News


2020లో సరికొత్త బుల్‌సైకిల్‌!

Tuesday 7th January 2020
Markets_main1578392056.png-30736

నార్నొలియా అనలిస్టు శైలేంద్రకుమార్‌
కొత్త ఏడాది ఎర్నింగ్స్‌ దన్నుతో ఈక్విటీల్లో కొత్త బుల్‌సైకిల్‌ ఆరంభమవుతుందని నార్నొలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ అనలిస్టు శైలేంద్ర కుమార్‌ అంచనా వేశారు. 2013-17 కాలంలో వేగవంతమైన ర్యాలీ జరిపిన సూచీలు తర్వాత రెండేళ్లు కన్సాలిడేషన్‌ మూడ్‌లోకి మారాయన్నారు. గతేడాది సూచీల్లో 12 శాతం పెరుగుదల ఉన్నా, విస్తృత మార్కెట్‌ భాగస్వామ్యం లోపించిందన్నారు. చాలా స్టాకులు 2017 గరిష్ఠాలకు చాలా దిగువన ట్రేడవుతున్నాయన్నారు. కొత్త ఏడాది ఇవన్నీ పుంజుకుంటాయని, కొత్త బుల్‌సైకిల్‌ ఆరంభమవుతుందని ఆయన చెప్పారు. ఇందుకు ప్రధానంగా కంపెనీల ఎర్నింగ్స్‌ మెరుగుపడడమే కారణమన్నారు. కొన్నేళ్లుగా నిఫ్టీ ఎర్నింగ్స్‌ కేవలం 5 శాతం వృద్ధితో కొనసాగుతున్నాయి. ఎర్నింగ్స్‌లో నెగిటివ్‌నెస్‌ చాలావరకు తగ్గనుందని, కార్పొరేట్‌ టాక్స్‌ కోతలు బాగా కలిసివస్తాయని తెలిపారు. 2020 డిసెంబర్‌కు నిఫ్టీ 13800 పాయింట్లను చేరవచ్చని అంచనా వేశారు. నిఫ్టీ కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరం 22 శాతం ఈపీఎస్‌ వృద్ది నమోదు చేయవచ్చన్నారు.

ఎర్నింగ్స్‌, వాల్యూషన్లను పరిశీలిస్తే కొత్త బుల్‌ సైకిల్‌లో బ్యాంకులు, కన్జూమర​ కంపెనీలు ముందుంటాయని అభిప్రాయపడ్డారు. ఈ రెండు రంగాలపై 2020లో ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు శైలేశ్‌ తెలిపారు. షేర్ల పరంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఆటో, యునైటెడ్‌ స్పిరిట్స్‌ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నట్లు చెప్పారు. గత రెండేళ్లు ఇన్వెస్టర్లకు మార్కెట్లు అనేక పాఠాలు చెప్పాయని, ముఖ్యంగా అసెట్‌ కేటాయింపు గురించి గట్టి పాఠాలు నేర్పాయని ఆయన అన్నారు. ఒక పోర్టుఫోలియో తయారు చేసుకునేముందు సరైన స్టాకుల మిశ్రమాన్ని పరిశోధించుకోవాలన్నారు. ఎంచుకున్న స్టాకుల్లోనే సమయానుకూల మార్పులు చేసుకోవాలని సూచించారు. పోర్టుఫోలియో వైవిధ్యభరితంగా ఉండడం అన్నిటికన్నా చాలా కీలకమని సలహా ఇచ్చారు. అదేవిధంగా ఒక షేరును ఎంచుకునేముందు లోతైన పరిశోధన జరపాలన్నారు. 



You may be interested

2 రోజుల నష్టాలకు చెక్‌- సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ

Tuesday 7th January 2020

అన్ని రంగాలూ లాభాల్లోనే మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ జోరు ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. సెన్సెక్స్‌ 193 పాయింట్లు ఎగసి 40,869 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 60 పాయింట్లు బలపడి 12,053 వద్ద నిలిచింది. అమెరికా, ఆసియా మార్కెట్లు పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ గరిష్టంగా 41,230ను తాకింది. తదుపరి కొంతమేర మందగించి 40,727

ఈ 4 స్టాక్స్‌ మార్కెట్లను మించాయ్‌

Tuesday 7th January 2020

ఇండిగో, జేకే టైర్‌ హెచ్‌సీసీ, పనామా పెట్రోకెమ్‌ ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో మెరుగుపడ్డ సెంటిమెంటు కారణంగా దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. వెరసి ట్రేడింగ్‌ ప్రారంభంనుంచీ కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. మధ్యాహ్నం 2.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ 145 పాయింట్లు పెరిగి 40,821కు చేరగా.. నిఫ్టీ 42 పాయింట్లు పుంజుకుని 12,035 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా ఇండిగో బ్రాండు విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌,

Most from this category