభం బాగా పెరిగిందని పేర్కొంది. గత క్యూ1లో రూ.25,359

Most from this category