News


ఈ జనవరి చాలా బెటర్‌!

Tuesday 1st January 2019
Markets_main1546336471.png-23347

స్టాక్స్‌ ఎంపికకు అనువైనది
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ సీఐఓ ఎస్‌ నరేన్‌
ఎన్నికల కారణంగా ఈ సంవత్సరం మార్కెట్లో ఒడిదుడుకులు అధికంగా ఉండొచ్చని, అందువల్ల కొత్త ఇన్వెస్టర్లు సాధ్యమైనంత వరకు సిప్‌ మార్గాన్ని ఎంచుకోవాలని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ సీఐఓ ఎస్‌ నరేన్‌ సూచించారు. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరి స్టాక్స్‌ ఎంపికకు చాలా అనువుగా ఉందని అభిప్రాయపడ్డారు. గత జనవరిలో మార్కెట్లు భారీ వాల్యూషన్లతో ఉన్నాయని, స్మాల్‌, మిడ్‌ క్యాప్స్‌లో చాలావరకు ఓవర్‌వాల్యూడ్‌ అని చెప్పారు. కానీ ప్రస్తుతం దాదాపు 80 శాతం స్టాకుల అధిక వాల్యూషన్లు దిగివచ్చాయని వివరించారు. అందువల్ల దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఈ జనవరి చాలా అనుకూలమైనదన్నారు. అయితే ఏడాది మొత్తం మీద చూస్తే ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల సాధ్యమైనంతవరకు సురక్షిత ట్రేడింగ్‌ చేయాలని హెచ్చరించారు. ప్రస్తుతం స్టాక్స్‌ ఎంపికకు సరైన వాతావరణం కనిపిస్తోందన్నారు. గత సంవత్సరం కొన్ని స్టాకులు తప్ప చాలా వరకు నష్టాలను చవిచూశాయని, దీంతో వాల్యూషన్లు దిగివచ్చాయని తెలిపారు. చమురు ధరల పతనంతో బ్యాంకింగ్‌, ఇన్‌ఫ్రా రంగాల షేర్లను ఎంచుకోవచ్చన్నారు.
చమురే కీలకం
ఇప్పటికీ దేశీయ ఎకానమీపై ముడి చమురు ప్రభావం చాలా ఉందని నరైన్‌ చెప్పారు. ముడిచమురు ధరల్లో పెరుగుదల దేశ స్థూల ఆర్థిక గణాంకాలను ఎలా అల్లకల్లోలం చేస్తుందో ఇటీవలే చూశామని చెప్పారు. ఉన్నట్లుండి అనూహ్యంగా క్రూడ్‌ ధర భారీగా పతనం కావడంతో దేశీయంగా పలు అంశాలు పాజిటివ్‌గా మారాయని తెలిపారు. చమురు ధర దిగువ స్థాయిల్లో ఉంటే భారత వృద్ధికి ఇబ్బంది ఉండదన్నారు. ముడిచమురు ధరలో ఒక డాలర్‌ పెరుగుదల క్యాడ్‌ను 150 కోట్ల డాలర్ల మేర పెంచుతుందని చెప్పారు. అందువల్ల కొత్త సంవత్సరం అన్ని అంశాల కన్నా క్రూడాయిల్‌ ధరే మార్కెట్లను, ఎకానమీని ఎక్కువగా ప్రభావితం చేస్తుందన్నారు. ఒకవేళ తిరిగి క్రూడాయిల్‌ 80 డాలర్లకు చేరుకుంటే మార్కెట్లో ఆందోళన తప్పదన్నారు. చమురు ధరతో పాటు ఎన్నికలు, యూఎస్‌ ఫెడ్‌లు ఈ ఏడాది మార్కెట్‌ను ప్రభావితం చేయగల పెద్ద అంశాలని చెప్పారు. You may be interested

లాభాలతో బోణి

Tuesday 1st January 2019

10900లపై ముగిసిన నిఫ్టీ ఇండెక్స్‌ కొత్త ఏడాది తొలిరోజు మార్కెట్‌ లాభాలతో బోణి చేసింది. చివరి గంటలో ఫైనాన్షియల్‌, బ్యాకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సూచీలు లాభాలతో ముగిశాయి. నేడు సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ.., వెనువెంటనే నష్టాల్లోకి మళ్లాయి. మధ్యాహ్నం వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి.  మిడ్‌సెషన్‌ అనంతరం సూచీలు క్రమంగా నష్టాలను పూడ్చుకుంటూ చివరిగంటలో భారీ స్థాయిలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఇండెక్స్‌ 10,900పై ముగిసింది.

ఈ స్టాకులు బుల్లిష్‌!

Tuesday 1st January 2019

సోమవారం ముగింపు ప్రకారం 63 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారినకంపెనీల్లో ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌సీఎల్‌ టెక్‌, లుపిన్‌, అంబుజా సిమెంట్‌, జైశ్రీటీ, పీవీఆర్‌, ఫిలిప్‌ కార్బన్‌, మహీంద్రా సీఐఈ ఆటో, ఏజిస్‌ లాజిస్టిక్స్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌, వినతి ఆర్గానిక్స్‌, ఎస్‌పీ అపెరల్స్‌ తదితరాలున్నాయి. ఈ

Most from this category